ముంబై: ప్రజలందరికీ 2027 నాటికల్లా బీమా రక్షణ కల్పించాలన్న లక్ష్యం సాకారం కావాలంటే ఇన్సూరెన్స్ రంగంలోకి భారీగా పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉందని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్‌డీఏఐ చైర్మన్ దేబాశీష్ పాండా తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) అనుమతించాల్సి ఉంటుందని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. బీమా విస్తృతిని పెంచేందుకు ఈ రంగంలో మరిన్ని సంస్థలు రావాల్సిన అవసరం ఉందన్నారు. 2000 నుంచి భారత్‌లో ప్రైవేట్, విదేశీ పెట్టుబడులను క్రమంగా అనుమతిస్తున్నారు.
ప్రస్తుతం జనరల్, లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ విభాగాల్లో 74 శాతం వరకు ఎఫ్‌డీఐలకు అనుమతి ఉంది. దీన్ని వంద శాతానికి పెంచిన పక్షంలో దేశీయంగా వచ్చే పెట్టుబడులకు కూడా కొంత దన్ను లభించగలదని పాండా చెప్పారు. మరోవైపు, బీమా సుగమ్ ప్లాట్‌ఫాం అనేది పాలసీదార్లకు సమగ్రమైన పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా వ్యవహరిస్తూ బీమా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment