లక్నో: ఉత్తరప్రదేశ్‌లో పార్టీని సమూల ప్రక్షాళన చేసేందుకు బీజేపీ హై కమాండ్ సిద్ధమైంది. ఇందులో భాగంగానే లక్నో విచ్చేసిన పార్టీ జాతీయ ప్రెసిడెంట్ నడ్డా డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేందర్ చౌదరితో సుదీర్ఘ మంతనాలు జరిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవితో సహా పలు స్థానాల్లో మార్పులు చేసే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది.
ఓబీసీల్లో పట్టుండంతో పాటు ఆర్‌ఎస్‌ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిప్యూటీ సీఎం మౌర్యకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మౌర్యకు, సీఎం ఆదిత్యనాథ్‌కు పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు కేబినెట్ మీటింగ్‌లకు మౌర్య హాజరవకపోవడం చర్చనీయాంశమైంది.
ఈ కారణంతోనే మౌర్య ప్రభుత్వం నుంచి తప్పుకుని పార్టీ చీఫ్‌గా వెళ్లే అవకాశముంది. పార్టీ గ్రూపులుగా చీలిపోయిందని కొందరు నేతలు నడ్డాకు ఫిర్యాదు చేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో దిద్దుబాటు చర్యలకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. యూపీలో సీట్లు కోల్పోవడంతో కేంద్రంలో బీజేపీ ఒంటరిగా మ్యాజిక్‌ఫిగర్‌ను దాటలేక ఎన్డీఏ పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment