ఔరంగాబాద్: ప్రస్తుతం దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ తెలిపారు. ఇదే కొనసాగితే దేశం రాబోయే ఎన్నికల్లో మార్పును చూస్తుందన్నారు. ఈ విషయం చెప్పడానికి జ్యోతిష్యుని అవసరం లేదని, కర్ణాటక ఫలితాలు పరిగణనలోకి తీసుకుంటే సరిపోతుందని వ్యాఖ్యానించారు. ఔరంగాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే విషయమై ప్రశ్నించగా తనతోపాటు తమ పార్టీ మిత్రపక్షాలు కూడా అదే కోరుకుంటున్నాయని తెలిపారు. అయితే.. కర్ణాటక ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఒకేసారి రెండు ఎన్నికలు నిర్వహించడానికి బీజేపీ సిద్ధపడ దని ఆయన వ్యాఖ్యానించారు.
రైతులకు పెట్టుబడి సాయంలో ‘తెలంగాణ మోడల్’పై ఆయన స్పందిస్తూ.. చిన్న రాష్ట్రం కాబట్టి అది సాధ్యమయ్యిందని, దానికి బదులుగా రైతులకు మౌలిక వసతుల కల్పనకు నిధులను వెచ్చిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో ప్రతి చిన్న ఘటనకూ మతం రంగు పులుముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి సంకేతం కాదన్నారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై శరద్‌పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఇంతవరకూ ప్రభుత్వం పత్తిని కొనుగోలు చేయలేదని, చెరుకు రైతులకు మద్దతు ధరలేదని, ఈ విషయంలో రైతుల పోరాటానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment