శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,74,120 క్యూసెక్కులు రాక
సాగర్ నుంచి 1,29,600 క్యూసెక్కుల విడుదల
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్: కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. శనివారం సాయంత్రానికి 1,74,120 క్యూసెక్కులు వస్తోంది. దిగువ ప్రాజెక్ట్‌లకు 99,488 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కుడిగట్టు కేంద్రంలో 15.398 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.371 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. శనివారం సాయంత్రానికి జలాశయంలో 213.8824 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
డ్యామ్ నీటిమట్టం 884.70 అడుగులకు చేరుకుంది. కాగా, నాగార్జునసాగర్ జలాశయం నుంచి 16 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 1,29,600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం గరిష్ట స్థాయిలో 590 అడుగుల వద్ద ఉంది. ఇది 312.0450 టీఎంసీలకు సమానం.
ఇక్కడ నుంచి కుడి కాలువకు 6,112, ఎడమ కాలువకు 6,173, ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 29,597, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, వరద కాలువకు 400 క్యూసెక్కులు విడుదలవుతోంది. కాగా.. ప్రకాశం బ్యారేజీ నుంచి 84,297 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఇందులో కేఈ మెయిన్‌కు 4,028, కేడబ్ల్యూ మెయిన్‌కు 2,519, డెల్టాలోని కాలువలకు 6,547 క్యూసెక్కుల చొప్పున నీటిని వదిలారు.
Comments
Please login to add a commentAdd a comment