Writing tests
-
నాలుగు ఉద్యోగాలకు ఒకే పరీక్ష
సాక్షి, అమరావతి: ఒకే రాత పరీక్షతో దాదాపు నాలుగు ఉద్యోగాలకు అర్హత పొందే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించే 19 రకాల ప్రభుత్వ ఉద్యోగాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఒక్కో కేటగిరీలో పేర్కొన్న ఉద్యోగాలన్నింటినీ ఒకే రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. కేటగిరీ–1, కేటగిరీ–2 ఉద్యోగాలకు సెప్టెంబర్ 1న ఉదయం వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. కేటగిరీ–3లోని ఉద్యోగాల భర్తీకి అదేరోజు సాయంత్రం రాతపరీక్ష నిర్వహిస్తారు. కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలన్నింటికీ కేటగిరీల వారీగా ఒకే రకమైన రాత పరీక్ష ఉంటుంది. కేటగిరీ–3లో మాత్రం ఒక్కొక్క రకమైన ఉద్యోగానికి ఒక్కొక్క రకమైన రాత పరీక్ష ఉంటుంది. ఒక్కొక్క ఉద్యోగానికి పేపరు–1, పేపరు–2 విధానంలో రాతపరీక్ష నిర్వహించినప్పటికీ రెండింటినీ ఉదయం లేదా సాయంత్రం ఏదో ఒకేపూట నిర్వహిస్తారు. అంటే కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి అర్హత ఉంటే కేటగిరీ–3లోని పోస్టుకు కూడా దరఖాస్తు చేసుకుని, రాత పరీక్షకు హాజరు కావొచ్చు. కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలు అన్నింటికీ ఒకే అభ్యర్థి ఏకకాలంలో పోటీపడే అవకాశం ఉండదు. అదే సమయంలో కేటగిరీ–3లోని 11 రకాల ఉద్యోగాలకు ఒకే అభ్యర్థి రెండు మూడింటికి ఒకే సమయంలో పోటీపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కేటగిరీ–1, కేటగిరీ–2లోని ఉద్యోగాలన్నింటికీ అభ్యర్థి ఒకే రాత పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో మొదటి ప్రాధాన్యతను దరఖాస్తు ఫారంలో స్పష్టంగా పేర్కొనాలని సూచిస్తున్నారు. సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్ ఒకే విడత 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ కావడంతో దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నోటిఫికేషన్, దరఖాస్తు, రాతపరీక్ష వంటి అంశాలపై తలెత్తే సందేహాలను నివృత్తి చేయడానికి ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055 నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కేటగిరీ–1 ఉద్యోగాలు 1.పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్–5) 2.మహిళా పోలీసు మరియు మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్ (లేదా) వార్డు మహిళా ప్రొటెక్షన్ సెక్రటరీ 3.వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 4.వార్డు అడ్మిన్‌స్ట్రేటివ్ సెక్రటరీ కేటగిరీ–2 ఉద్యోగాలు గ్రూప్–ఎ 1.ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్–2) 2.వార్డు ఎమినిటీస్ సెక్రటరీ (గ్రేడ్–2) గ్రూపు–బి 1.విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (గ్రేడ్–2) 2.విలేజ్ సర్వేయర్ (గ్రేడ్–3) కేటగిరీ–3 కొలువులు 1.విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్(గ్రేడ్–2) 2.విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 3.విలేజీ ఫిషరీస్ అసిస్టెంట్ 4.డిజిటల్ అసిస్టెంట్(పంచాయతీ కార్యదర్శి గ్రేడ్–6) 5.వార్డు శానిటేషన్ సెక్రటరీ(గ్రేడ్–2) 6.వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ(గ్రేడ్–2) 7.పశు సంవర్థక శాఖ సహాయకుడు 8.ఏఎన్ఎం లేదా వార్డు హెల్త్ సెక్రటరీ(గ్రేడ్–3) 9.వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 10.వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 11.విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ (మహిళా పోలీసు, ఏఎన్ఎం ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అర్హులు) -
మెసెంజర్ పోస్ట్‌కు పీహెచ్డీ అభ్యర్థులు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని పోలీసుశాఖలో పోస్ట్‌మ్యాన్ తరహా విధులు నిర్వహించడానికి జారీ చేసిన 62 పోస్టులకు ఏకంగా 93,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. పోలీసు టెలికం విభాగం పంపే సందేశాలను ఒక ఆఫీసు నుంచి మరో ఆఫీసుకు అందించే మెసెంజెర్ (పోస్టుమ్యాన్) ఉద్యోగాలకు రాష్ట్రసర్కారు నోటిఫికేషన్ ఇచ్చింది. కనీస విద్యార్హత ఐదో తరగతి. పీహెచ్డీ చేసిన 3,700 మంది ఈ పోస్టుకు దరఖాస్తుచేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 28,000 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, 50 వేల మంది గ్రాడ్యుయేట్లున్నారు. ఇక 5 నుంచి 12వ తరగతి వరకు విద్యార్హత ఉన్నవారు 7,400 మంది ఉన్నారు. నెలజీతం రూ.20 వేలు. ఎక్కువ దరఖాస్తులు రావడంతో రాత పరీక్ష నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. -
జేఈఈలో స్క్రైబ్‌గా 11వ తరగతి విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ రాత పరీక్షలో అంధులు, బుద్ధిమాంద్యం (డిస్లెక్సియా), చేతులు, వేళ్లు కోల్పోయిన వారికి ఇచ్చే సహాయకుల (స్క్రైబ్) నిబంధనల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జాయింట్ అడ్మిషన్ బోర్డు మార్పులు చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 8న రాత పరీక్ష, అదే నెల 15, 16 తేదీల్లో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల్లో అంధులు, డిస్లెక్సియాతో బాధ పడేవారు, బబ్లింగ్ చేయడానికి వీల్లేకుండా చేతులు, వేళ్లు కోల్పోయిన వారు తమకు సహాయకులుగా 11వ తరగతిలో గణితం సబ్జెక్టు కలిగిన సైన్స్ కోర్సు చదివే విద్యార్థులను తెచ్చుకోవచ్చని స్పష్టం చేసింది. గతంలో పదో తరగతి చదివే విద్యార్థులనే సహాయకులుగా అనుమతిం చింది. ఈసారి 11వ తరగతి (ఇంటర్మీడి యట్ ప్రథమ సంవత్సరం) విద్యార్థులను అనుమతించేలా జేఈఈ మెయిన్ నోటిఫి కేషన్లో సవరణ చేసింది. జేఈఈ నిబంధనల ప్రకారం 40 శాతం పైగా అంధత్వం కలిగిన వారికే స్క్రైబ్‌ను అనుమతిస్తారు. సొంతంగా స్క్రైబ్‌ను వెంట తెచ్చుకోవాలనుకునే విద్యార్థులు పరీక్షకు రెండు రోజుల ముందే పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్‌కు చెప్పాలని స్పష్టం చేసింది. ఒకవేళ పరీక్ష కేంద్రం సూపరింటెండెంటే సహాయకుడిని ఏర్పాటు చేస్తే.. పరీక్షకు ఒకరోజు ముందు సహాయకుడిని కలసి, తనకు సహాయ పడగలడా లేదా అన్నది తేల్చుకుని సూపరింటెండెంట్‌కు తెలపాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ ఇవే నిబంధనలు వర్తించేలా ఐఐటీ కాన్పూర్ చర్యలు చేపట్టిం ది. ఈ ఏడాది మే 20న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో స్క్రైబ్ కావాలనుకునే వారు నోటిఫికేషన్లో పేర్కొన్న నిర్ణీత ఫార్మాట్ ప్రకారం ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుం దని ఆయా సంస్థలు స్పష్టం చేశాయి. -
83 పోస్టులకు 37,984 మంది..పంచాయతీ కార్యదర్శి
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదివారం రాత పరీక్షలు నిర్వహించనుంది. జిల్లాలోని 83 పోస్టులకుగాను 37,984 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల కోసం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం డివిజ న్లలో 96 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని, పరీక్ష ప్రారంభమైన పది నిమిషాల వరకు లోపలికి అనుమతిస్తామని, ఆ తర్వాత వచ్చిన అభ్యర్థులను లోనికి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జనరల్ స్టడీస్, అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు రూరల్ డెవలప్మెంట్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్లకు, రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజనింగ్ ఆఫీసర్లకు ఏపీపీఎస్సీ అధికారి వెంకటాద్రి ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. ఇప్పటికే ప్రశ్నాపత్రాలు జిల్లా ఖజానా కార్యాలయంలో భారీ భద్రత మధ్య ఉంచారు. పరీక్షకేంద్రాల వద్ద జిరాక్స్, బుక్‌స్టాల్స్‌ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలకు అభ్యర్థులు సకాలంలో హాజరయ్యేందుకు ప్రత్యేక బస్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మంచినీరు, మెడికల్ కిట్లు అందుబాటు లో ఉంచాలని జేసీ సురేంద్రమోహన్ వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు 22 రూట్లను విభజించారు. వాటిలో ఖమ్మంలో 77 సెంటర్లకు 17 రూట్లు, కొత్తగూడెంలో 19 సెంటర్లకు 5 రూట్లను ఏర్పాటు చేశారు. పరీక్షలకు ఫ్లయింగ్ స్క్వాడ్‌గా రెవెన్యూ డివిజన్ అధికారులను నియమించారు. జిల్లావ్యాప్తం గా 27మంది లైజన్ అధికారులు, 96 మంది అసిస్టెంట్ లైజన్ అధికారులు, 96 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1739 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఖమ్మంలో 1463 మంది, కొత్తగూడెంలో 276మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా పరిషత్ సీఈఓ జయప్రకాష్ నారాయణను కో-ఆర్డినేటర్‌గా నియమించారు. జిల్లాలో మొత్తం 16మంది అంధులు పరీక్షలకు హాజరవుతున్నారు. వారిలో ఆరుగురు కొత్తగూడెంలో, పదిమంది ఖమ్మంలో పరీక్షలు రాయనున్నారు. వీరికి లేఖకులను సహాయం గా తెచ్చుకునే అవకాశం కల్పించారు. అయితే పరీక్షకేంద్రాల్లో అదే పాఠశాలలు, కళాశాలలకు చెందిన సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా నియమించారని, అక్కడ అవకతవకలు జరిగే అవకాశం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆయా కళాశాలల్లో పరీక్షలకు ముందు ఇన్విజిలేటర్లకు డ్రా ద్వారా గదులు కేటాయిస్తారని అధికారులు పేర్కొంటున్నారు.