AP Inter Supplementary Exam Time Table 2023 Released, Check Dates Here - Sakshi
Sakshi News home page

AP: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ ఇదే

Published Thu, Apr 27 2023 7:34 PM | Last Updated on Fri, Apr 28 2023 11:45 AM

AP Inter Supplementary Exam Dates Announced Here Is schedule - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీని విద్యాశాఖ గురువారంఅధికారికంగా ప్రకటించింది. మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ పరీక్షలు జరగనున్నాయి. మద్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు‌ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ ఫీజు చెల్లించడానికి మే 3వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఏపీ ఇంటర్‌ స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్స్, ప్రివియస్‌ పేపర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పరీక్షా తేదీల వివరాలు..
►మే 24న సెకండ్ లాంగ్వేజ్
►25 న ఇంగ్లీష్
►26 న మ్యాథ్స్‌-ఏ, బోటనీ, సివిక్స్
►27న మ్యాథ్స్‌-బీ, జువాలజీ, హిస్టరీ
►29న ఫిజిక్స్, ఎకనామిక్స్
►30న‌ కెమిస్ట్రీ, కామర్స్, సోషయాలిజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్
►31న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్, బైపీసీ విద్యార్ధులకు మ్యాథ్స్‌,లాజిక్ పేపర్
►జూన్ 1న మోడర్న్ లాంగ్వేజ్, జాగ్రఫీ పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి.
చదవండి: మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల భేటీ.. మంత్రి బొత్స ఏమన్నారంటే?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement