C
-
కోడింగ్ అవసరమే లేదు!.. ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు
ప్రారంభం నంజుంచి ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ సామర్థ్యానికి ప్రజలు మంత్ర ముగ్దులయ్యారు. నేడు ఈ టెక్నాలజీ ఉన్నత శిఖరాలను చేరుకుంటోంది. దిగ్గజ సంస్థలు సైతం ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఓపెన్ఏఐ మాత్రమే కాకుండా గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు కూడా సొంత చాట్బాట్లు, జెమిని, బింగ్ వంటి వాటిని ఆవిష్కరించుకున్నాయి. ఇటీవల దేశీయ దిగ్గజం రిలయన్స్ కంపెనీ కూడా హనూమాన్ (Hanooman) అనే ఏఐ ఆవిష్కరించింది. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తు 'ఏఐ'దే అంటున్నారు. ఏఐ కారణంగా చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోతుంటే.. ఈ టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు మాత్రం డిమాండ్ పెరిగిపోతోంది. ఉద్యోగం కావాలంటే తప్పకుండా టెక్నాలజీలో నైపుణ్యం కలిగి ఉండాలని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎన్విడియా (Nvidia) సీఈఓ 'జెన్సన్ హువాంగ్' కూడా ఏఐ ప్రభావం ఉద్యోగాల మీద చాలా ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి ప్రపంచంలో పిల్లలు కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించారు. గతంలో ప్రతి ఒక్కరూ కోడింగ్ నేర్చుకోవాలని సూచించారు, కానీ నేడు దాని అవసరం లేకుండా పోయిందని ఆయన స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఛాట్‌జీపీటీకి పోటీగా మన ‘హనూమాన్’! ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మానవీయంగా ఉండేలా టెక్నాలజీని క్రియేట్ చేయడం తమ బాధ్యతని సీఈఓ జెన్సన్ హువాంగ్ పేర్కొన్నారు. కాబట్టి ఇక మీద సీ++, జావా వంటి కోడింగ్ లాంగ్వేజస్ అవసరం లేదని, రాబోయే రోజుల్లో ఏఐ మరింత వృద్ధి చెందుతుందని ఆయన చెప్పుకొచ్చారు. -
గూగుల్ ప్రత్యేక డూడుల్
దేశ గణతంత్ర దినాన్ని పురస్కరించుకొని గూ గుల్ బుధవారం ప్రత్యేక డూడుల్‌ను ప్రదర్శించింది. ఏనుగులు, గుర్రాలు, సాక్సాఫోన్, తబ లా, పావురాలు, మూడురంగులతో ఈ డూ డుల్ను తీర్చిదిద్దింది. స్వతంత్ర గణతంత్రంగా భారత్ విజయవంతమైన మరో ఏడాది పూర్తి చేసుకుందని గూగుల్ శుభాకాంక్షలు తెలిపింది. -
నమ్మశక్యం కాని అనుభవం
హ్యూస్టన్: అంతరిక్షం నుంచి భూగోళాన్ని వీక్షించడం నమ్మశక్యం కాని, జీవితాన్ని మార్చే గొప్ప అనుభవమని ఇండియన్ అమెరికన్, తెలుగు బిడ్డ శిరీష బండ్ల పేర్కొన్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన వీఎస్ఎస్ యూనిటీ–22 స్పేస్‌షిప్‌లో రిచర్డ్ బ్రాన్సన్, మరో నలుగురితో కలిసి ఆమె ఆదివారం అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. రోదసిలో తనకు ఎదురైన అనుభవాన్ని శిరీష సోమవారం ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో వెల్లడించారు. స్పేష్‌షిప్‌లో అంతరిక్షంలోకి వెళ్లడం, క్షేమంగా భూమిపైకి తిరిగి రావడం.. మొత్తం ప్రయాణం ఒక అద్భుతమన్నారు. తన అనుభవాన్ని వర్ణించడానికి ‘నమ్మశక్యం కాని’ కంటే మరో ఉత్తమమైన పదం కోసం వెతుకుతున్నానని, ప్రస్తుతానికి ఆ పదమే తన మదిలో మెదులుతోందని అన్నారు. రోదసి నుంచి మన భూమిని వీక్షించడం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. రోదసిలోకి వెళ్లాలన్నది తన కల అని, అదిప్పుడు సాకారమయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. వ్యోమగామి కావడం చిన్నప్పటి నుంచి తన లక్ష్యమని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘తలాక్’ను నిషేధిస్తూ ఆర్డినెన్స్
న్యూఢిల్లీ: ముస్లింలు తక్షణం విడాకులు ఇచ్చేందుకు వీలు కల్పించే ట్రిపుల్ తలాక్ పద్ధతిని నేరంగా పరిగణించే ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ట్రిపుల్ తలాక్ చెప్పడం నిషిద్ధం, చట్ట విరుద్ధం, శిక్షార్హం అవుతుంది. ఈ నేరానికి పాల్పడే భర్తకు మూడేళ్ల వరకు జైలు శిక్షను ప్రతిపాదిస్తూ నిబంధనలు చేర్చారు. ఈ ఆర్డినెన్స్‌కు బుధవారం కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపిన తరువాత న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ట్రిపుల్ తలాక్‌ను సుప్రీంకోర్టు కొట్టేసిన తరువాత కూడా ఆ కేసులు నమోదవుతున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చామని తెలిపారు. ప్రతిపాదిత చట్టం దుర్వినియోగం కాకుండా..విచారణకు ముందే నిందితులకు బెయిల్ మంజూరుచేసే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. నిందితులకు కొన్ని రక్షణలు చేకూరుస్తూ బిల్లులో చేసిన సవరణలకు కేబినెట్ ఆగస్టు 29నే ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది నా, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మద్దతు తెలపకపోవడం వల్లే బిల్లు అపరిష్కృతంగా ఉందని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. వచ్చే సమావేశాల్లోనైనా బిల్లుకు మద్దతివ్వాలని యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ, తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతికి విజ్ఞప్తి చేశారు. కాగా, తలాక్‌పై రూపొందించిన ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సాయంత్రం సంతకం చేశారు. సోనియా మౌనం సరికాదు.. ‘గతేడాది సుప్రీంకోర్టు తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ తీర్పు చెప్పినా కూడా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అత్యవసర, తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాం. ఈ విషయంలో సోనియా గాంధీ మౌనం వహించడం సరికాదు. ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యవహారం కాదు. లింగ సమానత్వం, మహిళల గౌరవానికి సంబంధించినది’ అని ప్రసాద్ అన్నారు. ఓటుబ్యాంక్ రాజకీయాల ఒత్తిడితోనే కాంగ్రెస్ రాజ్యసభలో బిల్లుకు మద్దతివ్వడంలేదని ఆరోపించారు. కాంగ్రెస్ సహకారం కోరేందుకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మను 5–6 సార్లు కలిశానని, అయినా ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. 2017 జనవరి నుంచి 2018 సెప్టెంబర్ మధ్య కాలంలో 430 ట్రిపుల్ తలాక్ కేసులు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అందులో 229 కేసులు సుప్రీంకోర్టు తీర్పు వెలువడక ముందు, 201 కేసులు ఆ తరువాత వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. సాధికారత దిశగా ముందడుగు: బీజేపీ మహిళా సాధికారత దిశగా ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ గొప్ప ముందడుగు అని అధికార బీజేపీ అభివర్ణించింది. కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో ఈ సంప్రదాయానికి మద్దతుగా వాదించారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ వ్యవహారాన్ని ముస్లిం మహిళలకు న్యాయం చేసే అంశంగా కాకుండా రాజకీయ కోణంలో చూస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. బాధిత మహిళకు పరిహారం చెల్లించని భర్త ఆస్తులను జప్తుచేయాలన్న తమ డిమాండ్‌కు బీజేపీ అంగీకరించలేదని ఆ పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా పేర్కొన్నారు. భార్యలను వదిలిపెడుతున్న హిందూ భర్తలను కూడా శిక్షించేలా చట్టాలు ఎందుకు చేయడంలేదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఆర్డినెన్స్ ముస్లిం మహిళలకు వ్యతిరేకమని, అది వారికి మరింత అన్యాయం చేస్తుందన్నారు. ముస్లిం మహిళలకు ఎదురయ్యే అసలు సమస్యలను ఆర్డినెన్స్ విస్మరించిందని కొందరు మహిళా కార్యకర్తలు ఆరోపించగా, ఈ విషయంలో సమగ్ర చట్టం అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. పొరుగు దేశాల్లోనూ నిషిద్ధం తక్షణ ట్రిపుల్ తలాక్‌ను భారత్ సహా 22 దేశాలు నిషేధించాయి. ఈ జాబితాలో మన పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో భార్యకు విడాకులు ఇవ్వాలనుకుంటున్న వ్యక్తి.. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న కోర్టుకు, భార్యకు నోటీసులు పంపాలి. 1961లో చేసిన చట్టం ద్వారా పాకిస్తాన్లో తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించారు. ముస్లిం ప్రాబల్య దేశాలైన ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్టు, సైప్రస్, ట్యూనీషియా, అల్జీరియా, మలేసియా, జోర్డాన్‌లలోనూ నిషేధించారు. ఆర్డినెన్స్‌లో ఏముందంటే.. ► తక్షణ ట్రిపుల్ తలాక్‌కే ఇది వర్తిస్తుంది. ► తనకు, తన మైనర్ పిల్లలకు జీవన భృతి కోరు తూ బాధిత మహిళ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు. ► పిల్లల సంరక్షణ తనకే అప్పగించాలని భార్య కోర చ్చు. మెజిస్ట్రేట్‌దే తుది నిర్ణయం. ► బాధితురాలు, ఆమె రక్త సంబంధీకులు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదుచేయాలి. ► ట్రిపుల్ తలాక్‌ను నాన్‌బెయిలబుల్ నేరంగా పేర్కొంటున్నా, నిందితుడు విచారణకు ముందే బెయిల్ కోరుతూ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించొచ్చు. ► భార్య వాదనలు విన్న తరువాత మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేయొచ్చు. ► బిల్లు నిబంధనల ప్రకారం భార్యకు పరిహారం చెల్లించేందుకు అంగీకరించిన తరువాతే భర్తకు మెజిస్ట్రేట్ బెయిల్ ఇస్తారు. ► చెల్లించాల్సిన పరిహారం ఎంతో మెజిస్ట్రేట్ నిర్ణయిస్తారు. ► మెజిస్ట్రేట్ తన అధికారాలు ఉపయోగించి భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించొచ్చు. ► ట్రిపుల్ తలాక్ కాంపౌండబుల్ నేరం..అంటే, కేసును ఉపసంహరించుకునే స్వేచ్ఛ ఇరు వర్గాలకు ఉంటుంది. మార్పులు ఇలా.. ముమ్మారు తలాక్ లేదా.. అప్పటికప్పుడు ఈ–మెయిల్, వాట్సాప్ సందేశాలు, ఫోన్, లేఖల ద్వారా ఇచ్చే విడాకులు (ఇన్స్టంట్ తలాక్) రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టులో తీర్పునిచ్చాక ఈ అంశం వేగం పుంజుకుంది. దీనిపై చోటుచేసుకున్న మార్పులను ఓసారి పరిశీలిస్తే.. ► 2015 అక్టోబర్ 16: విడాకుల కేసుల్లో ముస్లిం మహిళలు లింగవివక్షకు గురవుతున్నారా? అని పరిశీలించేందుకు బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా సీజేఐని కోరిన సుప్రీంకోర్టు. ► 2016 జూన్ 29: రాజ్యాంగ పరిధిలోనే పరిశీలించాల్సి ఉందన్న అత్యున్నత న్యాయస్థానం ► డిసెంబర్ 9: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమన్న అలహాబాద్ హైకోర్టు. ► 2017 ఫిబ్రవరి 16: ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా, బహుభార్యత్వాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు. ► ఏప్రిల్ 16: ముస్లిం మహిళలకు ఈ సమస్య నుంచి విముక్తి కలగాలని మోదీ ప్రకటన. ► మే 15: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటిస్తే.. ముస్లిం వివాహాల క్రమబద్ధీకరణకు చట్టాన్ని తెచ్చేందుకు సిద్ధమని కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ► ఆగస్టు 15: ఎర్రకోట ప్రసంగంలో ముస్లిం మహిళలకు మోదీ అభినందన ► ఆగస్టు 22: ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటన ► డిసెంబర్ 28: లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం ► 2018 సెప్టెంబర్ 19: ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ ఆర్డినెన్సు జారీ. -
కేరళ అతలాకుతలం
తిరువనంతపురం: భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 29 మంది మృతి చెందగా, సుమారు 54వేల మంది నిర్వాసితులు అయ్యారు. వీరిలో 53,501 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని అధికారులు తెలిపారు. మరోవైపు వర్షాల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ఏడు ఉత్తర జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అదనంగా మరో 5 ఆర్మీ బృందాలను రంగంలోకి దింపారు. పెరియార్ నది నీటి మట్టం అతివేగంగా పెరుగుతోంది. ఇడుక్కి రిజర్వాయర్ నుంచి మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో ఇడుక్కితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆసియాలో అతిపెద్ద ఆర్చ్ డ్యాం ‘ఇడుక్కి రిజర్వాయర్’ నిండడంతో మరో 3 గేట్లను ఎత్తారు. వరదలపై మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరదల నేపథ్యంలో ఈ నెల 12 వరకు ఆయన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. -
‘మైనర్ ఇరిగేషన్’పై రంగంలోకి ఎన్ఆర్ఎస్సీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలో మైనర్ ఇరిగేషన్ కింద తెలుగు రాష్ట్రాలు వాడుకుంటున్న నీటి వినియోగంపై లెక్కలు తేల్చేందుకు ఇస్రో పరిధిలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) రంగంలోకి దిగనుంది. ఈ నెల 30న కృష్ణా బోర్డుతో పాటు తెలంగాణ, ఏపీ అధికారులతో మొదటి సమావేశం నిర్వహించ నుంది. మైనర్ ఇరిగేషన్ కింద జరుగుతున్న నీటి వినియోగాన్ని ఏ ప్రాతిపదికన లెక్కించాలన్న దానిపై సూచనలు తీసుకోనుంది. ఈ మేరకు ఎన్ఆర్ఎస్సీతో సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఇరు రాష్ట్రాలకు బోర్డు బుధవారం అందించింది. గోదావరి ప్రాజెక్టుల పరిధిలో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుపై నియమించిన కమిటీ ఈ నెల 29న సమావేశం కానుంది. -
కళ్లకు గంతలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన
ఇందూరు : నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కళ్లకు గంతలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానంతో ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ వస్తుందో, రాదో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విధానంతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మైఖేల్, విశాల్ రెడ్డి, సత్యానంద్, తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మకు నివాళి
వరంగల్ : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా, నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ 97వ జయంతి వేడుకలను హన్మకొండలోని డీసీసీ భవన్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇందిర చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి రాజేందర్‌రెడ్డి మాట్లాడారు. ఇందిరాగాంధీ తన తండ్రి నెహ్రూ అడుగు జాడల్లో పయనిస్తూ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ కార్యదర్శులు డాక్టర్ హరిరమాదేవి, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోన శ్రీకర్, కట్ల శ్రీనివాస్, టీపీసీసీ మీడియా కన్వీనర్ ఈవీ శ్రీనివాసరావు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధులు జి.అమృతరావు, నమిండ్ల శ్రీనివాస్, నాయకులు రావుల నర్సింహారెడ్డి, పోశాల పద్మ, బిన్ని లక్ష్మణ్, తాడిశెట్టి మధు, బాసాని వెంకటేశ్వర్లు, సురేందర్, రమేష్, మానుపాటి శ్రీనివాస్, సత్యం, సీతశ్యాం, ధనరాజ్, సేవాదళ్ అశోక్, అసోద రాజయ్య, బుచ్చిరెడ్డి, రవీందర్‌రెడ్డి, యాదగిరి, మాజీ కార్పొరేటర్లు నెక్కొండ కిషన్, గొట్టిముక్కుల రమణారెడ్డి, నాగరాజు, రావుల సదానందం, నసీంజా, వీరన్న, రాజు పాల్గొన్నారు. యువత పాత్ర కీలకం : కలెక్టర్ హన్మకొండ అర్బన్ : దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ జి.కిషన్ అన్నారు. జాతీయ సమైక్యతా వారోత్సవాలను కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ప్రారంభించారు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వారోత్సవాల్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంత రం సెట్వార్ సీఈఓ పురుషోత్తం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. యువత సేవా దృక్పథంతో పనిచేసే విధానం అలవర్చుకోవాలని అన్నారు. అనంతరం జాతీ య సమైక్యతపై అందరితో ప్రతిజ్ఞ చేయించా రు. ఈనెల 19 నుంచి 25 వరకు జాతీయ సమైక్యతా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అలాగే వ్యక్తిత్వ, వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో సురేంద్రకరణ్, నెహ్రూ యువకేంద్రం కోఆర్డినేటర్ మనోరంజన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. -
రెండు నెలల్లో మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
ఉట్నూర్ : వచ్చె రెండు నెలల్లో మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధంగా కావాలని ఏ,బీ,సీ,డీ వర్గీకరణ సాధించడమే ఎమ్మార్పీఎస్ ముందున్న లక్ష్యమని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చె రెండు నెలల్లో క్షేత్రస్థాయి నుంచి గ్రామ, మండల కమిటీలు పూర్తి చేయాలని పిలుపు నిచ్చారు.మాదిగలను ఏకం చేయడానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించానని గత నెల 28 నుంచి తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తున్నానన్నారు. అక్టోబర్ ఒకటి లేదా రెండు తేదీల్లో ఎమ్మార్పీఎస్ జాతీయ సమావేశం రాజమండ్రిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు వర్గీకరణకు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణకు సిద్ధంగా ఉన్నాయన్నారు. వర్గీకరణను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీలపై ఉందన్నారు. ఎమ్మార్పీఎస్ అంటే బయపడుతున్న సీఎం కేసీఆర్ ఎమ్మార్పీస్లో చిలికలు తేవాలని ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ తూర్పు, పశ్చిమ జిల్లా అధ్యక్షులు శరత్, శంకర్, ఉట్నూర్ మండల ఇన్చార్జి బిరుదుల లాజర్, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు విజయ్, సమావేశ అధ్యక్షుడు నాతరి రాజు, ఎంపీటీసీ బెరిగెడి మనోహర్, నాయకులు మల్లేశ్, నర్సయ్య, తుకారం, కుటికల ఆశన్న, రజీహైదర్, కేశవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ దారిలో పయనిస్తున్న టీఆర్ఎస్ మంచిర్యాల టౌన్ : సామాజిక, ఆర్థిక గణన అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నెల 19న చేపడుతున్న ఒక్కరోజు సర్వే మోసమని, వారం రోజులపాటు సర్వే జరపాలని మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తేల్చి చెప్పారు. మంగళవారం మంచిర్యాల ఒడ్డెర కాలనీలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు, యువకులు, మహిళలు ఎంఎస్పీ పార్టీలో చేరగా వారికి మంద కృష్ణమాదిగా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా లేకపోయిందని, ఇప్పుడు ఎంఎస్పీ మద్దతుగా నిలిచి ప్రజల హక్కులు, సమస్యలపై నిరంతర పోరాటం సాగిస్తుందన్నారు. తెలంగాణలో మొదటి స్వాతంత్య్ర వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించడంపై గడిలో అంటే రాజరిక వ్యవస్థకు శ్రీకారం చుట్టడమేనని అన్నారు. ఈ సంస్కృతిని చూస్తే కాంగ్రెస్ దారిలో టీఆర్ఎస్ పార్టీ పయనిస్తుందన్నారు. కాంగ్రెస్ కుటుంబ పాలనను ఎవ్వరూ ప్రశ్నించే వారు లేక గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడం చూస్తుంటే ప్రజాస్వామ్య విలువలు పక్కనపెట్టి దొరల పాలన, కేసీఆర్ కుటుంబ పాలనలా మారేలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ నాయకులు గోడిసెల దశరథం, చుంచు శంకర్‌వర్మ, బోయ రంజిత్‌కుమార్, కొట్నాక విజయ్, శరత్ పాల్గొన్నారు.