’దీపం’ పేరుతో పెట్టుబడుల ఉపసంహరణ శాఖ
న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణ శాఖ(డీడీ)ను ఇకపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఏఎం-దీపం)గా వ్యవహరించనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నుంచి ఈక్విటీల్లో పెట్టుబడుల నిర్వహణ వరకూ కార్యకలాపాల విస్తృతి నేపథ్యంలో... శాఖ పేరు మార్చారు. పీఎస్‌యూల ఆర్థిక పునర్‌వ్యవస్థీకరణ.. కేపిటల్ మార్కెట్ల ద్వారా పెట్టుబడుల ఆకర్షణ వంటి పలు అంశాల్లో ప్రభుత్వానికి ఇకపై దీపం సలహాలు ఇస్తుంది. ఆర్థికమంత్రి బడ్జెట్‌లో ప్రకటనకు అనుగుణంగా కేబినెట్ కార్యదర్శి బుధవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు.