బీఎస్‌ఈ చార్జీల్లో మార్పులు
న్యూఢిల్లీ: బోంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ) తన ప్లాట్‌ఫామ్‌పై మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు వీలుగా లావాదేవీల చార్జీల్లో మార్పులు చేసింది. ఇప్పటి వరకు రూ.కోటి విలువ గల టర్నోవర్‌కు ఫ్లాట్‌గా రూ.275 చొప్పున చార్జ్ చేసింది. ఇకపై ఒక నెలలో లావాదేవీల సంఖ్య 5 లక్షల వరకు ఉంటే ఒక్కో ట్రేడింగ్‌పై రూపాయి చొప్పున వసూలు చేస్తుంది.
లావాదేవీల సంఖ్య 5 నుంచి 10 లక్షల మధ్య ఉంటే అప్పుడు ఒక్కో లావాదేవీకి 70 పైసలే వసూలు చేస్తుంది. 10–20 లక్షల మధ్య లావాదేవీలు ఉంటే ఒక్కో ట్రేడ్‌పై చార్జీ 60 పైసలు, 20 నుంచి 30 లక్షల మధ్య లావాదేవీలు నిర్వహించిన వారికి ఒక్కో ట్రేడింగ్‌పై 30 పైసల చార్జీ నిర్ణయించింది.