Water consumption
-
నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా?హైపోనాట్రేమియా వస్తుంది జాగ్రత్త!
నీళ్లు ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. అందుకే రోజూ వీలైంత ఎక్కువగా నీళ్లు తాగాలని డాక్టర్లు కూడా చెబుతుంటారు. మంచినీళ్లు తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మరీ ఎక్కువగా నీళ్లు తాగినా ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఓవర్‌హైడ్రేషన్ వల్ల శరీరం రకరకాల ఇబ్బందులకు గురి అవుతుంది. మరి ఒక మనిషి రోజు ఎన్ని లీటర్ల నీటిని తాగాలి? అతిగా నీళ్లు తాగితే వచ్చే ఇబ్బందులేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరం కావాలంటే సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే, నీళ్లు మన శరీరానికి హాని కలిగించే టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. తగినన్ని నీళ్లు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. సరైన మోతాదులో నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అయితే మంచిది కదా అని అతిగా నీళ్లు తాగడం చేయొద్దని డాక్టర్లు చెబుతున్నారు. మోతాదుకు మించి నీళ్లు తాగడం అన్నది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అతిగా నీళ్లు తాగడం వల్ల మెదడపు ఆ ప్రభావం పడుతుంది. బీపీ పెరగడంతో పాటు, కండరాలు నీరసించిపోవడం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి మన శరీరానికి ఎంత అవసరమో అంత మేరకే నీళ్లు తీసుకోవాలి. హైపోనాట్రేమియా ఏర్పడి.. మరణానికి కూడా అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు అతిగా నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు దాహం వేస్తుంది. అప్పుడు నీళ్లు తాగితే మంచిది. కానీ కొందరు కావాలని బలవంతంగా ఎక్కువగా నీళ్లు తీసుకుంటారు. దీని వల్ల రక్తంలో సోడియం లోపం ఏర్పడుతుంది. దీన్నే హైపోనాట్రేమియా అంటారు. ఇది ఎక్కువైతే, మెదడు వాపు,కోమాలోకి వెళ్లడం వంటివి కూడా జరుగుతాయి. కొన్నిసార్లు ఇది మరణానికి దారితీసే అవకాశం కూడా ఉంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా వాటి పనితీరు తగ్గిపోతుంది. రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి? మన శరీరానికి నీరు అవసరం అయినప్పుడు దాహం ద్వారా అది మనకు తెలుస్తుంది. అప్పుడు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది. చాలామంది నిలబడి నీళ్లు తాగుతుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల నీరు చాలా త్వరగా శరీరంలోకి చేరి జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ఒకేసారి ఏకధాటిగా కాకుండా చిన్న సిప్స్‌లో నెమ్మదిగా నీళ్లు తాగడానికి ప్రయత్నించడం. మరీ చల్లని, మరీ వేడినీళ్లు కాకుండా గోరువెచ్చటి నీళ్లు తాగడం ఉత్తమం. ఆరోగ్యంగా ఉన్న మనిషికి రోజుకు 3-4 లీటర్ల నీరు సరిపోతుంది. -
Bruce Lee: నమ్మిందే బ్రూస్లీ ప్రాణం తీసిందా?
మార్షల్ ఆర్ట్స్.. ఈ పేరు వినగానే కళ్ల ముందర మెదిలే రూపం బ్రూస్ లీ. తరాలు మారుతున్న మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తికనబరిచే యువతకు ఆయనే ఆదర్శం. ఒకవైపు డిష్యుం.. డిష్యుంలతో పాటు నటుడిగానూ అశేష అభిమానులను సంపాదించుకున్నారాయన. అయితే.. కేవలం 32 ఏళ్ల వయసులోనే చనిపోయి.. అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసి వెళ్లిపోయారు. ఆ టైంలో ఆయన మరణంపై రకరకాల ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. కానీ, మెదడు వాపు కారణంగానే ఆయన చనిపోయారని వైద్యులు ఆ టైంలో ప్రకటించారు. అయితే.. ఇప్పుడు సుమారు యాభై ఏళ్ల తర్వాత ఆయన మరణానికి కారణం చర్చలోకి వచ్చింది. మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ మరణంపై తాజాగా మరో ప్రకటనపై చేశారు పరిశోధకులు. అదీ ఓ అధ్యయనం నిర్వహించి మరీ!. 1973 జులైలో సెరెబ్రల్ ఎడిమా అనే వ్యాధితో బ్రూస్లీ మరణించినట్లు ఆయన్ని పరిశీలించిన వైద్యులు ప్రకటించారు. సెరెబ్రల్ ఎడిమా అంటే మెదడు వాపు. పెయిన్‌కిల్లర్స్ అతిగా వినియోగించడం వల్ల మెదడు కణాలు వాపు ఎక్కినట్లు వైద్యులు భావించారు. కానీ.. బ్రూస్లీ మరణం వెనుక.. మంచి నీళ్లు ఉన్నాయన్నది ఇప్పుడు స్పెయిన్ సైంటిస్టులు చెప్తున్న మాట. అవును.. అతిగా నీళ్లు తాగడం వల్లే బ్రూస్లీ మరణించారని స్పెయిన్ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం నిర్వహించి మరీ ప్రకటించారు. హైపోనాట్రేమియా.. అతిగా నీరు తాగడం వల్ల శరీరంలో అవసరానికి మించిన సోడియం స్థాయిలు కరిగిపోతాయి. ఈ స్థితి వల్లే బ్రూస్లీ సెరెబ్రల్ ఎడిమా బారిన పడినట్లు స్పెయిన్ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనం ద్వారా వెల్లడించారు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల సోడియం లెవల్స్ తగ్గిపోయి.. శరీరంలోని కణాలు, ముఖ్యంగా మెదడులో కణాలు వాపు చెందుతాయి. అదే బ్రూస్లీ మరణానికి దారితీసి ఉంటుందని ఇప్పుడు స్పెయిన్ సైంటిస్టులు చెప్తున్నారు. ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం, గంజాయి లాంటి మాదకద్రవ్యాల వల్ల అతిగా దాహం వేయడం, ఆల్కహాల్ అలవాట్లతో అధిక నీటిని బయటకు పంపించే సామర్థ్యాన్ని కిడ్నీలు కోల్పోవడం వంటివి ఈ పరిస్థితికి దారితీస్తాయని స్పెయిన్ సైంటిస్టుల అధ్యయనం వెల్లడించింది. నీరు ఎక్కువగా తాగడం ముప్పే! బీ వాటర్ మై ఫ్రెండ్.. బ్రూస్ లీ తరపున విపరీతంగా వైరల్ అయ్యే కోట్ ఇది. పలు పుస్తకాల్లోనూ ఈ ప్రస్తావన ఉంటుంది. రోజూవారీ జీవితంలో ఆయన మంచి నీటికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు వాటిని చదివితే తెలుస్తుంది. అంతేకాదు.. ఓ మనిషి మంచి నీటిలా బతకాలంటూ ఆయన పేరు మీద ఓ ఫిలాసఫీ కూడా ప్రచారంలో ఉంది. కానీ, అంతలా నమ్మిన మంచి నీరే ఆయన ప్రాణం తీయడం ఇక్కడ విశేషం. అయితే అందుకు ‘అతి’ ప్రధాన కారణం అయ్యింది. నీరు అధికంగా తీసుకోవడం వల్ల మరణం సంభవిస్తుందా? అవును.. అలాంటి కేసులు మెడికల్ హిస్టరీలో బోలెడు నమోదు అయ్యాయి. చాలా ఎక్కువ నీటి వినియోగం ఇంట్రాక్రానియల్ ఒత్తిడిని (ICP)కి కారణం అవుతుంది. ఇది రకరకాల లక్షణాలకు, ఒక్కోసారి పరిస్థితులు తిరగబడి ప్రాణాల మీదకు కూడా తీసుకొస్తుంది. అసలు ఎంత తాగాలి.. ఒక వ్యక్తి తన మూత్రపిండాలు(కిడ్నీల) మూత్రం ద్వారా తొలగించగల దానికంటే ఎక్కువ నీటిని తీసుకుంటే 'ఓవర్‌హైడ్రేషన్' 'వాటర్ ఇంటాక్సికేషన్' సంభవిస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. హైపోనాట్రేమియా, సెరిబ్రల్ ఎడెమా సందర్భాల్లో ఒక్కోసారి అధికంగా నీరు తీసుకున్న గంటలో కూడా మరణం సంభవించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎంత నీరు తీసుకోవాలి?.. కొందరు రెండు, కొందరు మూడు, కొందరు ఐదు లీటర్లు అంటూ చెప్తుంటారు. కానీ, శాస్త్రీయంగా దీనికంటూ ఓ పరిమితి లేదు. కానీ, గంటలో లీటర్ లోపు నీటిని మాత్రమే తీసుకోవాలని కొన్నిసార్లు సూచిస్తుంటారు వైద్య నిపుణులు. తద్వారా కిడ్నీలపై ఒత్తిడి ఉండదని చెప్తున్నారు. అంతేకాదు.. అతిగా నీటిని తీసుకోవడం మూలంగా మానసిక అనారోగ్యం కూడా సంభవించవచ్చని చెప్తున్నారు. -
నీటి లెక్కలు తేల్చిన తుంగభద్ర బోర్డు
సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాశయం(టీబీ డ్యామ్)లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు వినియోగించుకున్న నీటి లెక్కలను టీబీ బోర్డు తేల్చింది. ఈ నీటి సంవత్సరంలో బోర్డు అంచనా వేసిన లభ్యత కంటే 7.80 టీఎంసీలు డ్యామ్‌లో అధికంగా లభించాయి. డ్యామ్‌లోని నీటిని దామాషా పద్ధతిలో దక్కిన కోటాలో ఏపీ 52.831, తెలంగాణ 5.253, కర్ణాటక 111.673 టీఎంసీలను వినియోగించుకున్నాయి. ఖరీఫ్ సీజన్లో డ్యామ్‌లోకి భారీ ఎత్తున ప్రవాహ జలాలు వచ్చినా.. రబీలో నిలిచిపోవడంపై బోర్డు వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఎగువన కర్ణాటక సర్కార్ అక్రమంగా భారీగా ఎత్తిపోతల పథకాలను చేపట్టడం వల్లే వరద పూర్తయిన తర్వాత సహజసిద్ధ ప్రవాహం డ్యామ్‌లోకి చేరడం లేదని.. ఇది ఆయకట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతోందని స్పష్టం చేస్తున్నాయి. మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన టీబీ డ్యామ్‌లో 230 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. ఆవిరి, ప్రవాహ నష్టాల రూపంలో 8 టీఎంసీలు పోను హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, రాయబసవన చానళ్ల ద్వారా కర్ణాటకకు 138.99, ఏపీకి 66.5 (ఎల్లెల్సీకి 24, హెచ్చెల్సీకి 32.50, కేసీ కెనాల్‌కు 10), ఆర్డీఎస్ కింద తెలంగాణకు 6.51 కలిపి మొత్తం 212 టీఎంసీలను పంపిణీ చేసింది. దామాషా పద్ధతిలో.. నీటి సంవత్సరం ఏటా జూన్ 1న ప్రారంభమై మే 31తో ముగుస్తుంది. 2020–21 నీటి సంవత్సరం ప్రారంభంలో జూన్ 9, 2020న డ్యామ్‌లో 163 టీఎంసీల లభ్యత ఉంటుందని బోర్డు అంచనా వేసింది. ఆ తర్వాత నవంబర్ 11న 168 టీఎంసీలు, డిసెంబర్ 20న 170.80 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసింది. ఈ నీటిని బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు.. దామాషా పద్ధతిలో కర్ణాటకకు 111.979, ఏపీకి 53.576, తెలంగాణకు 5.245 టీఎంసీలను కేటాయించింది. ఇందులో మూడు రాష్ట్రాలు 169.757 టీఎంసీలు వాడుకున్నాయి. రబీలో డీలా.. మే 30 2020 నాటికి డ్యామ్‌లో 1,584.56 అడుగుల్లో 6.35 టీఎంసీలు నిల్వ ఉండేవి. జూన్ 1 నుంచి సెపె్టంబర్ 30 వరకూ ఖరీఫ్ సీజన్లో డ్యామ్‌లోకి 288.477 టీఎంసీల ప్రవాహం వచ్చింది. మూడు రాష్ట్రాలు 92.661 టీఎంసీలు వాడుకున్నాయి. డ్యామ్ నిండటంతో గేట్లు ఎత్తేసి 92.443 టీఎంసీలను దిగువకు విడుదల చేశారు. ఆవిరి, ప్రవాహ నష్టాల రూపంలో వరుసగా 3.913, 2.597 వృథా అయ్యాయి. రబీ సీజన్ ప్రారంభమయ్యే నాటికి.. అంటే అక్టోబర్ 1 నాటికి 1,627.90 అడుగుల్లో 82.425 టీఎంసీలు నిల్వ ఉండేవి. అక్టోబర్ 1, 2020 నుంచి ఏప్రిల్ 4, 2021 వరకూ డ్యామ్‌లోకి కేవలం 3.982 టీఎంసీల ప్రవాహమే వచ్చింది. వరద పూర్తయిన తర్వాత సహజసిద్ధ ప్రవాహం డ్యామ్‌లోకి భారీగా వచ్చేది. కానీ.. కర్ణాటక ఎగువన భారీగా అక్రమ ఎత్తిపోతల చేపట్టి.. నీటిని తోడేస్తుండటం వల్ల రబీలో డ్యామ్‌లోకి ప్రవాహం కనిష్ట స్థాయికి పడిపోయింది. రబీలో మూడు రాష్ట్రాలు 77.096 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఆవిరి, ప్రవాహ నష్టాల రూపంలో వరుసగా 2.412, 1.999 టీఎంసీలు వృథా అయ్యాయి. ఈ నెల 10 నాటికి డ్యామ్‌లో 4.90 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. -
కృష్ణా బేసిన్లో చెరువుల నీటి వినియోగం తక్కువే
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ బేసిన్‌లోని ఈ ఏడాది లోటు వర్షపాతం కారణంగా చిన్న నీటి వనరులైన చెరువుల కింద తెలంగాణలో నీటి వినియోగం తగ్గింది. చెరువుల కింద 89 టీఎంసీల కేటాయింపులున్నా 19.30 టీఎంసీల నీటినే రాష్ట్రం వినియోగించుకోగలిగింది. గతానికి భిన్నంగా నీటి వినియోగం తగ్గడం రాష్ట్రాన్ని కలవర పరుస్తుండగా, మరోవైపు ఈ లెక్కలను ఏపీ తప్పుపడుతుండటం వివాదాలకు తావిస్తోంది. నిజానికి కృష్ణా బేసిన్లో చెరువుల కింద 89 టీఎంసీల కేటాయింపులున్నా, చిన్న నీటి వనరుల సగటు వినియోగం 1998 నుంచి 2008 వరకు 47.7 టీఎంసీలు మాత్రమే . ఇక 2006 నుంచి 2015 వరకు చూస్తే ఇది 46.97 టీఎంసీలుంది. ఈ ఏడాది మాత్రం సాధారణ వర్ష పాతం 769 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉన్నా ఈ నెల 10 వరకు 665.5 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. 62శాతం మండలాల్లో 59 నుంచి 20శాతం లోటు నమోదు కాగా, మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో చెరువుల్లో 19.30 టీఎంసీల నీరు మాత్రమే చేరింది. దీంతో జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల పరిధిలోని ఎత్తిపోతల పథకాల ద్వారా చెరువులను నింపారు. కాగా రాష్ట్రంలో చెరువుల వినియోగం అధికంగా ఉంటోందని, దాన్ని పరిగణనలోకి తీసుకొనే నీటి వాటాలు, కేటాయింపులు చేయాలని ఏపీ వాదిస్తోంది. మంగళవారం జరగనున్న కృష్ణా బోర్డు భేటీలో దీనిపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రం తన వాద నలు సిద్ధం చేసుకుంది. దీనికి తోడు శ్రీశైలం నుంచి ఇష్టారీతిన ఏపీ చేస్తున్న నీటి వినియోగాన్ని బోర్డు ముందు పెట్టాలని నిర్ణయించింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా శ్రీశైలం నీటిని ఏపీ వాడేస్తుండటంతో త్వరలోనే శ్రీశైలంలో కనీస నీటి మట్టాలకు నిల్వలు పడి పోయే ఆస్కారం ఉందని ప్రస్తావించనుంది. ఇదీగాక వచ్చే మే వరకు సాగర్‌లో కనీస నీటి మట్టాలను 520 అడుగులు ఉంచాల్సిన అవస రం ఉందనీ, అలా అయితేనే ఆగస్టు వరకు ఇరు రాష్ట్రాలకు అవసరమయ్యే 21 టీఎంసీల తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఉండదన్నది తెలంగాణ భావన. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీటి వినియోగంపై ఏపీని నియంత్రించాలని తెలంగాణ కృష్ణాబోర్డును కోరే అవకాశాలున్నాయని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. -
పడిపోతున్న భూగర్భ జలాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భజల మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 9 శాతం లోటు వర్షపాతంతో మట్టాలు తగ్గిపోగా ప్రస్తుతం యాసంగి పంటల సాగు పెరగడంతో పాటుగా వేసవి ఉధృతి తోడు కావడంతో భూగర్భ జలాలు మరింత వేగంగా అడుగంటిపోతున్నాయి. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో నీటి వినియోగం పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 0.94 మీటర్ల మేర భూగర్భ మట్టం కిందకి దిగజారింది. పూర్తి స్థాయిలో పంటలకు నీటి వినియోగం పెరిగితే అది మరింత తీవ్రంగా ఉంటుందని భూగర్భ జల విభాగం హెచ్చరించింది. రాష్ట్రంలో 70 శాతం ప్రజలు 23 లక్షల బోర్ల ద్వారా భూగర్భ నీటిని వినియోగిస్తున్నారు. డిసెంబర్ నాటికే పడిపోయిన మట్టాలు ఈ ఏడాది మెదక్, అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో 35 నుంచి 21 శాతం వరకు తక్కువ వర్షపాతం కురిసింది. దీంతో చాలా జిల్లాల్లో డిసెంబర్ నాటికే 0.5 మీటర్ల నుంచి 5.07 మీటర్ల వరకు నీటి మట్టాలు పడిపోయాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర సగటు భూగర్భమట్టం 10.17 మీటర్లు ఉండగా, ఈ ఏడాది సగటు మట్టం 10.97 మీటర్లుగా ఉంది. అంటే గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది 0.80 మీటర్ల మేర మట్టాలు పడిపోయాయి. ఇక గత ఏడాది డిసెంబర్లో సగటు మట్టాలు 9.18 మీటర్లు ఉండగా, ప్రస్తుతం ఉన్న మట్టం 10.17తో పోలిస్తే ఏకంగా 0.99 మీటర్లు మేర మట్టాలు తగ్గిపోయాయి. భూగర్భ జల వనరుల శాఖ తాజా నివేదిక ప్రకారం గత ఏడాది ఫిబ్రవరి మట్టాలతో పోలిస్తే అత్యధికంగా సిరిసిల్ల జిల్లాలో 4.09 మీటర్లు దిగువకు పడిపోగా, తర్వాతి స్థానాల్లో పెద్దపల్లి 3.85, నిజామాబాద్ 3.61, మెదక్ 3.61, నిర్మల్ 3.40 మీటర్లు మేర మట్టాలు పడిపోయాయి. -
‘మైనర్ ఇరిగేషన్’పై రంగంలోకి ఎన్ఆర్ఎస్సీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్ పరిధిలో మైనర్ ఇరిగేషన్ కింద తెలుగు రాష్ట్రాలు వాడుకుంటున్న నీటి వినియోగంపై లెక్కలు తేల్చేందుకు ఇస్రో పరిధిలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) రంగంలోకి దిగనుంది. ఈ నెల 30న కృష్ణా బోర్డుతో పాటు తెలంగాణ, ఏపీ అధికారులతో మొదటి సమావేశం నిర్వహించ నుంది. మైనర్ ఇరిగేషన్ కింద జరుగుతున్న నీటి వినియోగాన్ని ఏ ప్రాతిపదికన లెక్కించాలన్న దానిపై సూచనలు తీసుకోనుంది. ఈ మేరకు ఎన్ఆర్ఎస్సీతో సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఇరు రాష్ట్రాలకు బోర్డు బుధవారం అందించింది. గోదావరి ప్రాజెక్టుల పరిధిలో టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుపై నియమించిన కమిటీ ఈ నెల 29న సమావేశం కానుంది. -
ఈ–టాయ్లెట్లు వస్తున్నాయ్ !
తక్కువ నీటి వినియోగం ఆటో క్లినింగ్ సదుపాయం సిటీబ్యూరో: అతి తక్కువ నీటి వినియోగంతో ఆటో క్లీనింగ్ సదుపాయాలతో ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండే దుర్గంధ రహిత ఎలక్ట్రానిక్ టాయ్లెట్ల(ఈ–టాయ్లెట్ల) ఏర్పాటుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. దేశంలోని కొన్ని నగరాల్లో మాత్రమే ఉన్న ఈ టాయ్లెట్లను గ్రేటర్లో తొలిదశలో 10 – 15 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఎలా పనిచేస్తాయి ఈ–టాయ్లెట్లు.. వినియోగానికి ముందు.. తర్వాత ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసే మెకానిజం ఈ టాయ్లెట్ల ప్రత్యేకత. ఎనరోబిక్ బయోడిగ్రేషన్ ద్వారా ఎప్పటికప్పుడు వ్యర్థాల నిర్వహణ జరుగుతుంది. ప్రత్యామ్నాయంగా సివర్ లైన్‌కు లేదా సెప్టిక్ ట్యాంక్‌కు కూడా వ్యర్థాలు వెళ్లేలా చేయవచ్చు. నిత్యం మనుషులతో క్లీనింగ్, నిర్వహణ అవసరం లేదు. వినియోగించేందుకు వెళ్లిన వారికి టాయ్‌లెట్ అందుబాటులో ఉన్నదీ, లేక లోపల ఇతరులున్నదీ ఎల్ఈడీ ఇండికేషన్స్ ద్వారా తెలుస్తుంది. లోపల ఎవరైనా ఉంటే బయట రెడ్ లైట్, ఎవరూ లేకపోతే గ్రీన్ లైట్ వెలుగుతుంది. టాయ్లెట్లో 225 లీటర్ల నీటి సామర్ధ్యం కలిగిన ఇన్‌బిల్ట్ వాటర్ ట్యాంక్ ఉంటుంది. ట్యాంక్‌లో నీటి పరిమాణం ఎంత ఉందో కూడా తెలుస్తుంది. టాయ్‌లెట్స్‌ను వినియోగించే విధానం అక్షరాల్లో రాసి ఉండటంతో పాటు వాయిస్ గైడెన్స్ సదుపాయానికి కూడా అవకాశం ఉంది. సీఎస్ఆర్ కింద ఏర్పాటు.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద వీటికయ్యే వ్యయాన్ని భరించేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. పురుషుల కోసం ఏర్పాటు చేసే టాయ్లెట్లకు ఒక్కోదానికి రూ. 6.35 లక్షలు, మహిళల టాయ్లెట్లకు ఒక్కోదానికి రూ. 7.30 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఎలక్ట్రికల్, మెకానికల్, వెబ్–మొబైల్ టెక్నాలజీస్‌తో ఇవి పనిచేస్తాయి. నేడు చార్మినార్ వద్ద షీ–టాయ్‌లెట్ ప్రారంభం ఈ–టాయ్లెట్లను పురుషులవి హీ– టాయ్‌లెట్స్, మహిళలవి షీ–టాయ్‌లెట్స్‌గా పేర్కొంటున్నారు. నగరంలో తొలిసారిగా ప్రముఖ పర్యాటక కేంద్రం చార్మినార్ వద్ద షీ–టాయ్‌లెట్స్‌కు మేయర్ రామ్మోహన్, ప్రజాప్రతినిధులు శుక్రవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. షీ టాయ్‌లెట్స్‌లో క్లాత్‌లతో కూడిన వ్యర్థాలను పడవేస్తే అంతర్గతంగా ఆమ్ల రసాయన ప్రక్రియతో అవి పూర్తిగా కాలిపోయే ఏర్పాటు ఉందని అధికారులు పేర్కొన్నారు. వీటిల్లో న్యాప్కిన్స్ను కూడా అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. త్వరలో ఫలక్‌నుమా ప్యాలెస్, ట్యాంక్‌బండ్, గోల్కొండ కోట, కులీకుతుబ్‌షా టూంబ్స్, పంజగుట్ట తదితర ప్రాంతాల్లో ఈ–టాయ్లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. -
రోజుకు 8 గ్లాసుల నీళ్లు.. అవసరమేనా?
రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది చెబుతారు. కానీ, నీళ్లు మరీ ఎక్కువ తాగినా కూడా ప్రమాదమేనని తాజాగా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మనిషి శరీరంలో అసలు ఎన్ని నీళ్లు కావాలో నిర్ణయించుకునే వ్యవస్థ ఉంటుందని, ఎక్కువ నీళ్లు తాగకుండా అదే ఆపుతుందని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు. అయినా పట్టించుకోకుండా ఎక్కువ నీళ్లు తాగితే 'హైపోనెట్రేమియా' అనే సమస్య వస్తుందని చెబుతున్నారు. దానివల్ల రక్తంలోని సోడియం గణనీయంగా పడిపోతుందని హెచ్చరించారు. దానివల్ల వాంతులు, వికారంతో మొదలుపెట్టి ఒక్కోసారి ఏకంగా మనిషి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉందన్నారు. నీళ్లు మరీ ఎక్కువ తాగినపుడు మనిషి మెదడు కూడా స్పందించి ఆ విషయాన్ని తెలియజేస్తుందట. మన శరీరానికి ఎంత కావాలో అంతే నీళ్లు తాగితే పర్వాలేదని, కేవలం దాహం వేసినప్పుడే తాగాలి తప్ప.. కావాలని నీళ్లు ఎక్కువగా తాగకూడదని పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ మైఖేల్ ఫారెల్ తెలిపారు. ఇందుకోసం కొంతమందిని తీసుకున్న ఈ బృందం వారిలో సగం మందిని సరిగ్గా దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలని చెప్పి, మిగిలిన సగం మందిని మాత్రం ఎక్కువ నీళ్లు తాగమని చెప్పారు. వాళ్లక ఎంఆర్ఐ తీసి చూడగా.. నీళ్లు ఎక్కువ తాగేవాళ్ల మెదడులోని ప్రీ ఫ్రంటల్ ప్రాంతాలు బాగా చురుగ్గా ఉన్నాయట. వాళ్లు ఏదైనా తినాలంటే నమలడానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందట. ఈ పరిశోధన ఫలితాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్లు ఆన్లైన్లో ప్రచురించారు. -
భూగర్భజలాలను కాపాడండి
► భావితరాల కోసం నీటిని సంరక్షించండి ► సుదర్శన్, రిటైర్డు రీజినల్ డెరైక్టర్ సీజీడబ్ల్యూబీ హుస్నాబాద్‌రూరల్ : ‘భూగర్భజలాలు కాపాడండి.. భావితరాలకు నీటిని సంరక్షించండి.. చినుకు చినుకు కలిస్తే చెరువు నిండునే.. చెరువు కళకళలాడితే బావులు నిండునే.. ’ అనే నినాదంతో కేంద్ర భూగర్భ జలబోర్డు దక్షణ క్షేత్రం హైదరాబాద్ వారు నీటి పొదుపు భూగర్భజలాల సంరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అతి నీటి వినియోగం, భూగర్భజల సమస్యలు, భాగస్వామ్య పద్ధతులపై వివరిస్తున్నారు. మొదటి రోజు సదస్సును కేంద్ర భూగర్భజల బోర్డు సీనియర్ శాస్త్రవేత్త పి.నాగేశ్వర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర భూగర్భజల బోర్డు రిటైర్డు రీజినల్ డెరైక్టర్ జి.సుదర్శన్ వర్షపు నీరు పొదుపు పై అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లాలో అతిగా బోర్లు, బావుల ద్వారా నీటి వినియోగం జరుగుతోందని, ఫలితంగా 20 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయని చెప్పారు. ఈ క్రమంలో వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడుగుంతలు, నీటికుంటలు, కాంటూర్ కందకాలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని సూచిం చారు. పంటలకు అతిగా నీటిని వినియోగిస్తున్నారని, అలాకాకుండా మైక్రోఇరిగేషన్ వైపు దృష్టి సారించాలని సూచించారు. బిందు, తుంపుర సేద్యం ద్వారా సాగు చేస్తే నీరు పొదుపు అవుతుందని వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులు వృథా నీటిపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త భాస్కర్‌రెడ్డి, హరికుమార్ ఏడీఏ మహేష్, ఆర్‌డబ్ల్యూస్ ఏఈ సుభాష్‌రెడ్డి, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులు చుట్టొద్దాం
- కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల నిర్ణయం - నదీజలాల వివాదాలపై అవగాహనకు వచ్చేందుకే... - ప్రాజెక్టులు తమ పరిధిలోకొస్తే అజమాయిషీ ఎలా అనే దానిపై కసరత్తు సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాలపై అవగాహనకు వచ్చేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు నిర్ణయించాయి. మరో 3, 4 రోజుల్లో వర్షాకాలం మొదలుకానుండటం, ఈ ఏడాది ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తెచ్చుకునే కసరత్తులు మొదలు కావడం, కేంద్రం నోటిఫై చేస్తే ప్రాజెక్టుల నిర్వహణను తామే చేపట్టాల్సి ఉండటంతో ముందుగా ప్రాజెక్టుల పర్యటనకు వెళ్లాలని బోర్డులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జూన్ 4 నుంచి రెండ్రోజులపాటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేపట్టనున్న పర్యటనకు ముందు లేదా ఆ తర్వాత ప్రాజెక్టుల పరిధిలో పర్యటించేలా ప్రణాళిక రచించుకున్నట్లు సమాచారం. కృష్ణా ప్రాజెక్టుల పరిధిలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పరిధిలో నీటి వినియోగం, విడుదల, ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య తీవ్ర విభేదాలు నెలకొనడం తెలిసిందే. ప్రాజెక్టులను నియంత్రణలోకి తెచ్చుకోవాలని కృష్ణా బోర్డుపై ఏపీ ఒత్తిడి తెస్తుంటే తెలంగాణ దాన్ని తిరస్కరిస్తోంది. అయితే ఏపీ వాదనకే మొగ్గు చూపిన బోర్డు వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకునేలా కసరత్తు చేస్తోంది. అదే జరిగితే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, భీమా, ఏఎమ్మార్పీ వద్ద మెజరింగ్ పాయింట్లూ బోర్డు నియంత్రణలోకి వెళ్తాయి. ఇందుకోసం ముందుగా సాగర్, శ్రీశైలం, జూరాల డ్యామ్‌ల ఏడాది నిర్వహణ ఖర్చు వివరాలతోపాటు హెడ్ రెగ్యులేటర్లు, పంప్‌హౌస్‌లు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, గేట్ల నిర్వహణ, విద్యుత్, జనరేటర్లు, డీజిల్, లిఫ్ట్‌ల వంటి వివరాలన్నింటిపై బోర్డు అంచనాకు రావాల్సి ఉంటుంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చీఫ్ ఇంజనీర్ హోదాలో బోర్డుల చైర్మన్లు లేదా బోర్డు సభ్య కార్యదర్శులకు ఎక్కడైనా పర్యటించే వెసులుబాటు ఉంటుందని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. 4వ తేదీ తర్వాతే బోర్డుల పర్యటనలు! జూన్ 4 నుంచి రాష్ట్రంలో రెండ్రోజులపాటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పర్యటించి కృష్ణా, గోదావరి నదుల పరిధిలోని ప్రాజెక్టుల స్థితిగతులపై అధ్యయనం చేయనుంది. కమిటీ పర్యటనకు ముందే ప్రాజెక్టుల పరిధిలో పర్యటించాలని కృష్ణా బోర్డు మొదట నిర్ణయించింది. అయితే కృష్ణా బోర్డు చైర్మన్ నాథన్ మంగళవారం పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కమిటీ పర్యటన ముగిశాకే ప్రాజెక్టులను సందర్శించాలని బోర్డు సభ్యులు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు గోదావరి బోర్డు చైర్మన్ రామ్‌శరాణ్ జూన్ రెండో వారంలో ప్రాజెక్టులను సందర్శించి నీటి లభ్యతపై అవగాహనకు రావాలని నిర్ణయించారు. -
ముందే మేల్కొన్న కృష్ణా బోర్డు!
♦ వర్షాకాలం ప్రారంభానికి ముందే నీటి వివాదాలు చక్కదిద్దే కసరత్తు ♦ ఈ నెల 27న బోర్డు సమావేశం.. ఇరు రాష్ట్రాలకు లేఖలు ♦ నీటి వినియోగ ప్రణాళికలు, ప్రోటోకాల్ సిద్ధం చేసే అవకాశం సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీల మధ్య తలెత్తుతున్న వివాదాలకు ఆదిలోనే పరిష్కారం చూపే దిశగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రంగంలోకి దిగింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే నీటి వివాదాలకు పరిష్కారం, నీటి వినియోగ, విడుదల ప్రోటోకాల్‌ను సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 27న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు బోర్డు శుక్రవారం లేఖలు రాసింది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగానే వచ్చే ఏడాది జూన్ వరకు నీటి ప్రణాళికలు ఉండనున్నాయి. రెండేళ్లుగా.. కృష్ణా జలాల వినియోగం విషయంలో బచావత్ అవార్డు మేరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందు లో ప్రాజెక్టుల వారీ కేటాయింపులున్నా పలు ప్రాజెక్టులు పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో వాటా నీటిని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా వాడుకుంటామని తెలంగాణ స్పష్టం చేసింది. అలాగే ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నియంత్రణ అంశంపైనా వివాదం నడుస్తోంది. దీనిపై గతేడాది ఏకంగా ఇరు రాష్ట్రాల పోలీసులు తలపడేదాకా వెళ్లింది. అన్ని అంశాలపై చర్చించనున్న బోర్డు ఇరు రాష్ట్రాలు గతేడాది కేంద్ర ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో కుదుర్చుకున్న అవగాహన మేరకు... కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాజెక్టుల్లో నీటి విడుదల ప్రోటోకాల్‌ను కూడా బోర్డే పర్యవేక్షిస్తుంది. ఇక ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి, విడుదల చేసేందుకు బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన, రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాజెక్టుల అధికారుల నుంచి నీటి అవసరాలపై ఈ కమిటీకి ప్రతిపాదనలు వెళితే... నీటి లభ్యతను బట్టి విడుద లకు అవసరమైన ఆపరేషన్ ప్రోటోకాల్‌ను కమిటీ సిఫార్సు చేస్తుంది. ఆ సిఫార్సులకు అనుగుణంగా బోర్డు తగిన ఆదేశాలు జారీ చేస్తోంది. అయితే ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నీటిని వాటి సరిహద్దుల్లో ఎక్కడైనా వాడుకునే వెసులుబాటు కల్పించారు. దీని ప్రకారమే ప్రస్తుత వినియోగం జరుగుతోంది. కానీ ఈ నీటి వినియోగ లెక్కల విషయంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య తేడాలు ఉండటంతో వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే ఇరు రాష్ట్రాలు ఎప్పటికప్పుడు తమ ప్రాజెక్టుల నీటి అవసరాలను బోర్డుకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక గతంలో తయారు చేసుకున్న ముసాయిదా గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈలోగా బోర్డు మరోమారు ఇరు రాష్ట్రాలతో చర్చలు జరిపి ఓ ముసాయిదా ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంది. అందులో భాగంగానే ఈనెల 27న ముందస్తు సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే ఇప్పటివరకు ఉన్న విధానాన్నే కొనసాగిస్తారా, లేక మార్పులు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. దీంతోపాటు తెలంగాణ చేపట్టిన పాలమూరు, డిండి ప్రాజెక్టులపై ఏపీ అనేక అభ్యంతరాలు లేవనెత్తుతోంది. వాటిపైనా బోర్డు సమావేశంలో చర్చించే అవకాశముంది. -
వివాదం వచ్చినప్పుడే వాటాలు గుర్తుకొస్తే ఎలా?
♦ తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ ♦ నీటి అవసరాలపై సమాచారం అడిగితే ♦ స్పందించడం లేదని ఆక్షేపణ ♦ డేటా ఉంటేనే మార్గదర్శనం చేయవచ్చని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వాస్తవ, భవిష్యత్ అవసరాలకు సంబంధించి డేటా సమర్పించే విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సరైన రీతిలో స్పందించకపోవడంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అసహనం వ్యక్తం చేసింది. వివాదాలు వచ్చినప్పుడు మాత్రమే రెండు రాష్ట్రాలు స్పందిస్తున్నాయి తప్పితే, ఏడాదిగా వివరాలు కోరుతున్నా.. స్పందన కరువైందని, ఇలాంటి పరిస్థితుల్లో మార్గదర్శనం చేయడం అంత సులువు కాదని బోర్డు నిస్సహాయతను వ్యక్తం చేసింది. ఇటీవల కనీస నీటి మట్టాలకు దిగువన నాగార్జునసాగర్, శ్రీశైలంలో ఉన్న నీటి లెక్కలను గణించి, ఏపీకి 6 టీఎంసీలు, తెలంగాణకు 3 టీఎంసీలు కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు ఘాటుగా లేఖ రాసింది. ఇరు రాష్ట్రాల వాస్తవ వినియోగ లెక్కలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయలేదని, ఈ దృష్ట్యా సాగర్ నుంచి ఏపీ అవసరాలకు నీటిని విడుదల చేయలేమని స్పష్టం చేసింది. ఈ లేఖ నేపథ్యంలోనే బోర్డు ఇరు రాష్ట్రాలకు సోమవారం విడివిడిగా లేఖలు రాసింది. ‘‘గత ఏడాది జూన్‌లో జరిగిన సమావేశం సందర్భంగా వాస్తవ అవసరాలను, భవిష్యత్ అవసరాలను సమర్పించాలని బోర్డు సూచించగా, ఇరు రాష్ట్రాలు సమ్మతించాయి. అయితే ఇంతవరకు అలాంటి సమాచారం బోర్డుకు అందివ్వలేదు. దీనిపై పలుమార్లు బోర్డు చైర్మన్, బోర్డు సభ్య కార్యదర్శి వివరాలు కోరినా స్పందన లేదు. ప్రాజెక్టుల పరిధిలో నీటి వినియోగ డేటాను ఇరు రాష్ట్రాలు, బోర్డు ద్వారా పరస్పర బదిలీ చేసుకోవాల్సి ఉన్నా అదీ జరగడం లేదు. కేవలం నీళ్లు అత్యవసరం అయినప్పుడు మాత్రమే నీటి వాటా, వినియోగ లెక్కల అంశాలను ప్రస్తావిస్తున్నారు’’ అని బోర్డు లేఖలో పేర్కొంది. ఇరు రాష్ట్రాల తాగు నీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని.. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నీటి వాటాల్లోంచే ఆ నీటిని వాడుకోవాలన్నారు. అయితే బోర్డు వద్ద నీటి వినియోగం, భవిష్యత్ అవసరాల డేటా లేక అది సాధ్యం కావడం లేదంది. -
తమ్మిడిహెట్టి వద్దే గరిష్ట నీటి వినియోగం!
ప్రభుత్వానికి రిటైర్డ్ ఈఎన్సీ హనుమంతరావు సూచన సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉన్న తమ్మిడిహెట్టి వద్దే గరిష్ట నీటిని వినియోగించుకునేందుకు ప్రయత్నించాలని నీటి పారుదల రంగ నిపుణుడు, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ప్రభుత్వానికి సూచించారు. ఎత్తు తగ్గింపుతో కొరతగా ఉండే నీటిని మేడిగడ్డ నుంచి తీసుకోవాలని, దాంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై వ్యయభారం గణనీ యంగా తగ్గుతుం దని స్పష్టం చేశారు. తమ్మిడిహెట్టి ఎత్తుతో సంబంధం లేకుండా అక్కడ గరిష్టంగా 100 టీఎంసీల లభ్యత ఉంటుందని.. అయితే లభ్యతపై వాస్తవాలు తెలియాలంటే రూర్కీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నిపుణులతో అధ్యయనం చేయించాలని సూచించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పు, మేడిగడ్డ నుంచి నీటి తరలింపు చర్చనీయాంశమైన నేపథ్యంలో దీనిపై ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తమ్మిడిహెట్టి బ్యారేజీ, రిజర్వాయర్ నిర్మాణం, నీటి లభ్యత ఎలా ఉండాలన్న దానిపై పలు వివరణలు, సూచనలు ఇచ్చారు. హనుమంతరావు చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఎత్తు ఏదైనా నీటికి కొదవ లేదు ‘‘తమ్మిడిహెట్టి ఎత్తు 148 మీటర్లా.. 152 మీటర్లా అన్న చర్చ జరుగుతోంది. సాంకేతికంగా అక్కడ ఏ ఎత్తు ఉన్నా సమస్య లేదు. ఎత్తులో తేడా వల్ల నీటి కొరత ఉండేది కేవలం 3 టీఎంసీలే. ఆ నీటిని ప్రస్తుతం 180 టీఎంసీల సామర్థ్యంతో కడుతున్న రిజర్వాయర్లలో ఎక్కడైనా సర్దుబాటు చేయవచ్చు. అదీగాక తమ్మిడిహెట్టి వద్ద 26,500 క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. ఇక్కడ కనిష్టంగా 20 వేల క్యూసెక్కులు లభించినా నీటికి కొదవలేదు. మహారాష్ట్రతో గొడవ పడటం కన్నా 148 మీటర్లకు అంగీకరించడం మంచిదే.. గరిష్ట నీటి వినియోగం అక్కడే.. వ్యాప్కోస్ సర్వేలో ఒకసారి తమ్మిడిహెట్టి వద్ద 70 నుంచి 100 టీఎంసీల లభ్యత ఉంటుందని, మరోసారి 110 టీఎంసీల మేర లభ్యత ఉంటుందని చెప్పారు. నా ఉద్దేశం మేరకు అక్కడ 100 టీఎంసీల లభ్యత ఉంటుంది. అలాకాకుంటే అక్కడ ఎంత లభ్యతగా ఉంటే అంత నీటిని తీసుకుని, తక్కువ పడిన నీటిని మేడిగడ్డ నుంచి తీసుకోవాలి. మేడిగడ్డ కన్నా తమ్మిడిహెట్టి 50 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అప్పుడు పంపింగ్ సులభమవుతుంది. సాంకేతికం గా, ఆర్థికంగా ఇది మంచిది. విద్యుత్ ఖర్చు తగ్గుతుంది. అయితే తమ్మిడిహెట్టి వద్ద నీటిలభ్యత శాస్త్రీయంగా తెలియాలంటే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ నిపుణులతో అధ్యయనం చేయించాలి. తమ్మిడిహెట్టి-ఎల్లంపల్లి మధ్య రిజర్వాయర్లు నిర్మించాలి 71 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లను మెదక్ జిల్లాలో చేపడుతున్నారు. ఇక్కడ తాగు, సాగు అవసరాల కోసం ఏడాది పొడవునా నీరుంచాలంటే.. ఆ నీటిలో 20 శాతం ఆవిరి నష్టాలు, సీపేజ్ నష్టాలు ఉంటా యి. అంతేగాకుండా ఈ రిజర్వాయర్లను నింపేందుకు 148 మీటర్ల ఎత్తున ఉన్న ఎల్లంపల్లి నుంచి 600 మీటర్ల ఎత్తున్న మల్లన్నసాగర్‌కు పంపింగ్ చేయాలి. దీనికి విద్యుత్ అవసరం చాలా ఎక్కువ. అయితే ఇదే తరహాలో రెండు బ్యారేజీలను అదే సామర్థ్యంతో తమ్మిడిహెట్టి, ఎల్లంపల్లి మధ్య ఏర్పాటు చేస్తే గ్రావిటీ ద్వారా నీరొస్తుంది. పంపింగ్‌కు విద్యుత్ అవసరం ఉండదు, వ్యయం చాలా తగ్గుతుంది. అయితే రిజర్వాయర్ల ఏర్పా టు నైసర్గికంగా సాధ్యపడే అంశాలపై లైడార్ సర్వే చేయాలి. దీంతోపాటే ఎల్లంపల్లి నుంచి ఎస్ఆర్ఎస్పీకి నీటిని గోదావరి మార్గం ద్వారా తీసుకెళ్లేందుకు 14 బ్యారేజీలు నిర్మించాలి. దీని ద్వారా వరదలు వచ్చినప్పుడు విద్యుదుత్పాదనకు అవకాశం ఉంటుంది. నిజాంసాగర్, సింగూరు మధ్య వరుస బ్యారేజీలు నిర్మించాలి. ఇలా చేస్తే గరిష్ట నీటి వినియోగం, ఆర్థిక వ్యయం, విద్యుత్ అవసరాలు తగ్గుతాయి.’’ -
అమృతం అంతంతే..!
♦ అమృత్ పథకం కింద రూ.700 కోట్లకు పైగా ప్రతిపాదనలు ♦ రూ.36 కోట్లు మాత్రమే మంజూరు కేవలం తాగునీటి ♦ అవసరాలకు మాత్రమే వినియోగించే అవకాశం సాక్షి కడప: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ పథకంలో స్థానం పొందిన నగరాలు, పట్టణాల రూపురేఖలు మారిపోతాయని అందరూ కలలు గన్నారు. అయితే అటు ప్రజా ప్రతినిధులు.. ఇటు అధికారుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లిందని చెప్పక తప్పదు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని ఆశిస్తే కొంతమేర మాత్రమే కేటాయించడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. కడప నగరం, ప్రొద్దుటూరు పట్టణంలో అభివృద్ధికి సుమారు రూ. 700 కోట్లకు పైగా అవసరమని ప్రతిపాదనలు పంపితే.. కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.36 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. కడపపై చంద్రబాబు సర్కారు వివక్ష చూపుతూ నిధుల కేటాయింపు విషయంలో ఓ వైపు అన్యాయం చేస్తుంటే.. మరో వైపు కేంద్రం కూడా జిల్లాలో అమృత్ పథకం కింద ఎంపికయిన కడప, ప్రొద్దుటూరుకు పూర్తి స్థాయి నిధులు కేటాయించక పోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. తాగునీటికి మాత్రమే పరిమితం కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద మంజూరు చేసిన నిధులతో కేవలం తాగునీటి అవసరాలను మాత్రమే తీర్చాలని కడప నగరపాలక సంస్థ భావిస్తోంది. పొడిచెత్తను కంపోస్టుగా తయారు చేయడం మెదలు.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ..తాగునీటి సమస్య పరిష్కరించేందుకు నగరపాలక అధికారులు ప్రణాళిక రూపొందించారు. అయితే కేంద్రం మాత్రం రూ.350 కోట్ల ప్రతిపాదనలకు కేవలం రూ.35 కోట్లు మాత్రమే విదిల్చింది. దీంతో ఈ నిధులను వేసవిలో తాగునీటి సమస్యను తీర్చేందుకు వినియోగింంచాలని యోచిస్తున్నారు. అలాగే ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి కూడా కేవలం రూ.50 లక్షలు మాత్రమే కేటాయించారు. ఈ నిధులు ఏ మూలకూ చాలవని తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.50 కోట్లు ఇస్తామని చెప్పి.. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాలను అమృత్ కింద ఎంపిక చేసిన అనంతరం ఒక్కో నగరం, పట్టణానికి సుమారు రూ.50 కోట్ల నిధులు ఇస్తామని ప్రచారం చేసింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదుకాని చాలా నగరాలు.. పట్టణాలకు తీవ్ర అన్యాయం చేశారు.. కనీసం రూ. కోటి కూడా కాకుండా ప్రొద్దుటూరుకు రూ.50 లక్షలు కేటాయించారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. కేంద్రం విదిల్చిన రూ.50 లక్షలతో ఏం అభివృద్ధి జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. మంజూరు చేసిన ఆ నిధులు కూడా ఈ వేసవిలో కేవలం తాగునీటికే వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం పేరుతో జిల్లాకు అన్యాయం చేసిందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. -
ప్రొటోకాల్ తేలేనా?
8న కృష్ణానది యాజమాన్య బోర్డు కీలక సమావేశం నీటి పంపిణీ, వినియోగంపై పునఃసమీక్ష కోరుతున్న తెలంగాణ బచావత్ ట్రిబ్యునల్ క్లాజ్-15పైనా స్పష్టత కోరే అవకాశం ఎజెండా అంశాలపై మొదలైన కసరత్తు హైదరాబాద్ కృష్ణా పరీవాహక ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నిర్వహణ, నీటి వినియోగంపై కసరత్తు మొదలైంది. రాష్ట్ర విభజన అనంతరం ఈ అంశాల్లో నెలకొన్న స్తబ్దతను నివారించే పనిని కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రారంభించింది. ఈ నెల 8న జరగనున్న కృష్ణా బోర్డు సమావేశంలో ఉమ్మడిగా ప్రాజెక్టుల నిర్వహణపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి కేటాయింపులు, వినియోగం, ఆపరేషన్ ప్రొటోకాల్‌లపై భిన్న వాదనలు వినిపిస్తున్న తెలంగాణ, ఏపీల మధ్య ఈ అంశాన్ని కొలిక్కి తేవడం అంత సులువు కాదన్నది నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా తయారుచేసిన నీటి ప్రొటోకాల్స్‌లో మార్పులు చేయాలని పట్టుబడుతున్న తెలంగాణ.. ఈ అంశాన్నే మొదట తేల్చాలని బలంగా కోరే అవకాశాలున్నాయి. ప్రాధాన్యతల మార్పులు కోరే అవకాశం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగంలో అనుసరించాల్సిన ప్రాధాన్యతల(ప్రొటోకాల్స్)ను పేర్కొంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన జీవో 69, 107లపైనా బోర్డు సమావేశంలో చర్చించే అవకాశముంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్వహణ, ప్రాధాన్యతలను మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఇప్పటికే పలుమార్లు బోర్డుకు స్పష్టం చేసింది. ముఖ్యంగా చెన్నై తాగునీటి అవసరాలకు 3.75 టీఎంసీల నీటి కేటాయింపునకు తొలి ప్రాధాన్యమిస్తూ.. తెలంగాణ నీటి అవసరాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వడంపై అభ్యంతరం చెబుతోంది. కేవలం తెలుగు గంగకు నీటిని తీసుకెళ్లేందుకే కుట్ర పూరితంగా చెన్నై అవసరాలకు ప్రోటోకాల్‌లో తొలి ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొంటోంది. ఇక విద్యుదుత్పత్తిలోనూ ఆంధ్రాకు అనుకూలంగానే ప్రోటోకాల్స్ ఉన్నాయని, ఎడమవైపున విద్యుదుత్పత్తి కేంద్రం ఉన్నా, దాని వినియోగంపై నియంత్రణ ఉందని తెలంగాణ అంటోంది. అలాగాకుండా స్వతంత్రంగా దానిని నడపుకొనేలా ప్రోటోకాల్ మార్చాలని వాదిస్తోంది. ఈ లెక్కన ప్రస్తుత ప్రోటోకాల్స్‌ను మార్చి తాజా మార్గదర్శకాలు రూపొందించడానికి.. సాగునీటి, ఇతర అవసరాలకు సంబంధించిన పూర్తి డేటాను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దానికితోడు జాగ్రత్తగా అధ్యయనం చేసి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఇదంతా పూర్తయి ఓ ఒప్పందానికి వస్తేనే ప్రోటోకాల్‌లో మార్పులు సాధ్యమవుతాయి. లేదంటే బోర్డు కొత్త మార్గదర్శకాలు తయారుచేసే వరకు.. ఇరు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ప్రస్తుత ప్రోటోకాల్స్‌నే పాటించాల్సి ఉంటుంది. అంత సులువేం కాదు.. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, సాగర్ నీటి వాడకంపై తెలంగాణ, ఏపీల మధ్య నలుగుతున్న వివాదాన్ని తేల్చడం అంత సులువేం కాదని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. బచావత్ ట్రిబ్యునల్ 15వ అధికరణం కింద ఒక రాష్ట్రం తన పరిధిలోని నీటిని తన సరిహద్దులలో నచ్చిన రీతిలో వాడుకోవడానికి హక్కు కల్పించిందన్న విషయాన్ని తెలంగాణ గతంలోనే తెరపైకి తెచ్చింది. ఈ మేరకే కృష్ణాలో గుండుగుత్తగా జరిపిన కేటాయింపుల్లో ఏపీకి 512.04 టీఎంసీలు (63.14శాతం), తెలంగాణకు 298.96 టీఎంసీల (36.86 శాతం) వాటాలున్నాయని చెబుతూ... సాగర్ ఎగువన వాడుకోలేకపోయిన నీటిని తెలంగాణ రాష్ట్రం సాగర్ నుంచి వాడుకుంది. దీనిపై ఏపీ అభ్యంతరం తెలిపింది. ఏ ప్రాజెక్టుకు కేటాయించిన నీటిని అక్కడే అదే సమయంలో వాడాలి తప్ప, మొత్తం కేటాయింపులను ఒకే దగ్గర వాడుకుంటామంటే కుదరదని వాదించింది. ఇలాంటి భిన్న వాదనల నేపథ్యంలో బోర్డు ఏం తేలుస్తుందన్నది కీలకంగా మారింది. -
జాగృతం కాకపోతే కోలారు ఎడారే
మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ చెరువుల ఆక్రమణలు, భూగర్భ జలాల వినియోగంపై పరిమితి లేకపోవడంతోనే అనర్థాలు కోలారు : నీటి వినియోగంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే భవిష్యత్తులో కోలారు జిల్లా ఎడారి కాక తప్పదని రాజస్తాన్‌కు చెందిన ప్రముఖ జలవనరుల నిపుణుడు, మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ హెచ్చరించారు. జల నిర్వహణపై కోలారులోని చన్నయ్య రంగమందిరంలో శుక్రవారం నిర్వహించిన ఒక రో జు వర్కషాప్లో ఆయన ప్రసంగించారు. నీటి వినియోగంలో కోలారు జిల్లాలోని రైతులు, ప్ర జలు తగిన జాగ్రత్తలు పాటించడం లేదని, ఇది దుష్పరిమాణాలకు దారితీస్తుందని అన్నారు. తాను ఈ జిల్లాలో పర్యటించిన సందర్భంగా మూడు అంశాలను ప్రధానంగా గుర్తించినట్లు తెలిపారు. అందులో నీటిని సక్రమంగా విని యోగం చేయకపోవడం, చెరువుల, రాజకాలువల ఆక్రమణలు, భూగర్భ జలాల వినియోగం పై పరిమితి లేకపోవడం అని స్పష్టం చేశారు. ఈ మూడు కారణాల వల్ల కోలారు జిల్లాలో తీవ్ర నీటి సమస్య ఏర్పడిందని అన్నారు. చెరువుల్లో ఆక్రమణలు తొలగించడం, మలినమైన నీటిని శుద్ధీకరించే వరకూ కోలారు జిల్లాలో భూగర్భ జలాలను రీఛార్జ చేయడం సాధ్యపడదని వివరించారు. కోలారు జిల్లాలోనే కాకుండా కర్ణాటక రాష్ర్టంలోనే నీటి వినియోగంపై రైతులు దృష్టి నిలపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్, లాభాలపై చూపుతున్న ఆసక్తి నీటిని పొదుపుగా వాడుకోవడంపై అన్నదాతలు కనబరచడం లేదని అన్నారు. రాజస్తాన్‌లో నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు పంటలు పండిస్తారని తెలిపారు. దీని వల్ల ఏనాడు నీటి సమస్య తలెత్తలేదని అన్నారు. నీటి మూలాలను అన్వేషించడంతో పాటు సద్వినియోగం చేసుకోవడం, వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంచవచ్చునని సూచిం చారు. రాజస్తాన్‌లో సగటు వర్షపాతం 300 మి.మీ ఉండగా, కోలారులో 500 మి.మీ ఉందని తెలిపా రు. అయితే రాజస్తాన్‌లో తీసుకున్న జాగ్రత్తల వల్ల అక్కడి పరిస్థితి మెరుగుపడిందని అన్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడం మొదలు ఆ నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. చెక్‌డ్యాంలు, ఇంకు డు గుంతలు (వాటర్ హార్వస్టింగ్) విధానాన్ని ప్రతి చోటా అమలు చేయాలని అన్నారు. ఉద్యాన పంట లకు బిందు సేద్యం తప్పనిసరిగా చేయాలన్నారు. రాజస్తాన్ తాను పడ్డ కృషి వల్ల దాదాపు ఏడు నదులను రీజనరేట్ చేసినట్లు గుర్తు చేశారు. ఇందులో ప్రభుత్వ, ప్రజా ప్రతినిధుల పాత్ర ఎంత మాత్రం లేదని, కేవలం ప్రజలు చేయడం వల్లనే సాధ్యమైం దని అన్నారు. కోలారులో కూడా ప్రజలు నీటి రక్ష ణ, మిత వాడకంపై దృష్టి సారించాలని అన్నారు. చెరువులు, రాజకాలువలలో ఆక్రమణల తొలగింపు ప్రభుత్వం బాధ్యత కాదని ప్రజలే ముందుండి ఆక్రమణలు తొలగిస్తే చెరువులకు నీరు చేరి భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. కలెక్టర్ త్రిలోక్‌చంద్ర, జెడ్పీ చైర్పర్సన్ రత్నమ్మ నంజేగౌడ, సీఈఓ పనాలీ, జెడ్పీ సభ్యులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
కాచి చల్లార్చిన నీటి వినియోగం తప్పనిసరి ఏడీఎంహెచ్ఓ డాక్టర్ లీలా ప్రసాద్ పాడేరు : ఏజెన్సీలోని గిరిజనులంతా సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఇన్చార్జి ఏడీఎంహెచ్ఓ డాక్టర్ లీలా ప్రసాద్ కోరారు. ఇటీవల అనారోగ్య మరణాలు నమోదైన లింగాపుట్టు గ్రామాన్ని శనివారం ఆయన సందర్శించి ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలోని 32 మంది గిరిజనులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో ఇద్దరు జ్వరపీడితులకు రక్తపరీక్షలు నిర్వహించి సాధారణ జ్వరాలుగా నిర్ధారించి మందులు పంపిణీ చేశారు. ఏడీఎంహెచ్ఓ లీలా ప్రసాద్‌తో పాడేరు క్లష్టర్ ఎస్పీహెచ్ఓ డాక్టర్ విశ్వేశ్వరనాయుడు కూడా ఇంటింటా తిరిగి గిరిజనుల ఆరోగ్యంపై సమీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ లీలాప్రసాద్ మాట్లాడుతూ ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా సకాలంలో వైద్యసేవలు పొందాలన్నారు. ఆశ కార్యకర్త వద్ద పుష్కలంగా మందులు ఉన్నాయన్నారు. నీటి కాలుష్యం కారణంతో డయేరియా, విషజ్వరాలు సోకుతాయని, అయితే గిరిజనులు తాము సేకరించిన నీటిని బాగా మరగబెట్టి చల్లారిన తరువాత సేవించడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. గెడ్డలు, వాగులు, ఊటలు నుంచి సేకరించిన నీటిని నేరుగా సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. వ్యాధులపై కూడా గిరిజనులు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులకు వైద్యసేవలు కూడా అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీహెచ్ కామేశ్వరి, పీహెచ్ఎన్ దేవి, హెల్త్ సూపర్వైజర్లు సుబ్రహ్మణ్యం, నాయుడు, ప్రకాష్ వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
నీళ్ల వాడకం గురించి అమెరికన్లకు తెలీదు!
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నీళ్లు దొరక్క నానా అగచాట్లు పడుతుంటే, అమెరికాలో మాత్రం అసలు నీళ్లు ఎలా ఆదా చేయాలో, దేనికి ఎంత నీళ్లు వాడాలో కూడా తెలియట్లేదు. ఇండియానా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అంశంపై జాతీయ స్థాయిలో ఆన్లైన్ సర్వే ఒకటి నిర్వహించారు. నీళ్లు ఆదా చేయడానికి తాము స్నానం చాలా తక్కువసేపు చేస్తామని 43% మంది చెప్పారు. కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు. టాయిలెట్లలో ఉపయోగించే ఫ్లష్ వల్లే ఎక్కువ నీళ్లు వృథా అవుతున్నా.. వాటిని మార్చే విషయం గురించి చాలా తక్కువమంది మాత్రమే ప్రస్తావించారట. ప్రధానంగా టాయిలెట్లను మార్చుకోవడం, రెట్రోఫిటింగ్ వాషింగ్ మెషీన్ల వాడకం లాంటి మార్గాల ద్వారానే నీళ్లు ఆదా చేయడానికి అవకాశం ఉంటుందని, జనం దీనిమీద దృష్టి పెట్టాలని ఇండియానా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ షాజీన్ అటారీ తెలిపారు. స్నానం చేయడానికంటే టాయిలెట్లలో వాడకానికి తక్కువ నీళ్లే పట్టినా, రోజుకు ఒకసారే స్నానం చేస్తే.. బాత్రూంకు మాత్రం ఎక్కువ సార్లు వెళ్లాల్సి ఉంటుందని, అందుకే ఎక్కువ నీళ్లు ఖర్చవుతాయని ఆమె చెప్పారు.