జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పారిశుద్ధ్య విభాగంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకూ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్న ఏఎమ్‌హెచ్‌వో ల స్థానంలో ఎన్విరాన్‌మెట్ ఇంజినీర్లను నియమించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. అలాగే బల్దియాలో సర్కిళ్ల సంఖ్యను 24 నుంచి 30కి పెంచుతూ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన అనుమతులు రాగానే అమలు చేయనున్నట్లు తెలిపారు.