Inter supplementary exams
-
నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇంటర్మిడియెట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను మంగళవారం విడుదల చేయనున్నారు. తొలుత ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు. మే 24 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరయ్యారు.సప్లి ఫలితాల కోసం క్లిక్ చేయండివోకేషనల్ సప్లి రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండిఇంటర్మిడియెట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసింది. ఈ నెల 26న ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. -
AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే
సాక్షి, విజయవాడ: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీని విద్యాశాఖ గురువారంఅధికారికంగా ప్రకటించింది. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. మద్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ ఫీజు చెల్లించడానికి మే 3వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఏపీ ఇంటర్ స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పరీక్షా తేదీల వివరాలు.. ►మే 24న సెకండ్ లాంగ్వేజ్ ►25 న ఇంగ్లీష్ ►26 న మ్యాథ్స్-ఏ, బోటనీ, సివిక్స్ ►27న మ్యాథ్స్-బీ, జువాలజీ, హిస్టరీ ►29న ఫిజిక్స్, ఎకనామిక్స్ ►30న కెమిస్ట్రీ, కామర్స్, సోషయాలిజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ ►31న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్, బైపీసీ విద్యార్ధులకు మ్యాథ్స్,లాజిక్ పేపర్ ►జూన్ 1న మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి. చదవండి: మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ.. మంత్రి బొత్స ఏమన్నారంటే? -
ఇంటర్ సప్లిమెంటరీ.. మహేశ్ ఒక్కడు పరీక్ష రాస్తే.. 8 మంది పర్యవేక్షణ
వెల్దుర్తి (తూప్రాన్): ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రానికి ఒక్క విద్యార్థి హాజరైతే ఎనిమిది మంది సిబ్బంది పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ శ్రీ రాయరావు సరస్వతీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించారు. ద్వితీయ సంవత్సరం సివిక్స్ పరీక్షకు వర్షపల్లి మహేశ్ అనే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు. మొత్తం ముగ్గురు విద్యార్థులు ఫెయిల్ కాగా.. ఒక్క విద్యార్థి ఫీజు చెల్లించి పరీక్ష రాశాడు. పర్యవేక్షణకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఎగ్జామినేషన్ ఇన్చార్జి, ఇన్విజిలేటర్, సహాయ ఇన్విజిలేటర్, జూనియర్ అసిస్టెంట్, ఏఎన్‌ఎంతోపాటు కాపలాగా ఒక కానిస్టేబుల్ విధులు నిర్వర్తించారు. పరీక్ష ముగిసిన అనంతరం పరీక్ష పత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
అంతా పాస్
-
ఫెయిలైన విద్యార్థులంతా పాస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యారు. మార్చిలో జరిగిన వార్షిక పరీ క్షల్లో ఫెయిలైన 1,61,710 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులం దరినీ పాస్‌చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిం చాల్సి ఉన్నా, కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా వాటిని రద్దుచేస్తూ సీఎం ఈ నిర్ణయం తీసు కున్నారని వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తీర్ణులైన ఈ విద్యార్థులంతా కంపార్ట్ మెంటల్‌లో పాసైనట్లుగా మార్కుల మెమోల్లో పేర్కొంటామని తెలిపారు. విద్యార్థులు తమ మార్కుల మెమోలను ఈ నెల 31 తర్వాత సంబం ధిత కాలేజీల్లో పొంద వచ్చన్నారు. వార్షిక పరీక్షల్లో పాసై, తమకు తక్కువ మార్కులు వచ్చాయని, తాము బాగా రాసినా ఎందుకు ఫెయిలయ్యామని తెలుసు కునేందుకు మార్కుల రీ కౌంటింగ్, రీ వెరిఫికే షన్ కమ్ ఫొటో కాపీ కోసం దరఖాస్తు చేసు కున్న విద్యార్థుల ఫలితాలను పది రోజుల్లో వెల్ల డిస్తామని మంత్రి వివరించారు. కాగా, ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షల్లో ఫెయిలై, ప్రభుత్వ తాజా నిర్ణయంతో పాసైన విద్యార్థు లకు సంబంధించి ప్రథమ సంవత్సర బ్యాక్ లాగ్స్ ఏమైనా ఉన్నా.. వాటిలోనూ పాస్ చేస్తామని అధికారులు తెలిపారు. ఫస్టియర్ విద్యార్థుల పరిస్థితేంటి? ద్వితీయ సంవత్సర విద్యార్థులను పాస్‌చేసిన ప్రభుత్వం వార్షిక పరీక్షల్లోనే ఫెయిలైన 1,67,630 మంది ప్రథమ సంవత్సర విద్యార్థుల విషయమై ఎలాంటి ప్రకటన చేయలేదు. ద్వితీయ సంవత్సర విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశంతో అందరినీ పాస్ చేసింది. అయితే ప్రథమ సంవత్సర విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారా? లేదా? అనేది స్పష్టం చేయలేదు. కరోనా అదుపులోకి వచ్చాక పరీక్ష పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. లేదంటే వచ్చే ఏడాది వార్షిక పరీక్షలతో ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన పరీక్షలను కూడా రాసుకోవాల్సి వస్తుంది. అప్పుడు పరీక్షలు రాయాలంటే ప్రథమ సంవత్సరంలో ఫెయిలైన పరీక్షలతోపాటు ద్వితీయ సంవత్సర పరీక్షలకు ఒకేసారి సిద్ధం కావాల్సి ఉంటుంది. దాంతో విద్యార్థులపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అందుకే కరోనా అదుపులోకి వచ్చాక వారికి పరీక్షలను నిర్వహించేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. లేదంటే వారిని పాస్‌చేసే అంశంపైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఓ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతానికి ముందుగా ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఎంసెట్, ఇతర సెట్స్ రాసుకునేలా, డిగ్రీలో ప్రవేశాలు పొందేలా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. లేకపోతే వారు విద్యా సంవత్సరం నష్టపోతారని, అందుకే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ తేదీల్లో మార్పు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు మరోసారి మారనున్నాయి. ఇప్పటికే పరీక్ష తేదీలను మార్పు చేసిన ఇంటర్ బోర్డు మరోసారి మార్పు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మొదట్లో మే 15 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలు జారీ చేసిన బోర్డు.. ఫలితాల్లో పొరపాట్ల కారణంగా ఈ నెల 25 నుంచి పరీక్షలు నిర్వహించేలా షెడ్యూ లు జారీ చేసింది. అయితే ఈ నెల 26న బిట్సాట్ పరీక్ష ఉండటం, 27న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు ఉండటంతో తల్లిదండ్రుల నుంచి పరీక్ష తేదీలు మార్పు చేయాలని విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో మళ్లీ పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తామని బోర్డు ప్రకటించింది. త్వరలోనే మార్పు చేసిన తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. మరోవైపు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 2తో ముగియనుండగా, దానిని ఈ నెల 4 వరకు పొడిగించింది. -
మే 25నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 16వ తేదీ నుంచి జరగాల్సి ఉండగా, ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 1వ తేదీవరకూ, జూన్ 7 నుంచి 10వ తేదీ వరకూ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. -
ఇంటర్ సప్లిమెంటరీలో స్వల్పమార్పులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల షెడ్యూల్లో స్వల్పమార్పులు చోటు చేసుకున్నాయి. డీసెట్ పరీక్షల నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేసినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 17, 18 తేదీల్లో జరగాల్సిన జనరల్, ఒకేషనల్ పరీక్షలు వాయిదా వేసినట్టు తెలిపారు. ఆ పరీక్షలను 23, 24 తేదీల్లో నిర్వహిస్తామన్నారు. అదే విధంగా 30 న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 31న ఎన్విరాన్ మెంటల్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇక 23 నుంచి 27 వరకు జరగాల్సిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 25 నుంచి 29కి వాయిదా వేసినట్టు గంటా తెలిపారు. విద్యార్ధులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జరిగిన మార్పులను గమనించాలని మంత్రి అన్నారు. -
ఇంటర్‌విద్యార్థులకు అందని హాల్‌టికెట్లు
-
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ :ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 59 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉదయం 9 నుంచి 12 గంటలకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫస్టియర్ విద్యార్థులు సెట్-3 ప్రశాశ్నపత్రంతో తెలుగు, సంస్కృతం, హిందీ, ఒడియా పేపర్లకు పరీక్ష రాయగా, రెండో ఏడాది విద్యార్థులు సెట్-1 ప్రశ్నపత్రంతో పరీక్ష రాశారు. తొలిరోజు ఎలాంటి మాల్‌ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదు. 370 మంది డుమ్మా ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీకి హాజరయ్యేందుకు ఫీజులు చెల్లించినప్పటికీ చాలామంది పరీక్షకు గైర్హాజరయ్యారు. తొలిరోజు 370 మంది డుమ్మా కొట్టారు. ప్రథమ సంవత్సరం 4,902 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4,617 మంది పరీక్ష రాశారు. 285 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్స రం 608 మంది ఫీజు చెల్లించగా 85 మంది డుమ్మా కొట్టారు. కాగా ఆర్ఐవో ఎ.అన్నమ్మ పట్టణంలోని శాంతి నికేతన్, చైతన్య సహకార, శ్రీచైతన్య జూనియర్ కళాశాలల కేంద్రాలను తనిఖీచేయగా, డీఈసీ కమిటీ సభ్యులు ఆమదాలవలసలోని పలు కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫ్లయింగ్, సిట్టింగ్ బృందాలు వేర్వేరుగా పలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఉక్కపోతతో తడిసిముద్దయ్యారు మండే ఎండలతోపాటు ఉక్కపోతతో విద్యార్థులు తడిసిముద్దయ్యారు. సుదూర ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఆపసోపాలు పడ్డారు. ఆయా రూట్లలో నడపాల్సిన బస్సులు సమయపాలన పాటించకపోవడంలో మరిన్ని కష్టాలను ఎదుర్కొన్నారు. కొన్ని రూట్లలో అసలు బస్సులే నడపలేదని విద్యార్థులు వాపోయారు. దీనికితోడు పరీక్ష కేంద్రాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో విద్యార్థులకు తిప్పలు తప్పలేదు. మంగళవారం ఇంగ్లిషు పరీక్ష జరగనుంది. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : ఈ నెల 25 నుంచి జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇంటర్ పరీక్షల ప్రాంతీయ అధికారి బి.వెంకటేశ్వరరావు చెప్పారు. స్థానిక సెయింట్ థెరిస్సా జూనియర్ కళాశాలలో శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, కస్టోడియన్స్, అదనపు చీఫ్ సూపరింటెండెంట్లతో పరీక్షల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. 25 నుంచి జూన్ 1వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరుగుతాయన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 22,673 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,293 మంది హాజరుకానున్నారని తెలిపారు. విద్యార్థులను 40 నిమిషాలు ముందుగానే పరీక్ష హాలులోకి అనుమతించాలని వెంకటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు విజయరావు, రామలక్ష్మి, షా బాబా, హై పవర్ కమిటీ సభ్యులు ప్రభాకరరావు, బిల్లీ గ్రహం పాల్గొన్నారు.