ఇదే జరిగితే.. 75శాతం యూపీఐ ట్రాన్సక్షన్స్ ఆపేస్తారు!
భారతదేశంలో యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది యూపీఐ లావాదేవీలు 57 శాతం పెరిగినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. 2022-23లలో దేశంలో యూపీఐ లావాదేవీలు 84 బిలియన్లుగా నమోదయ్యాయి. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు జరిగిన లావాదేవీలు అంతకంటే ఎక్కువని తెలుస్తోంది.యూపీఐ లావాదేవీలు భారీగా పెరగటానికి ప్రధాన కారణం.. ఎలాంటి అదనపు చార్జీలు లేకపోవడమే. ఒకవేలా అదనపు చార్జీలు వసూలు చేసినట్లయితే.. యూపీఐ లావాదేవీలను 75 శాతం మంది ఆపేసి అవకాశం ఉందని లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడయ్యింది.సర్వేలో పాల్గొన్నవారిలో సుమారు 38 శాతం మంది తాము చేసే ట్రాన్సాక్షన్లకు.. డెబిట్, క్రెడిట్ కార్డులకంటే కూడా యూపీఐను ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. మరో 22 శాతం మంచి కేవలం యూపీఐను మాత్రమే వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. కాబట్టి యూపీఐ వినియోగానికి అదనపు చార్జీలు వసూలు చేయడం జరిగితే.. 75 శాతం మంచి దీనిని ఉపయోగించడం ఆపేస్తారని సర్వేలో తెలిసింది.ఇదీ చదవండి: నోట్ల సమస్య!.. కేంద్ర ఆర్థిక మంత్రికి కాంగ్రెస్ ఎంపీ లేఖప్రస్తుతం భారతదేశంలోని 10 మందిలో కనీసం నలుగురు యూపీఐ వాడుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి యూపీఐ లావాదేవీల మీద ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఫీజులను వసూలు చేయడం మొదలైతే.. వీరందరూ దీనిని వినియోగించడానికి కొంత వెనుకడుగు వేసే అవకాశం ఉంది.