అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నీళ్లు దొరక్క నానా అగచాట్లు పడుతుంటే, అమెరికాలో మాత్రం అసలు నీళ్లు ఎలా ఆదా చేయాలో, దేనికి ఎంత నీళ్లు వాడాలో కూడా తెలియట్లేదు. ఇండియానా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ అంశంపై జాతీయ స్థాయిలో ఆన్లైన్ సర్వే ఒకటి నిర్వహించారు. నీళ్లు ఆదా చేయడానికి తాము స్నానం చాలా తక్కువసేపు చేస్తామని 43% మంది చెప్పారు. కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదు.
టాయిలెట్లలో ఉపయోగించే ఫ్లష్ వల్లే ఎక్కువ నీళ్లు వృథా అవుతున్నా.. వాటిని మార్చే విషయం గురించి చాలా తక్కువమంది మాత్రమే ప్రస్తావించారట. ప్రధానంగా టాయిలెట్లను మార్చుకోవడం, రెట్రోఫిటింగ్ వాషింగ్ మెషీన్ల వాడకం లాంటి మార్గాల ద్వారానే నీళ్లు ఆదా చేయడానికి అవకాశం ఉంటుందని, జనం దీనిమీద దృష్టి పెట్టాలని ఇండియానా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ షాజీన్ అటారీ తెలిపారు. స్నానం చేయడానికంటే టాయిలెట్లలో వాడకానికి తక్కువ నీళ్లే పట్టినా, రోజుకు ఒకసారే స్నానం చేస్తే.. బాత్రూంకు మాత్రం ఎక్కువ సార్లు వెళ్లాల్సి ఉంటుందని, అందుకే ఎక్కువ నీళ్లు ఖర్చవుతాయని ఆమె చెప్పారు.
నీళ్ల వాడకం గురించి అమెరికన్లకు తెలీదు!
Published Tue, Mar 4 2014 1:54 PM | Last Updated on Thu, Apr 4 2019 3:48 PM
Advertisement