విద్యుత్ శాఖలో మార్పులు
Published Thu, Sep 15 2016 12:33 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
హన్మకొండ : కొత్త జిల్లాల ఏర్పాటుతో విద్యుత్ పంపిణీ మండళ్ల(డిస్కం) పరిధిలో మార్పులు జరుగనున్నాయి. ఎన్పీడీసీఎల్ పరిధిలోని 10 మండలాలు ఎస్‌పీడీసీఎల్‌లోకి వెళ్లనున్నాయి. ఈ మేరకు ట్రా¯Œ్స, డిస్కంల యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. టీఎస్ ఎన్పీడీసీఎల్‌లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మçహాబూబ్‌నగర్, మెదక్ జిల్లాలు ఉంటాయి.
అయితే, జిల్లా పునర్విభజన ప్రక్రియతో కొత్తగా 17 జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ మండలి(టీఎస్ ఎన్పీడీసీఎల్) పరిధిలో కొత్త జిల్లాలకు అనుగుణంగా మార్పులపై కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగా ఎన్పీడీసీఎల్ పరిధిలోని కొన్న మండలాలు, ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న జిల్లాల్లో కలవనున్నాయి. ఫలితంగా డిస్కంల పరంగా మండలాల్లో చేర్పులు, మార్పులు చోటు చేసుకుంటాయి.
అటూ.. ఇటు...
ఎన్పీడీసీఎల్ పరిధి ఉండే వరంగల్ జిల్లాలోని దేవరుప్పుల, లింగాలగణపురం, జనగామ, బచ్చన్నపేట మండలాలు నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా యాదాద్రి జిల్లాలో, చేర్యాల, మద్దూరు మండలాలు సిద్ధిపేట జిల్లాలో కలవనున్నాయి. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోని ముస్తాబాద్, ఇల్లంతకుంట, కోహెడ, హుస్నాబాద్ మండలాలు సిద్ధిపేట జిల్లాలో కలుస్తున్నాయి. కొత్త జిల్లాలో అధిక ప్రాంతం దక్షిణ విద్యుత్ పంపిణీ మండలి(టీఎస్ ఎస్‌పీడీసీఎల్) పరిధిలో ఉండడంతో ఆ జిల్లాల్లో కలిసిన ఎన్పీడీసీఎల్ పరిధిలోని మండలాలను ఎస్‌పీడీసీఎల్‌లో కలుపనున్నట్లు సమాచారం. దీని ప్రకారం విద్యుత్ లైన్లు, విద్యుత్ కనెక్షన్లు, ట్రా¯Œ్సఫార్మర్లు, కార్యాలయాలు అన్నీ ఎస్పీడీసీఎల్ పరిధిలోకి వెళ్లనున్నాయి.
అయితే ఈ మండలాల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల అంశంలో సీనియారిటీ సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఎక్కడి వారిని అక్కడే ఉంచాలనే ఆలోచనలో డిస్కంలు ఉన్నట్లు సమాచారం. ఇతర జిల్లాలో కలుస్తున్న మండలాల్లో పనిచేస్తున్న ఎన్పీడీసీఎల్‌కు చెందిన అధికారులు, ఉద్యోగులు ఎన్పీడీసీఎల్‌లోనే ఉంటారు. వీరి స్థానంలో ఎస్‌పీడీసీఎల్‌కు చెందిన అధికారులు, ఉద్యోగులను నియమించాల్సి ఉంటుంది. ఈమేరకు విద్యుత్ పంపిణీ మండళ్లు కసరత్తు చేస్తున్నాయి.
ఇక ఎన్పీడీసీఎల్ నుంచి ఎస్‌పీడీసీఎల్‌లోకి వెళ్లే మండలాల్లో ఉన్న విద్యుత్ సబ్‌స్టేçÙన్లు, విద్యుత్ ట్రా¯Œ్సఫార్మర్లు, విద్యుత్ లైన్లు, విద్యుత్ కనెక్షన్లు, సొంత భవనాలు, ఆస్తులు అన్నింటికి ధర నిర్ణయించి ఆ మేరకు ఎన్పీడీసీఎల్‌కు... ఎస్‌పీడీసీఎల్ చెల్లించేలా నిర్ణయాలు వెలువడనున్నట్లు అధికారవర్గాల సమాచారం.
Advertisement
Advertisement