
photo courtesy:ipl
ధోని పని అయిపోయింది అంతా భావిస్తున్న వేళ దనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఐపీఎల్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోని తర్వాతి మ్యాచ్‌లోనే తన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. 2 పరుగులు చేయడానికి 10 బంతులు తీసుకున్న ధోని.. తర్వాతి 48 పరుగులను 24 బంతుల్లోనే సాధించాడు. ఓవరాల్‌గా ధోని 38 బంతుల్లో 7 ఫోర్లు , ఒక సిక్స్ సాయంతో 50 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో ధోనికి ఇది 24వ హాఫ్ సెంచరీ. కాగా ధోని మూడేళ్ల తర్వాత ఫిప్టీ మార్క్ అందుకోవడం విశేషం. అంతకముందు 2019లో బెంగళూరు ఆర్‌సీబీపై 48 బంతుల్లో 84 పరుగులు సాధించాడు. ఇక కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది.
చదవండి: IPL 2022: వారెవ్వా షెల్డన్ జాక్సన్.. ఏమా మెరుపు వేగం