హిందూపురం రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పశువధ నిషేధిత చట్టంలో మార్పులు చేసి రైతులను ఆదుకోవాలని ఏపీరైతు సంఘం రాష్ట్ర నాయకులు వెంకట్రావిురెడ్డి, సిద్దారెడ్డి, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు కోరారు. సోమవారం తహసీల్దార్ విశ్వనాథ్‌కు వారు వినతిపత్రం అందజేశారు.
‘పశువధ చట్టంలో మార్పులు చేయాలి’
Published Mon, Jun 19 2017 11:37 PM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM
హిందూపురం రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పశువధ నిషేధిత చట్టంలో మార్పులు చేసి రైతులను ఆదుకోవాలని ఏపీరైతు సంఘం రాష్ట్ర నాయకులు వెంకట్రావిురెడ్డి, సిద్దారెడ్డి, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు కోరారు. సోమవారం తహసీల్దార్ విశ్వనాథ్‌కు వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ పశువులను సంరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వం పశువధ నిషేధ చట్టం తీసుకురావడం మంచిదే అన్నారు. అయితే ప్రస్తుతం పశు సంరక్షణ రైతుల పాలిట భారంగా మారిం దన్నారు. ప్రభుత్వం చట్టాలు చేసి చేతులు దు లుపుకోవడం సమర్ధమైనదికాదన్నారు. రైతుకు భారమైన ఆవులను, పశువులను సంతకు తో లుకువెళ్లి రైతుకే అమ్మాలంటే కొనలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం స్పందించి చట్టంలో మార్పులు చేసి రైతులను ఆదుకోవాలన్నా రు. రైతు సంఘం సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement