
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఫీట్ సాధించాడు. ఓపెనర్‌గా 50 ప్లస్ స్కోర్లు ఎక్కువసార్లు నమోదు చేసిన మూడో ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. రాహుల్ ఓపెనర్‌గా 34సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. ఈ క్రమంలో గౌతమ్ గంభీర్(34 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు) రికార్డును బ్రేక్ చేసి మూడో స్థానంలోకి వచ్చాడు. కాగా గంభీర్ ప్రస్తుతం లక్నో సూపర్‌జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక తొలి స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 57 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించాడు. వార్నర్ తర్వాత శిఖర్ ధావన్ 48 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment