కళ్లుచెదిరే బ్యాటింగ్‌.. భారీ స్కోరు | Smriti Mandhana Fastest Fifty | Sakshi
Sakshi News home page

మంధాన మెరుపు బ్యాటింగ్‌

Published Sun, Mar 25 2018 11:40 AM | Last Updated on Sun, Mar 25 2018 12:25 PM

Smriti Mandhana Fastest Fifty - Sakshi

స్మృతి మంధాన

సాక్షి, ముంబై: భారత మహిళా క్రికెటర్‌ స్మృతి మంధాన మరోసారి బ్యాట్‌తో విరుచుకుపడింది. మహిళల ముక్కోణపు టి20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్ధసెంచరీతో అదరగొట్టింది. వేగవంతమైన హాఫ్‌సెంచరీతో రికార్డు సాధించింది. 25 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధసెంచరీ పూర్తి చేసింది. భారత్‌ తరపున వేగవంతమైన హాఫ్‌సెంచరీ చేసిన బ్యాట్స్‌వుమన్‌గా ఘనతకెక్కింది.  

మిథాలీ రాజ్‌, మంధాన రాణించడంతో ముందుగా బ్యాటింగ్‌ చేసిన భారత్‌ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 198 పరుగులు సాధించింది. మిథాలీ రాజ్‌ 43 బంతుల్లో 7 ఫోర్లుతో 53 పరుగులు చేసింది. మంధాన 40 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు సాధించింది. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 30, వస్త్రకార్‌ 22 పరుగులు బాదారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement