‘మైనర్‌ ఇరిగేషన్‌’పై రంగంలోకి ఎన్‌ఆర్‌ఎస్‌సీ | National Remote Sensing Center Meeting with Krishna Board | Sakshi
Sakshi News home page

‘మైనర్‌ ఇరిగేషన్‌’పై రంగంలోకి ఎన్‌ఆర్‌ఎస్‌సీ

Published Thu, Jan 25 2018 4:59 AM | Last Updated on Thu, Jan 25 2018 4:59 AM

National Remote Sensing Center Meeting with Krishna Board - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌ పరిధిలో మైనర్‌ ఇరిగేషన్‌ కింద తెలుగు రాష్ట్రాలు వాడుకుంటున్న నీటి వినియోగంపై లెక్కలు తేల్చేందుకు ఇస్రో పరిధిలోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) రంగంలోకి దిగనుంది. ఈ నెల 30న కృష్ణా బోర్డుతో పాటు తెలంగాణ, ఏపీ అధికారులతో మొదటి సమావేశం నిర్వహించ నుంది. మైనర్‌ ఇరిగేషన్‌ కింద జరుగుతున్న నీటి వినియోగాన్ని ఏ ప్రాతిపదికన లెక్కించాలన్న దానిపై సూచనలు తీసుకోనుంది. ఈ మేరకు ఎన్‌ఆర్‌ఎస్‌సీతో సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఇరు రాష్ట్రాలకు బోర్డు బుధవారం అందించింది. గోదావరి ప్రాజెక్టుల పరిధిలో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుపై నియమించిన కమిటీ ఈ నెల 29న సమావేశం కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement