హైదరాబాద్లో 15% పెరిగిన నియామకాలు | 15percent appointments incresed in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో 15% పెరిగిన నియామకాలు

Published Tue, Mar 15 2016 12:25 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హైదరాబాద్లో 15% పెరిగిన నియామకాలు - Sakshi

హైదరాబాద్లో 15% పెరిగిన నియామకాలు

న్యూఢిల్లీ: నియామకాల జోరు కొనసాగుతోంది. గతేడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో హైదరాబాద్‌లో నియామకాలు 15 శాతంమేర పెరిగాయి. ఇక దేశవ్యాప్తంగా నియామకాల వృద్ధి 18 శాతంగా నమోదయ్యింది. ఇందులో ఐటీ-సాఫ్ట్‌వేర్, ఇన్సూరెన్స్ రంగాలు కీలకపాత్ర పోషించాయని నౌకరీ.కామ్ సర్వేలో వెల్లడైంది. నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ గత నెలలో 1,937కు ఎగసింది. గతేడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఇది 18 శాతం పెరిగింది. రంగాల వారీగా చూస్తే.. ఐటీ-సాఫ్ట్‌వేర్, ఇన్సూరెన్స్ రంగాల్లో నియామకాల వృద్ధి 28 శాతంగా, ఐటీఈఎస్ రంగంలో 17 శాతంగా, టెలికం రంగంలో 6 శాతంగా నమోదయ్యింది. కాగా బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో నియామకాలు 5 శాతంమేర తగ్గాయి. ఐటీ-సాఫ్ట్‌వేర్ రంగంలో నిపుణుల డిమాండ్ 21 శాతంమేర, ఐటీఈఎస్ ఎగ్జిక్యూటివ్ డిమాండ్ 26 శాతంమేర, సేల్స్ ప్రొఫెషనల్స్ డిమాండ్ 15 శాతంమేర పెరిగింది. నగరాల వారీగా చూస్తే.. నియామకాల వృద్ధి ముంబైలో 24 శాతంగా, ఢిల్లీ/ఎన్‌సీఆర్‌లో 23 శాతంగా, బెంగళూరులో 22 శాతంగా, కోల్‌కతాలో 21 శాతంగా, పుణేలో 13 శాతంగా, చెన్నైలో 12 శాతంగా ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement