
T20 World Cup 2022: టీ20 వరల్డ్‌కప్-2022 సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్థ శతకంతో అలరించాడు. క్రీజులోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఉతుకుడే లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్ ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన కేఎల్ రాహుల్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
టీమిండియా స్కోరు 59 పరుగులు ఉంటే.. అందులో రాహుల్‌వే 50 పరుగులున్నాయి. దీన్నిబట్టే కేఎల్ రాహుల్ విధ్వంసం ఏ రేంజ్‌లో కొనసాగిందనేది అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ రోహిత్ కూడా రాహుల్‌కే స్ట్రైక్ ఇచ్చేందుకు ఆసక్తి చూపాడు. ఒక రకంగా చెప్పాలంటే కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌ను రోహిత్ ఎంజాయ్ చేశాడనే చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment