
సదాశివనగర్(ఎల్లారెడ్డి): భారత ఎన్నికల సంఘం కాలక్రమేణ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ. ఎన్నికలకు సంబంధించినంత వరకు సర్వ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది. దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే సమయంలో సుమారు 50 లక్షల మంది ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటోందని ఓ అంచనా. దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘చిని’లో నిర్వహించారు. మొదటి భారత ఎన్నికల కమిషనర్‌గా సుకుమార్‌సేన్ సేవలందించారు.
తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 17.30 కోట్లు అని నివేదికలు తెలుపుతున్నాయి. 1993లో జరిగిన 13వ సాధారణ ఎన్నికల్లో మొదటి సారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించారు. ఓటు హక్కుకు కనీస వయస్సు 21ఏళ్లు కాగా, 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18ఏళ్లకు కుదిస్తూ మార్పులు చేశారు. ఎన్నికల నిర్వహణలో సమూల సంస్కరణలు ప్రవేశపెట్టిన సమర్థుడిగా పదో ఎన్నికల సంఘం కమిషనర్‌గా టీఎన్ శేషన్ గుర్తింపు పొందారు. 1952లో 55 పార్టీలు ఎన్నికల్లో పాల్గొనగా, 2014 నా టికి ఆ సంఖ్య 370కి చేరింది. దేశంలో ఎంపీలుగా గెలిచిన వారిలో 30 శా తం మందిపై కేసులు నమోదయ్యాయని బీబీసీ నివేదిక పేర్కొంది.