
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ రాత పరీక్షలో అంధులు, బుద్ధిమాంద్యం (డిస్లెక్సియా), చేతులు, వేళ్లు కోల్పోయిన వారికి ఇచ్చే సహాయకుల (స్క్రైబ్) నిబంధనల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జాయింట్ అడ్మిషన్ బోర్డు మార్పులు చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 8న రాత పరీక్ష, అదే నెల 15, 16 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో అంధులు, డిస్లెక్సియాతో బాధ పడేవారు, బబ్లింగ్ చేయడానికి వీల్లేకుండా చేతులు, వేళ్లు కోల్పోయిన వారు తమకు సహాయకులుగా 11వ తరగతిలో గణితం సబ్జెక్టు కలిగిన సైన్స్ కోర్సు చదివే విద్యార్థులను తెచ్చుకోవచ్చని స్పష్టం చేసింది. గతంలో పదో తరగతి చదివే విద్యార్థులనే సహాయకులుగా అనుమతిం చింది.
ఈసారి 11వ తరగతి (ఇంటర్మీడి యట్ ప్రథమ సంవత్సరం) విద్యార్థులను అనుమతించేలా జేఈఈ మెయిన్ నోటిఫి కేషన్‌లో సవరణ చేసింది. జేఈఈ నిబంధనల ప్రకారం 40 శాతం పైగా అంధత్వం కలిగిన వారికే స్క్రైబ్‌ను అనుమతిస్తారు. సొంతంగా స్క్రైబ్‌ను వెంట తెచ్చుకోవాలనుకునే విద్యార్థులు పరీక్షకు రెండు రోజుల ముందే పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్‌కు చెప్పాలని స్పష్టం చేసింది. ఒకవేళ పరీక్ష కేంద్రం సూపరింటెండెంటే సహాయకుడిని ఏర్పాటు చేస్తే.. పరీక్షకు ఒకరోజు ముందు సహాయకుడిని కలసి, తనకు సహాయ పడగలడా లేదా అన్నది తేల్చుకుని సూపరింటెండెంట్‌కు తెలపాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ ఇవే నిబంధనలు వర్తించేలా ఐఐటీ కాన్పూర్ చర్యలు చేపట్టిం ది. ఈ ఏడాది మే 20న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో స్క్రైబ్ కావాలనుకునే వారు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిర్ణీత ఫార్మాట్ ప్రకారం ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుం దని ఆయా సంస్థలు స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment