
ఐపీఎల్‌లో ఎవరికి అర్థం కాని జట్టు ఏదైనా ఉందంటే అది సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది అంతుచిక్కదు. డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తప్పించడం నుంచి మొదలుపెడితే.. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగావేలం వరకు అదే తంతు ఎస్‌ఆర్‌హెచ్‌లో కనబడింది. వేలంలోనూ పెద్దగా పేరున్న ఆటగాళ్లను కొనుగోలు చేయని ఎస్‌ఆర్‌హెచ్.. ఫామ్‌లో లేని పూరన్‌కు రూ. 10 కోట్లకు పైగా చెల్లించడం.. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ అభిషేక్ శర్మకు రూ. 6.5 కోట్లు చెల్లించడమేంటని నోరెళ్లబెట్టారు. ఒక సుందర్ మినహా పెద్దగా చెప్పుకునే ఆటగాళ్లు ఆ జట్టులో లేకపోవడంతో సర్వత్రా విమర్శలపాలయ్యింది.
చదవండి: IPL 2022: కేన్ మామ 'బకరా' అయ్యే అవకాశాలు ఎక్కువ..
తాజాగా వైస్‌కెప్టెన్సీ విషయంలోనూ ఎస్‌ఆర్‌హెచ్ వింత వైఖరిని ప్రదర్శిస్తోంది. కోట్లు పెట్టి కొన్న పూరన్‌ను కాదని ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మను వైఎస్ కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఒక అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌కు అన్ని కోట్లు పెట్టడమే దండగ అనుకుంటే.. పైనుంచి మళ్లీ వైస్ కెప్టెన్సీ పదవి ఎందుకంటూ ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ గరం అవుతున్నారు. ఐపీఎల్‌లోనూ అభిషేక్ శర్మ పెద్దగా రాణించింది లేదు. ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో 241 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్‌లోనూ 14 ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీశాడు.
ఇంకో విచిత్రమేమిటంటే.. వేలంలో అభిషేక్ శర్మ కోసం రూ. 10 కోట్లు పెట్టడానికైనా ఎస్‌ఆర్‌హెచ్ సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. అతని బేస్‌ప్రైస్ రూ.20 లక్షలు మాత్రమే. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ అతని కోసం పోటీ పడకుంటే భారీ ధర దక్కే అవకాశం ఉండేది కాదు. 2018 అండర్-19 ప్రపంచకప్ సాధించిన యంగ్ టీమిండియాలో అభిషేక్ శర్మ సభ్యుడిగా ఉన్నాడు. శుబ్‌మన్ గిల్, పృథ్వీ షాలు మంచి పేరు సంపాదించగా..అభిషేక్ మాత్రం ఆ తర్వాత నిలకడ చూపించలేకపోయాడు.
చదవండి: IPL 2022 Auction: ‘మాకు అనామకులే కావాలి’.. సన్‌రైజర్స్ తీరే వేరు
IPL 2022 SRH- Simon Katich: మొన్ననే సంతోషంగా ఉందన్నాడు.. ఇంతలోనే ఏమైందో! కారణం ఆమేనా?