
న్యూఢిల్లీ: రుణ భారంతో సతమతమవుతున్న రిటైల్ రంగ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ తాజాగా బీమా రంగం నుంచి బయటపడే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. సమయానుగుణంగా భాగస్వామ్య సంస్థ(జేవీ) ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో తమకు గల వాటాను విక్రయించాలని భావిస్తోంది. ఈ జేవీలో ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్‌నకు 49.91 శాతం వాటా ఉంది. దీనిలో 25 శాతం వాటాను జేవీలో మరో భాగస్వామి నెదర్లాండ్స్‌కు చెందిన జనరాలి పార్టిసిపేషన్స్‌కు విక్రయించనున్నట్లు ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ పేర్కొంది. దాదాపు రూ. 1,253 కోట్ల విలువలో నగదు రూపేణా వాటాను విక్రయించనున్నట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment