
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 16వ తేదీ నుంచి జరగాల్సి ఉండగా, ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 1వ తేదీవరకూ, జూన్ 7 నుంచి 10వ తేదీ వరకూ ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది.