
కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: భవిష్యత్తులో జీఎస్టీ రేట్లలో మరిన్ని మార్పులు జరుగుతాయని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అమల్లోకి వచ్చిన ఏడాదిలోనే ఈ విధానానికి స్థిరత్వం వచ్చిందని తెలిపారు. దీని పరిధిని విస్తరించటంతోపాటు రేట్లలో హేతుబద్ధత సాధిస్తామని చెప్పారు. జీఎస్టీతో పరోక్ష పన్నుల విధానంలో సమూల మార్పులు వచ్చాయని జైట్లీ తెలిపారు. జీఎస్టీకి తుదిరూపు తెచ్చేందుకు మిగతా దేశాలతో పోలిస్తే చాలా స్వల్ప సమయం పట్టిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment