బీమాలో ఎఫ్‌డీఐల పెంపు ప్రతిపాదన అమల్లోకి
న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. కేంద్ర వాణిజ్య శాఖలో భాగమైన పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. బీమాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి పెంపుదలకు అనుగుణంగా ఎఫ్‌డీఐ విధానాన్ని సవరించినట్లు,
ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ స్థానంలో సవరణ బిల్లును మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు అందులో తెలిపింది. బీమా రంగంలో ఎఫ్‌డీఐలను 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుతూ గతేడాది డిసెంబర్‌లో కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే.