
Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022లో ఎస్‌ఆర్‌హెచ్ వైస్‌కెప్టెన్ అభిషేక్ శర్మ తొలిసారి మెరిశాడు. 2018లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన అభిషేక్ 25 మ్యాచ్‌ల తర్వాత కెరీర్‌లో మెయిడెన్ అర్థసెంచరీ సాధించాడు. సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 32 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఫిప్టీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్‌గా 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఈ నేపథ్యంలోనే అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఉన్న అత్యధిక స్కోరును అధిగమించాడు. 2018లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్‌కు అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ తొలి మ్యాచ్‌లోనే 19 బంతుల్లో 46 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. విచిత్రమేంటంటే.. తొలి మ్యాచ్ మినహా మళ్లీ అభిషేక్ రాణించింది లేదు. ఆ తర్వాత ఆడిన 24 మ్యాచ్‌ల్లో 30 నుంచి 40లోపే ఎక్కువసార్లు ఔటయ్యాడు.
ఇక మెగావేలంలో అభిషేక్ శర్మను ఎస్‌ఆర్‌హెచ్ రూ. 6.5 కోట్లు పెట్టి దక్కించుకుంది. అయితే సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ అభిషేక్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. కోట్లు పెట్టి కొన్నందుకు ఇంత దరిద్రంగా ఆడతారా అంటూ అతనిపై విమర్శలు వచ్చాయి. అయితే అభిషేక్ శర్మ మాత్రం ఇది పట్టించుకోకుండా తన ఆటను కొనసాగించాడు. సీఎస్‌కేతో మ్యాచ్ ద్వారా ఎట్టకేలకు తొలిసారి తన ఆటేంటో చూపించాడు. కాగా తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.
చదవండి: IPL 2022: నటరాజన్ సూపర్ డెలివరీ.. గైక్వాడ్‌కు ఫ్యూజ్‌లు ఔట్.. వీడియో వైరల్!
Ravi Shastri: 'తమాషానా.. అలాంటి క్రికెటర్‌పై జీవితకాల నిషేధం విధించాలి'
Comments
Please login to add a commentAdd a comment