JEE Main test
-
జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ టెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఐఐటీ జేఈఈ–అడ్వాన్స్డ్ పరీక్ష జూలై 3వ తేదీన ఉంటుందని∙కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ చెప్పారు. ఈ క్వాలిఫయింగ్ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. ఐఐటీల్లో ప్రవేశాలకు 12వ తరగతిలో 75 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను కూడా కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఈ ఏడాదికి సడలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు గాను అభ్యర్థులు 12వ తరగతి బోర్డు పరీక్షల్లో కనీసం 75శాతం మార్కులు లేదా క్వాలిఫయింగ్ పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది. 2021నుంచి ఏడాదికి నాలుగు పర్యాయాలు జేఈఈ–మెయిన్స్‌ను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్స్ మొదటి దఫా పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. 10,12వ తరగతి పరీక్షలను మే నెలకు సీబీఎస్ఈ వాయిదా వేసింది. -
నీట్, జేఈఈ పరీక్షలకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్
సాక్షి,న్యూఢిల్లీ : కరోనా వైరస్ క్లిష్ట సమయంలో జేఈఈ మెయిన్, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని ఆరు రాష్ట్రాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే జేఈఈ, నీట్ పరీక్షలు కొనసాగుతాయని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మసనం స్పష్టం చేసింది. కాగా విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించాలంటూ ఆగస్టు 17న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో కేంద్రం పరీక్షల నిర్వహణకు సిద్ధమైంది. (నీట్, జేఈఈ వాయిదాకు రివ్యూ పిటిషన్!) అయితే దేశంలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బీజేపీయేతర పాలిత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన మంత్రులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిపిందే. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కోవిడ్ మహమ్మారి కారణంగా విద్యార్థుల విలువైన విద్యా సంవత్సరం కోల్పోరాదని అభిప్రాయపడింది. కోవిడ్ నిబ్బందనలు పాటిస్తూ పరీక్షలను నిర్వహించాలని తెలిపింది. జేఈఈ మెయిన్ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి కొనసాగుతుండగా నీట్ పరీక్ష సెప్టెంబర్ 13 న జరగనుంది. -
జేఈఈ మెయిన్స్: తీసుకోవాల్సిన జాగ్రత్తలు
జేఈఈ మెయిన్స్ 2020 పరీక్ష సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం అయ్యింది. ఈ పరీక్షను సెప్టెంబర్ 6 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కోవిడ్-19 నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు నాయకులు కోరారు. అయితే పరీక్షలు మాత్రం యధావిధిగా ప్రకటించిన తేదీనే నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు సంబంధించి 10 ఆసక్తికరమైన విషయాలు: 1. జేఈఈ మెయిన్ 2020 ను దేశంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో సుమారు 8.58 లక్షల మంది రిజిస్టర్డ్ అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. 2. జేఈఈ మెయిన్ 2020 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు సహకరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ 'నిశాంక్' వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. 3. అధికారిక సమాచారం ప్రకారం, సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 7.78 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నారు. 4. జేఈఈ మెయిన్స్ 2020 కోసం పరీక్షా కేంద్రాల సంఖ్యను 570 నుంచి 660 కు పెంచారు. 5. నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పరీక్ష రోజులలో ముంబైలో ప్రత్యేక సబర్బన్ సర్వీసుల ద్వారా ప్రయాణించడానికి రైల్వే అనుమతిస్తుందని రైల్వే మంత్రి పియూష్ గోయల్ సోమవారం తెలిపారు. 6. ఈ సంవత్సరం, కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రధాన పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఈఈ మెయిన్స్ మొదట ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 11 వరకు జరగాల్సి ఉంది. 7. అలాగే, నీట్, జేఈఈ మెయిన్స్ నిర్వహించడాన్ని నిరసిస్తూ సమాజ్ వాదీ పార్టీ విద్యార్థి విభాగం సభ్యులు ఆందోళనకు దిగగా పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేసి సోమవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. 8. ఐఐటి పూర్వ విద్యార్థుల బృందం అవసరమైన అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలకు రవాణా సౌకర్యాలు కల్పించడానికి ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. 9. బాలీవుడ్ నటుడు సోను సూద్ జేఈఈ మెయిన్స్ 2020 పరీక్ష కోసం విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. "రవాణా సదుపాయాలు లేని కారణంగా ఎవరూ వారి పరీక్షలను కోల్పోకూడదు" అని ఆయన అన్నారు. 10. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, కరోనావైరస్ మహమ్మారి భయాల మధ్య ఇబ్బందులు లేకుండా జేఈఈ , నీట్‌లను ఆతిథ్యం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్రసింగ్ చుదాసామా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జేఈఈ మెయిన్స్ 2020 కోసం మొత్తం 38,167 మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు: 1. కోవిడ్ -19 నేపథ్యంలో ముందుజాగ్రత్తగా, అభ్యర్థి సూచించిన సమయంలోపే పరీక్ష హాలుకు చేరుకోవాలి. గేట్ మూసివేసిన తర్వాత అభ్యర్థి రావడానికి అనుమతించరు. 2. పరీక్ష ముగిసేంత వరకు ఏ అభ్యర్థిని పరీక్ష గది నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించరు. పరీక్ష పూర్తయిన తర్వాత ఇన్విజిలేటర్ సూచనల మేరకు బయటకు వెళ్లాలి. 3. అభ్యర్థులందరూ అడ్మిట్ కార్డులో ఇచ్చిన కోవిడ్ -19 సూచనలు, సలహాలను డౌన్లోడ్ చేసి జాగ్రత్తగా చదవాలి 4. అడ్మిట్ కార్డు, చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్ లేకుండా ఏ అభ్యర్థిని పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి అనుమతించరు. కావున అభ్యర్థులు సరైన పత్రాలను తీసుకొని పరీక్షా కేంద్రానికి రావాలి. పరీక్షా కేంద్రంలో తీసుకుంటున్న జాగ్రత్తలు: 1. ప్రతి పరీక్ష షిఫ్ట్ ప్రారంభానికి ముందు, చివరి షిఫ్ట్ ముగిసిన తరువాత, అన్ని సీట్లను పూర్తిగా శానిటైజర్లతో శుభ్రపరచడానికి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2 సీట్ల మధ్య దూరం ఉంచనున్నారు. 2. పరీక్షా కేంద్రం ప్రవేశద్వారం వద్ద, పరీక్షా హాల్ లోపల అన్ని చోట్ల హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నారు. 3. అభ్యర్థుల అడ్మిట్ కార్డులను చేతిలో కాకుండా బార్కోడ్ ద్వారా తనిఖీ చేయనున్నారు. 4. గ్లౌజ్‌లను ధరించి ఇన్విజిలేటర్లు పరీక్ష ప్రారంభానికి ముందు రఫ్ షీట్లను అన్ని డెస్క్‌లలో ఉంచుతారు. 5. అభ్యర్థులను పరీక్ష హాలులోకి రాగానే వారికి మూడు పొరలలతో కూడా మాస్క్‌ను ఇవ్వనున్నారు. వాటిని ధరించే అభ్యర్థులు పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఉండటానికి ఎగ్జామ్నేషన్ హాలులోనే మాస్క్‌లను ఇవ్వనున్నారు. -
సెల్ఫ్ డిక్లరేషన్.. కొత్త మాస్క్
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 6 వరకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌కు రాష్ట్రం నుంచి 67,319 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారికి ఆన్లైన్లో రోజూ రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) 27 కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత జనవరిలో 37 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి 1,00,129 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే వచ్చేనెల 13న నిర్వహించనున్న నీట్ పరీక్షకు 55,800 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. గతేడాది 54,073 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా.. అప్పుడు 79 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ సంఖ్యను 112కి పెంచారు. కరోనా నేపథ్యంలో ఎన్టీఏ ఈసారి ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థులకు పలు సూచనలు జారీచేసింది. ఇవీ సూచనలు.. ►విద్యార్థులు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన అడ్మిట్‌కార్డులో ఉన్న కోవిడ్–19 సెల్ఫ్ డిక్లరేషన్ (అండర్‌టేకింగ్)లో వివరాలు నమోదు చేయాలి. దానిపై ఫొటో అతికించి సంతకంతోపాటు ఎడమ చేతి బొటన వేలిముద్ర కూడా వేయాలి. ►గత 14 రోజులుగా తనకు జ్వరం, దగ్గు, గొంతు సమస్యలు, శ్వాస సమ స్యలు, శరీర నొప్పులు లేవని ఆ డిక్లరేషన్‌లో పేర్కొనాలి. కోవిడ్ పాజిటివ్ కేసు కాంటాక్ట్‌లో ఉన్నారా? లేదా? అన్న వివరాలను నమోదు చేయాలి. ►నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వస్తే అనుమతించరు. ూ గుంపులుగా కాకుండా భౌతికదూరాన్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలి. ►అభ్యర్థులకు పరీక్ష కేంద్రం వద్ద మాస్క్ ఇస్తారు. అప్పటి వరకూ ధరించిన మాస్క్ తీసేసి కొత్త మాస్క్ ధరించాలి. ►శారీరక ఉష్ణోగ్రతలను థర్మోగన్స్ ద్వారా పరీక్షించాక లోపలికి అనుమతిస్తారు. ►పరీక్ష పూర్తయ్యాక ఇన్విజిలేటర్ చెప్పే వరకూ సీటు నుంచి లేవకూడదు. ►అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలి. బీఆర్క్ అభ్యర్థులు డ్రాయింగ్ టెస్ట్ కోసం జామెంట్రీ బాక్స్ సెట్, పెన్సిల్స్, ఎరేజర్స్, కలర్ పెన్సిల్స్ లేదా క్రేయాన్స్ తెచ్చుకోవాలి. ►ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్, ఇతర నిషేధిత వస్తువులతో సహా వ్యక్తిగత వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ►అటెండెన్స్ షీటులో అతికించేందుకు అదనపు పాస్‌పోర్టు ఫొటో తేవాలి. ►రఫ్ వర్క్ కోసం ప్రతి సీటు వద్ద ఏ4 సైజ్ తెల్లకాగితాలు ఐదు అందుబాటులో ఉంటాయి. ఇంకా కావలిస్తే అదనంగా ఇస్తారు. ►అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్‌ను వాటి పైభాగంలో రాయాలి. పరీక్ష గది నుంచి బయటకు వెళ్లేముందు నిర్ణీత డ్రాప్ బాక్స్‌లో వాటిని వేయాలి. ►సరిగా నింపిన అడ్మిట్ కార్డును కూడా డ్రాప్ బాక్స్‌లో వేయాలి. ►ప్రతి షిఫ్ట్ ప్రారంభమయ్యే ముందు సీటింగ్ ఏరియా కీబోర్డ్, మౌస్, వెబ్‌క్యామ్, డెస్క్, కుర్చీ, మానిటర్ని పూర్తిగా శుభ్రపరుస్తారు. -
జేఈఈలో స్క్రైబ్‌గా 11వ తరగతి విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ రాత పరీక్షలో అంధులు, బుద్ధిమాంద్యం (డిస్లెక్సియా), చేతులు, వేళ్లు కోల్పోయిన వారికి ఇచ్చే సహాయకుల (స్క్రైబ్) నిబంధనల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జాయింట్ అడ్మిషన్ బోర్డు మార్పులు చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 8న రాత పరీక్ష, అదే నెల 15, 16 తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో అంధులు, డిస్లెక్సియాతో బాధ పడేవారు, బబ్లింగ్ చేయడానికి వీల్లేకుండా చేతులు, వేళ్లు కోల్పోయిన వారు తమకు సహాయకులుగా 11వ తరగతిలో గణితం సబ్జెక్టు కలిగిన సైన్స్ కోర్సు చదివే విద్యార్థులను తెచ్చుకోవచ్చని స్పష్టం చేసింది. గతంలో పదో తరగతి చదివే విద్యార్థులనే సహాయకులుగా అనుమతిం చింది. ఈసారి 11వ తరగతి (ఇంటర్మీడి యట్ ప్రథమ సంవత్సరం) విద్యార్థులను అనుమతించేలా జేఈఈ మెయిన్ నోటిఫి కేషన్లో సవరణ చేసింది. జేఈఈ నిబంధనల ప్రకారం 40 శాతం పైగా అంధత్వం కలిగిన వారికే స్క్రైబ్‌ను అనుమతిస్తారు. సొంతంగా స్క్రైబ్‌ను వెంట తెచ్చుకోవాలనుకునే విద్యార్థులు పరీక్షకు రెండు రోజుల ముందే పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్‌కు చెప్పాలని స్పష్టం చేసింది. ఒకవేళ పరీక్ష కేంద్రం సూపరింటెండెంటే సహాయకుడిని ఏర్పాటు చేస్తే.. పరీక్షకు ఒకరోజు ముందు సహాయకుడిని కలసి, తనకు సహాయ పడగలడా లేదా అన్నది తేల్చుకుని సూపరింటెండెంట్‌కు తెలపాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ ఇవే నిబంధనలు వర్తించేలా ఐఐటీ కాన్పూర్ చర్యలు చేపట్టిం ది. ఈ ఏడాది మే 20న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో స్క్రైబ్ కావాలనుకునే వారు నోటిఫికేషన్లో పేర్కొన్న నిర్ణీత ఫార్మాట్ ప్రకారం ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుం దని ఆయా సంస్థలు స్పష్టం చేశాయి. -
లెక్కల చిక్కులు!
♦ జేఈఈ మెయిన్ పరీక్షలో 15 వరకు క్లిష్ట ప్రశ్నలు ♦ కెమిస్ట్రీ కాస్త కఠినం.. సులభంగా ఫిజిక్స్ ♦ తగ్గనున్న కటాఫ్ మార్కులు! ♦ ఈనెల 18 నుంచి 22 వరకు వెబ్సైట్లో ‘కీ’ సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఇతర కేంద్ర ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఆదివారం నిర్వహించిన జేఈఈ మెయిన్ పరీక్షలో విద్యార్థులకు లెక్కల తిప్పలు తప్పలేదు. ఎప్పుడూ ఫిజిక్స్‌లో టఫ్ ప్రశ్నలు ఇచ్చేవారు. ఈసారి ఫిజిక్స్ ఈజీగా ఇవ్వగా, మ్యాథమెటిక్స్ ఇబ్బంది పెట్టినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. మ్యాథమెటిక్స్‌లో మొత్తం 30 ప్రశ్నల్లో 8 ప్రశ్నలు అధిక సమయం తీసుకునేవే రావడంతో ఎక్కువ మంది విద్యార్థులు రాయలేకపోయారు. మరో 7 ప్రశ్నలు ఆలోచిస్తే తప్ప రాయలేని విధంగా ఇచ్చినట్లు సబ్జెక్టు నిపుణులు ఎంఎన్ రావు పేర్కొన్నారు. మిగిలిన 15 ప్రశ్నలు మాత్రమే కాస్త సులభంగా ఉండేవి వచ్చినట్లు వెల్లడించారు. గడిచిన రెండుమూడేళ్లలో జేఈఈ మెయిన్ మ్యాథమెటిక్స్ ప్రశ్నల్లో సులభ ప్రశ్నలు 20కి పైగా ఇచ్చేవారు. దీంతో సాధారణ విద్యార్థులు కూడా బాగా రాయగలిగే వారు. కానీ ఈసారి ప్రతిభావంతులు కూడా సమయం సరిపోక ఒకటీ రెండు ప్రశ్నలు రాయలేని పరిస్థితి. కెమిస్ట్రీలో కూడా.. మరోవైపు కెమిస్ట్రీలో కూడా కాస్త ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు. మొత్తం 30 ప్రశ్నల్లో 6 ప్రశ్నలు టఫ్‌గా ఉన్నాయని, మిగతా ప్రశ్నలు సులభంగానే ఉన్నాయని పేర్కొంటున్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఫిజిక్స్ సులభంగా వచ్చిందని సబ్జెక్టు నిపుణులు రామకృష్ణ తెలిపారు. అయితే మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ సమయం తీసుకున్న విద్యార్థులు.. చివరల్లో సమయం సరిపోక ఫిజిక్స్‌లో అన్నింటికి సమాధానాలు గుర్తించలేకపోయారని చెప్పారు. దీంతో ఈసారి జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. గతేడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు జనరల్ కేటగిరీలో 100 మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా అర్హత సాధించగా, ఈసారి ఇంకా తగ్గే అవకాశం ఉందని, లేదంటే 100 మార్కుల వరకు ఉండవచ్చని చెబుతున్నారు. 95 శాతం విద్యార్థుల హాజరు.. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష రాసేందుకు 69,467 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 95 శాతం మంది హాజరైనట్లు తెలిసింది. పరీక్ష హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నిర్వహించారు. హైదరాబాద్ కేంద్రంలో 96 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు సమాచారం. వరంగల్, హన్మకొండలో 17 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా మొదటి పేపర్‌కు 97.5 శాతం, రెండో పేపర్‌కు 94 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మరోవైపు వెబ్సైట్లో ప్రాథమిక కీని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆదివారమే అందుబాటులో ఉంచుతుందని విద్యార్థులు భావించారు. కాని ఈనెల 18 నుంచి 22 వరకు ‘కీ’ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని సీబీఎస్ఈ వెల్లడించింది. అలాగే ఆయా తేదీల్లోనే విద్యార్థుల ఓఎంఆర్ పత్రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. 8, 9 తేదీల్లో ఆన్లైన్లో జేఈఈ మెయిన్ ఇక ఈనెల 8, 9 తేదీల్లో ఆన్లైన్లో జేఈఈ మెయిన్ పరీక్షను సీబీఎస్ఈ నిర్వహించనుంది. 27న ఫలితాలను వెల్ల డించనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించిన 2.20 లక్షల మంది జాబితాను కూడా అదే రోజు ప్రకటించనుంది. ఈనెల 28 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఐఐటీ మద్రాసు ఆన్లైన్లో దరఖాస్తుల ను స్వీకరించనుంది. ఐఐటీల్లో ప్రవేశాల కు మే 21వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్ష నిర్వహించనుంది.