Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున మరో ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడో స్థానంలో వచ్చి అద్భతుమైన ఫిఫ్టీతో అలరించాడు అమన్ హకీమ్ ఖాన్. 76 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను తన ఇన్నింగ్స్‌తో నిలబెట్టాడు.
రిపల్ పటేల్‌లో కలిసి ఏడో వికెట్‌కు 53 పరుగులు జోడించాడు. కాగా బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై 43 బంతుల్లో అర్థసెంచరీ సాధించిన అమన్ హకీమ్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్‌లో ఏడు.. అంతకంటే ఎక్కువ స్థానంలో బ్యాటింగ్ వచ్చి ఫిఫ్టీ మార్క్ అందుకున్న మూడో బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకముందు అక్షర్ పటేల్ (54 పరుగులు వర్సెస్ ముంబై ఇండియన్స్, 2023), క్రిస్ మోరిస్(52 పరుగులు వర్సెస్ ముంబై ఇండియన్స్, 2017), అమన్ హకీమ్ ఖాన్(51 పరుగులు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఉన్నారు.
ఎవరీ అమన్ హకీమ్ ఖాన్ ?
ముంబైకి చెందిన అమన్ హకీమ్ ఖాన్ 2020-21 విజయ్ హజారే ట్రోఫీ ద్వారా 2021లో మార్చి 9న లిస్ట్ -ఏ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత 2021-22 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా టి20 క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 2022 నవంబర్‌లో శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ అమన్ హకీమ్ ఖాన్‌ను ట్రేడింగ్ చేసుకుంది.
Stood up when the chips were down - well batted, Aman Khan 👏🫡#GTvDC #IPLonJioCinema #TATAIPL | @delhicapitals pic.twitter.com/FofyAPkqVk
— JioCinema (@JioCinema) May 2, 2023
చదవండి: రీఎంట్రీ అదుర్స్.. వంద వికెట్ల క్లబ్‌లో మోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment