కళ్లకు గంతలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన
కళ్లకు గంతలు, నల్ల బ్యాడ్జీలతో నిరసన
Published Thu, Sep 1 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
ఇందూరు : నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కళ్లకు గంతలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానంతో ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ వస్తుందో, రాదో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విధానంతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మైఖేల్, విశాల్ రెడ్డి, సత్యానంద్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement