
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై భారాన్ని తగ్గించేందుకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రేట్లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా అన్నారు. దేశంలో జీఎస్టీ వ్యవస్థ సర్దుబాటు కావటానికి దాదాపు ఏడాది సమయం పట్టొచ్చన్నారు. ఒకే తరహాకు చెందిన కొన్ని రకాల వస్తువులు వేర్వేరు పన్ను శ్లాబుల్లో ఉన్నాయనీ, వీటన్నింటిపై ఒకే పన్ను రేటును నిర్ణయించడంతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై అధిక భారం పడకుండా చూస్తూ, సామాన్యులకు లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. 23వ జీఎస్టీ మండలి సమావేశం నవంబర్‌లో గువాహటిలో జరగనుంది.