
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్పమార్పులు చోటు చేసుకున్నాయి. డీసెట్ పరీక్షల నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 17, 18 తేదీల్లో జరగాల్సిన జనరల్, ఒకేషనల్ పరీక్షలు వాయిదా వేసినట్టు తెలిపారు.
ఆ పరీక్షలను 23, 24 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. అదే విధంగా 30 న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 31న ఎన్విరాన్ మెంటల్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇక 23 నుంచి 27 వరకు జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 25 నుంచి 29కి వాయిదా వేసినట్టు గంటా తెలిపారు. విద్యార్ధులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జరిగిన మార్పులను గమనించాలని మంత్రి అన్నారు.