
జోషిమఠ్‌లో హోటల్‌ను కూల్చివేస్తున్న అధికారులు (ఇన్‌సెట్లో) బీటలువారిన ఓ ఇల్లు
ప్రకృతిలో సహజసిద్ధంగా వచ్చే మార్పులు కొన్ని, మానవ తప్పిదాలు మరిన్ని మొత్తంగా ఉత్తరాఖండ్‌నే ముంచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూగర్భ పొరల్లో జరుగుతున్న మార్పులు, కొండల్ని తొలచి కట్టే అభివృద్ధి ప్రాజెక్టులు హిమాలయాల్లో కొన్ని పట్టణాలకు పెను ముప్పుగా మారుతున్నాయి. జోషిమఠ్ తరహాలో మరిన్ని పట్టణాలు కుంగిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.
కొండల్లో రాళ్లు, మట్టి వదులుగా మారి ఏ క్షణంలో ఏ ముప్పు ముంచుకొస్తోందన్న భయంతో స్థానికులు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ జూలై 2020 నుంచి మార్చి 2022 మధ్య చేసిన అధ్యయనంలో జోషిమఠ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏడాదికి 6.5 సెంటీమీటర్లు కుంగిపోతున్నట్టుగా గుర్తించారు. ఒకప్పుడు ఇళ్లకు చిన్న పాటి చీలికలు కనిపించేవి. ఇప్పుడు భారీగా పగుళ్లు మాదిరిగా ఏర్పడుతూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment