రోజుకు 8 గ్లాసుల నీళ్లు.. అవసరమేనా? | will drinking eight glasses of water a day harm you? | Sakshi
Sakshi News home page

రోజుకు 8 గ్లాసుల నీళ్లు.. అవసరమేనా?

Published Sat, Oct 8 2016 1:40 PM | Last Updated on Thu, Jul 11 2019 6:22 PM

రోజుకు 8 గ్లాసుల నీళ్లు.. అవసరమేనా? - Sakshi

రోజుకు 8 గ్లాసుల నీళ్లు.. అవసరమేనా?

రోజుకు ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది చెబుతారు. కానీ, నీళ్లు మరీ ఎక్కువ తాగినా కూడా ప్రమాదమేనని తాజాగా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మనిషి శరీరంలో అసలు ఎన్ని నీళ్లు కావాలో నిర్ణయించుకునే వ్యవస్థ ఉంటుందని, ఎక్కువ నీళ్లు తాగకుండా అదే ఆపుతుందని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు. అయినా పట్టించుకోకుండా ఎక్కువ నీళ్లు తాగితే 'హైపోనెట్రేమియా' అనే సమస్య వస్తుందని చెబుతున్నారు. దానివల్ల రక్తంలోని సోడియం గణనీయంగా పడిపోతుందని హెచ్చరించారు. దానివల్ల వాంతులు, వికారంతో మొదలుపెట్టి ఒక్కోసారి ఏకంగా మనిషి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉందన్నారు. నీళ్లు మరీ ఎక్కువ తాగినపుడు మనిషి మెదడు కూడా స్పందించి ఆ విషయాన్ని తెలియజేస్తుందట.

మన శరీరానికి ఎంత కావాలో అంతే నీళ్లు తాగితే పర్వాలేదని, కేవలం దాహం వేసినప్పుడే తాగాలి తప్ప.. కావాలని నీళ్లు ఎక్కువగా తాగకూడదని పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ మైఖేల్‌ ఫారెల్ తెలిపారు. ఇందుకోసం కొంతమందిని తీసుకున్న ఈ బృందం వారిలో సగం మందిని సరిగ్గా దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలని చెప్పి, మిగిలిన సగం మందిని మాత్రం ఎక్కువ నీళ్లు తాగమని చెప్పారు. వాళ్లక ఎంఆర్ఐ తీసి చూడగా.. నీళ్లు ఎక్కువ తాగేవాళ్ల మెదడులోని ప్రీ ఫ్రంటల్ ప్రాంతాలు బాగా చురుగ్గా ఉన్నాయట. వాళ్లు ఏదైనా తినాలంటే నమలడానికి ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందట. ఈ పరిశోధన ఫలితాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌ వాళ్లు ఆన్‌లైన్‌లో ప్రచురించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement