National Remote sensing center
-
వరద ముంపులో ఏపీకి ఆరో స్థానం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: దేశంలో వరదలు, తుపాన్ల వల్ల ముంపునకు గురవుతున్న రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏకంగా మొదటి స్థానంలో నిలిచిందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వెల్లడించింది. 1998 నుంచి 2022 వరకు వివిధ రాష్ట్రాల్లో సంభవించిన వరదలు, తుపాన్ల వల్ల జరిగిన నష్టాలను తెలియజేసింది. దేశంలో అత్యధికంగా బిహార్ రాష్ట్రంలో 39 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 26 లక్షల హెక్టార్లు, అస్సాంలో 24 లక్షల హెక్టార్లు, పశ్చిమబెంగాల్లో 19 లక్షల హెక్టార్లు, ఒడిశాలో 14 లక్షల హెక్టార్లు, ఏపీలో 8 లక్షల హెక్టార్లలోని ప్రాంతాలు తుపాన్లు, వరదల వల్ల నీటమునిగాయని వెల్లడించింది. ఏపీలో అయితే బాపట్ల, నెల్లూరు జిల్లాలే అత్యధికంగా నీట మునిగాయని తెలిపింది. నెల్లూరు జిల్లాలో 1.4 లక్షల హెక్టార్లు, బాపట్ల జిల్లాలో 1.11 లక్షల హెక్టార్ల భూమి ముంపునకు గురైందని పేర్కొంది. ఈ నదులపై తీవ్ర ప్రభావంఎడతెగని వర్షాలతో పాటు ఆక్రమణలు, డ్రైనేజీ వ్యవస్థల నిర్వీర్యం, ప్రతికూల వాతావరణం, మారుతున్న భూ వినియోగ విధానాలు, పెరుగుతున్న జనాభా తదితరాల వల్లే వరదలు సంభవిస్తున్నాయని తెలిపింది. గడిచిన 25 ఏళ్లలో భారీ వర్షాల వల్ల గోదావరి, కృష్ణా, వంశధార, నాగావళి నదుల్లో ప్రవాహం పెరిగి.. తరుచూ వరదలు సంభవిస్తున్నాయని పేర్కొంది. రుతుపవనాలు, అల్పపీడనాలు కూడా ఏపీలో వరదలకు దోహదం చేస్తున్నాయని తెలిí³ంది.తీవ్ర విషాదం మిగిల్చిన దివిసీమ ఉప్పెన1977లో సంభవించిన దివిసీమ(కృష్ణాజిల్లా) ఉప్పెన తీవ్ర విషాదాన్ని మిగిల్చి0ది. వేలాది మంది ప్రాణా లు కోల్పోయారు. ఈ ఉప్పెన.. అంతర్జాతీయ దాత ల దృష్టిని సైతం ఆకర్షించిందని నివేదిక వెల్లడించింది. 1979, 1990, 1996 తుపానులు కూడా ఇలాంటివేనని.. అవన్నీ మరిచిపోయే తుపానులు కాదని జాతీయ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ పేర్కొంది. -
‘దుమ్ము’ రేపిన విక్రమ్!
బెంగళూరు: చంద్రయాన్–3లో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగిన సందర్భంగా భారీ పరిమాణంలో దుమ్మును వెదజల్లింది. ఫలితంగా అక్కడ చిన్న గుంతలాంటి ప్రదేశం ఏర్పడినట్టు ఇస్రో శుక్రవారం వెల్లడించింది. ‘ఉపరితలంలోని ఏకంగా 2.09 టన్నులకు పైగా దుమ్ము, ధూళి, ఖనిజ శకలాల వంటివి 108 మీటర్ల పరిధిలో చెల్లాచెదురయ్యాయి. దాంతో విక్రమ్ చుట్టూ భారీ వలయాకార పరిధి (గుంత వంటిది) ఏర్పడింది’’ అని వివరించింది. ల్యాండింగ్‌కు ముందు, జరిగిన వెంటనే తీసిన ఫొటోలను ఉపగ్రహ ఆర్బిటార్‌లోని హై రిజల్యూషన్ కెమెరా సాయంతో హైదరాబాద్ జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం సైంటిస్టులు ఈ మేరకు వెల్లడించారు. -
జోషిమఠ్ బాటలో...
ప్రకృతిలో సహజసిద్ధంగా వచ్చే మార్పులు కొన్ని, మానవ తప్పిదాలు మరిన్ని మొత్తంగా ఉత్తరాఖండ్‌నే ముంచే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భూగర్భ పొరల్లో జరుగుతున్న మార్పులు, కొండల్ని తొలచి కట్టే అభివృద్ధి ప్రాజెక్టులు హిమాలయాల్లో కొన్ని పట్టణాలకు పెను ముప్పుగా మారుతున్నాయి. జోషిమఠ్ తరహాలో మరిన్ని పట్టణాలు కుంగిపోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. కొండల్లో రాళ్లు, మట్టి వదులుగా మారి ఏ క్షణంలో ఏ ముప్పు ముంచుకొస్తోందన్న భయంతో స్థానికులు క్షణమొక యుగంగా గడుపుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ జూలై 2020 నుంచి మార్చి 2022 మధ్య చేసిన అధ్యయనంలో జోషిమఠ్ చుట్టుపక్కల ప్రాంతాలు ఏడాదికి 6.5 సెంటీమీటర్లు కుంగిపోతున్నట్టుగా గుర్తించారు. ఒకప్పుడు ఇళ్లకు చిన్న పాటి చీలికలు కనిపించేవి. ఇప్పుడు భారీగా పగుళ్లు మాదిరిగా ఏర్పడుతూ ఉండడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మైనర్ ఇరిగేషన్’పై రంగంలోకి ఎన్ఆర్ఎస్సీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలో మైనర్ ఇరిగేషన్ కింద తెలుగు రాష్ట్రాలు వాడుకుంటున్న నీటి వినియోగంపై లెక్కలు తేల్చేందుకు ఇస్రో పరిధిలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) రంగంలోకి దిగనుంది. ఈ నెల 30న కృష్ణా బోర్డుతో పాటు తెలంగాణ, ఏపీ అధికారులతో మొదటి సమావేశం నిర్వహించ నుంది. మైనర్ ఇరిగేషన్ కింద జరుగుతున్న నీటి వినియోగాన్ని ఏ ప్రాతిపదికన లెక్కించాలన్న దానిపై సూచనలు తీసుకోనుంది. ఈ మేరకు ఎన్ఆర్ఎస్సీతో సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఇరు రాష్ట్రాలకు బోర్డు బుధవారం అందించింది. గోదావరి ప్రాజెక్టుల పరిధిలో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుపై నియమించిన కమిటీ ఈ నెల 29న సమావేశం కానుంది. -
గ్రామీణ ప్రగతిపై నూతన యాప్
► ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త సత్యనారాయణ భీమవరం : ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థుల యువశక్తిని వినియోగించుకుని భారతదేశంలో గ్రామీణ ప్రగతిపై ఒక యాప్‌ను తయారు చేసేందుకు జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) సన్నాహాలు చేస్తున్నట్టు ఎన్ఆర్ఎస్సీ ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి.సత్యనారాయణ అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం యాప్ వివరాలతో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. యాప్‌ను జాతీయస్థాయిలో పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖకు అందించేందుకు భవన్ పంచాయతీ మొబైల్ యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 574 జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో భవన్ పంచాయతీ సేవలు జియో ట్యాగ్ ద్వారా అనుసంధానం చేస్తామన్నారు. దీనికిగాను సుమారు రూ.150 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సత్యనారాయణ చెప్పారు. రెండోదశలో కొన్ని జిల్లాలు, మూడో దశలో అన్ని జిల్లాలను పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగా ఇప్పటికే 70 జిల్లాల్లో యాప్ తయారుచేయడం పూర్తయిందన్నారు. అనంతరం కళాశాలలోని వెట్ సెంటర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ఎన్ రాజు, డైరెక్టర్ సాగి విఠల్‌రంగరాజు, స్పేస్ టెక్నాలజీ సెంటర్ కో–ఆరి్డనేటర్ డాక్టర్ వైఎస్ఎస్ఆర్ మూర్తి, ఆర్అండ్డీ డీన్ డాక్టర్ పీఏ రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.