విద్యార్థులూ.. బహుపరాక్‌ | Qualifications for admissions in degree and PG courses are mandatory | Sakshi
Sakshi News home page

విద్యార్థులూ.. బహుపరాక్‌

Published Mon, Aug 17 2020 4:40 AM | Last Updated on Mon, Aug 17 2020 4:40 AM

Qualifications for admissions in degree and PG courses are mandatory - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో అనుమతులు లేని యూనివర్సిటీలు ఇతర విద్యాసంస్థల (ఫేక్‌ వర్సిటీలు, సంస్థల) పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) సూచిస్తోంది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ దూరవిద్య, ఆన్‌లైన్‌ మోడ్‌ కోర్సులు అందించే సంస్థల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. సదరు సంస్థలకు, అవి అందించే కోర్సులకు తమ గుర్తింపు ఉందో లేదోననే విషయాన్ని యూజీసీ అధికారిక వెబ్‌సైట్‌లో సూచించిన పోర్టళ్ల ద్వారా పరిశీలన చేసుకోవాలని  పబ్లిక్‌ నోటీస్‌ జారీ చేసింది. 

నిషేధిత ప్రోగ్రామ్స్‌ ఇవీ..
► ఇంజనీరింగ్, మెడిసిన్, లా, డెంటల్, ఫార్మసీ, నర్సింగ్, ఆర్కిటెక్చర్, ఫిజియోథెరపి, అగ్రికల్చర్, హోటల్‌ మేనేజ్‌మెంట్, పాక అధ్యయనాలు(కలినరీ స్టడీస్‌), వేల్యూయేషన్‌  ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌. 
► చట్టబద్ధమైన కౌన్సిల్స్, రెగ్యులేటరీ సంస్థల ద్వారా ఓడీఎల్‌  మోడ్‌లో అందించడానికి అనుమతించని ఇతర కార్యక్రమాలు. 
► ఎం.ఫిల్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు కూడా ఓడీఎల్, ఆన్‌లైన్‌ మోడ్‌లలో అందించడాన్ని నిషేధించారు. 
► ఏ విద్యాసంస్థ అయినా దానికి నిర్దేశించిన ప్రాదేశిక ప్రాంతాలకు లోబడి మాత్రమే ఓడీఎల్‌ సెషన్స్, కాంటాక్ట్‌ ప్రోగ్రామ్స్, ప్రోగ్రామ్‌ డెలివరీ, పరీక్షల నిర్వహణ, ప్రవేశాలను చేపట్టాలి. దాని ప్రాదేశిక ప్రాంత పరిధిలో మాత్రమే పనిచేయాలి. 
► కేంద్ర, రాష్ట్ర వర్సిటీలు, డీమ్డ్‌ వర్సిటీలు, ప్రైవేట్‌ వర్సిటీలు తమ ఓడీఎల్, ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌లను ప్రైవేట్‌ కోచింగ్‌ ఇనిస్టిట్యూట్స్‌ ద్వారా ఫ్రాంచైజీల తరహాలో నిర్వహించడాన్ని నిషేధించారు. కేవలం వాటి ప్రధాన కార్యాలయాల నుంచి మాత్రమే ఓడీఎల్‌ ప్రోగ్రాములను అందిస్తాయి. 
► ఏదైనా విద్యాసంస్థ వీటికి భిన్నంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటే తమకు ఫిర్యాదు చేయాలని యూజీసీ సూచించింది.  

చెక్‌ చేసుకోండి 
► ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు, ఓడీఎల్, ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌లకు అనుమతి పొందిన విద్యాసంస్థల జాబితాను 
► యూజీసీ వెబ్‌సైట్‌‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూజీసీ.ఏసీ.ఐఎన్‌/డీఈబీ’,  లేదా ‘హెచ్‌టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐఎన్‌’లలో చూడవచ్చు. 
► స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, ఓడీఎల్‌ ప్రోగ్రామ్స్‌ అందించేందుకు యూజీసీ అనుమతి పొందిన సంస్థల వివరాలను ‘హెచ్‌టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐ ఎన్‌/ఎన్‌ఓటీఐసీఈఎస్‌’ లేదా హెచ్‌టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐఎన్‌/ఎన్‌ఓటీఐసీఈఎస్‌.హెచ్‌ టీఎంఎల్‌’ పోర్టల్‌లో పరిశీలన చేసుకోవాలి. 
► ప్రవేశం పొందేముందు యూజీసీ వెబ్‌సైట్‌లోని ‘హెచ్‌టీటీపీ://డీఈబీ.యూజీసీ.ఏసీ.ఐఎన్‌’లో నోటీసుల ద్వారా తెలుసుకోవాలి. 
► కోవిడ్‌ నేపథ్యంలో ఓడీఎల్‌ ప్రోగ్రామ్స్‌ కాలవ్యవధిని 12 నెలలకు పరిమితం చేశారు. వీటిని ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నుంచి ప్రారంభించేలా అనుమతి ఇచ్చింది. 
► డిగ్రీ, పీజీ కోర్సులను ఓడీఎల్‌ మోడ్‌లో అందించే సంస్థలు తప్పనిసరిగా నిర్దేశిత అర్హతా ప్రమాణాలను పాటించాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement