అనంతపురం రూరల్ : ఆధార్డ్ కార్డులో పేరు, చిరునామా తదితర మార్పుల కోసం నిర్ధేశించన మీ సేవా కేంద్రాలకు సుదూర ప్రాంతాల నుంచి ఇక రావాల్సిన అవసరం ఉండదు. ఈ నెలాఖరులోపు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీసుల్లో ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తపాల శాఖ చర్యలు చేపడుతోంది. చాలా మండల కేంద్రాల్లో ఆధార్ కార్డు చేర్పులు మార్పులు చేసుకునేందుకు అవకాశం లేదు. దీంతో నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రానికి వచ్చి మార్పు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. జూలై 1న అన్ని పోస్టాఫీసుల్లో లాంఛనంగా ప్రారంభించేందుకు తపాల శాఖ శ్రీకారం చుట్టినట్లు తపాల శాఖ వర్గాలు వెల్లడించాయి.