
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు మరోసారి మారనున్నాయి. ఇప్పటికే పరీక్ష తేదీలను మార్పు చేసిన ఇంటర్ బోర్డు మరోసారి మార్పు చేసేందుకు కసరత్తు చేస్తోంది. మొదట్లో మే 15 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూలు జారీ చేసిన బోర్డు.. ఫలితాల్లో పొరపాట్ల కారణంగా ఈ నెల 25 నుంచి పరీక్షలు నిర్వహించేలా షెడ్యూ లు జారీ చేసింది.
అయితే ఈ నెల 26న బిట్‌సాట్ పరీక్ష ఉండటం, 27న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలు ఉండటంతో తల్లిదండ్రుల నుంచి పరీక్ష తేదీలు మార్పు చేయాలని విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో మళ్లీ పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తామని బోర్డు ప్రకటించింది. త్వరలోనే మార్పు చేసిన తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. మరోవైపు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 2తో ముగియనుండగా, దానిని ఈ నెల 4 వరకు పొడిగించింది.
Comments
Please login to add a commentAdd a comment