మహిళా గ్రూపులకు 7 శాతం వడ్డీకే రుణాలు | RBI directs PSU banks to give loans to women groups at 7% | Sakshi
Sakshi News home page

మహిళా గ్రూపులకు 7 శాతం వడ్డీకే రుణాలు

Published Wed, Nov 20 2013 12:37 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

మహిళా గ్రూపులకు 7 శాతం వడ్డీకే రుణాలు

మహిళా గ్రూపులకు 7 శాతం వడ్డీకే రుణాలు

ముంబై: మహిళా స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ)లకు వార్షికంగా 7 శాతం వడ్డీకే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. 150 జిల్లాలకు వర్తించే విధంగా ఆర్‌బీఐ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం సంబంధిత జిల్లాల్లో మహిళా స్వయం సహాయక గ్రూపులకు స్వర్ణజయంతి గ్రామ్ స్వరాజ్‌గార్ యోజనాఆజీవికా (ఎస్‌జీఎస్‌వై) పథకం వడ్డీ రాయితీ పథకం (ఇంట్రస్ట్ సబ్‌వెన్షన్ స్కీమ్) ప్రయోజనాలు వర్తిస్తాయి.

ఈ పథకం కింద బ్యాంకులపై పడే వడ్డీ భారాన్ని (5.5 శాతం పరిమితికి లోబడి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం భరిస్తుంది. రూ. 3 లక్షల వరకూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇకపై తీసుకునే రుణాలతోపాటు, పాత రుణాలను  సైతం ఈ పథకం కిందకు మార్చడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులకూ(ఆర్‌ఆర్‌బీ) ఈ నిర్ణయం వర్తిస్తుంది. రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే ఎస్‌హెచ్‌జీలకు  3 శాతం అదనపు రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్‌వెన్షన్ పరిమితి పొడిగింపునకు సంబంధించి అంశాన్ని ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుందని ఆర్‌బీఐ తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement