పీఎస్‌యూల్లో ఓపెన్, దూరవిద్య డిగ్రీలకు ఓకే | Recognise open, distance degrees for recruitments | Sakshi
Sakshi News home page

పీఎస్‌యూల్లో ఓపెన్, దూరవిద్య డిగ్రీలకు ఓకే

Published Thu, May 31 2018 4:44 AM | Last Updated on Thu, May 31 2018 4:44 AM

Recognise open, distance degrees for recruitments

న్యూఢిల్లీ: ఉద్యోగాల భర్తీలో యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు జారీచేసే ఓపెన్, దూరవిద్య డిగ్రీలు, డిప్లొమాలను అంగీకరించాలని కేంద్రం ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ)ను ఆదేశించింది. ఓపెన్, దూరవిద్య విధానంలో పొందిన డిగ్రీలు, డిప్లొమాలను పీఎస్‌యూలు పరిగణనలోకి తీసుకోవడం లేదనే ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి సుబ్రమణ్యం ఇటీవల ప్రభుత్వరంగ సంస్థల విభాగం కార్యదర్శికి లేఖ రాశారు. ఈ లేఖపై సదరు విభాగం స్పందిస్తూ... పీఎస్‌యూల్లో బోర్డు కంటే తక్కువస్థాయి ఉద్యోగాల భర్తీని సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంట్రప్రైజెస్‌(సీపీఎస్‌ఈ) చేపడతాయని పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement