రాణించిన భాను, యతిన్ | Bhanu successful, yatin | Sakshi
Sakshi News home page

రాణించిన భాను, యతిన్

Published Sun, Oct 13 2013 11:45 PM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM

భాను (84 నాటౌట్), యతిన్ (58 నాటౌట్) అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఎఫ్‌సీఏ అండర్-12 టోర్నీలో ఖాజా సీఏ జట్టు చక్కని విజయాన్ని నమోదు చేసింది.

 సాక్షి, హైదరాబాద్: భాను (84 నాటౌట్), యతిన్ (58 నాటౌట్) అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఎఫ్‌సీఏ అండర్-12 టోర్నీలో ఖాజా సీఏ జట్టు చక్కని విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 131 పరుగుల తేడాతో డానియెల్ క్రికెట్ అకాడమీ (రెడ్) టీమ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఖాజా సీఏ 25 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 226 పరుగులు చేసింది.
 
 తర్వాత బ్యాటింగ్‌కు దిగిన డానియెల్ సీఏ (రెడ్) 25 ఓవర్లలో 7 వికెట్లకు 95 పరుగులు చేసి ఓటమిపాలైంది. సాగర్ 3, నవనీత్ 2 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. మరో మ్యాచ్‌లో బ్రదర్స్ క్రికెట్ అకాడమీ (రెడ్) బౌలర్లు జయంత్ (5/5), కృష్ణ ప్రసాద్ (4/5) దుమ్మురేపారు. దీంతో ఆ జట్టు 10 వికెట్ల తేడాతో వీపీఆర్‌సీసీ టీమ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన వీపీఆర్‌సీసీ 18 పరుగులకే ఆలౌటైంది.
 
  తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బ్రదర్స్ సీఏ 2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. చార్మినార్ సీఏ, సెయింట్ పీటర్స్, అర్షద్ అయూబ్ సీఏ (బ్లూ), బ్రదర్స్ సీఏ (రెడ్) జట్లు ఆయా గ్రూప్‌ల్లో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. నేడు జరిగే సెమీస్ మ్యాచ్‌ల్లో చార్మినార్ సీఏ... అర్షద్ అయూబ్ సీఏ (బ్లూ)తో; సెయింట్ పీటర్స్... బ్రదర్స్ సీఏ (రెడ్)తో తలపడతాయి.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 వాండరర్స్ సీఏ: 94 ఆలౌట్ (రూపేశ్ 3/6, సోనిత్ 2/17); ఎస్‌కేఎన్ సీఏ: 95/1.
  సెయింట్ పీటర్స్: 194/5 (హర్షవర్ధన్ 106, గణేశ్ 31); ఏఏసీఏ (రెడ్): 94 ఆలౌట్ (షాబాజ్ 2/15, హర్ష 2/20).
 
 బ్రదర్స్ సీఏ (బ్లూ): 56 ఆలౌట్ (త్రిశాంక్ 3/8, సర్వేష్ 2/12); అర్షద్ అయూబ్ సీఏ (బ్లూ): 56/2 (త్రిశాంక్ 28 నాటౌట్).
 
 బ్రదర్స్ సీఏ (రెడ్): 157/1 (తిలక్ 89 నాటౌట్; బాలాజీ 35 నాటౌట్); జాన్సన్ గ్రామర్ స్కూల్: 82/8.
 
 హెచ్‌ఎంవీ సీఏ (రెడ్) 124 ఆలౌట్ (సహస్ర 40, జునైద్ 3/24, సాదిఖ్ 2/19); చార్మినార్ సీఏ: 125/5 (అకీబ్ 35, సచిన్ 31, కౌశిక్ 2/17).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement