T20I Series
-
సికిందర్ రజా ఊచకోత.. టీ20 క్రికెట్లో పెను సంచలనం
-
మెరిసిన సూర్య.. అదరగొట్టిన బౌలర్లు! తొలి టీ20 భారత్‌దే (ఫోటోలు)
-
India vs South Africa 2nd T20: గెలిచేది ఇక్కడేనా!
గువాహటి: తొలి టి20లో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో శుభారంభం చేసిన టీమిండియా ఇప్పుడు వరుస విజయంతో వరుసగా మరో సిరీస్‌పై కన్నేసింది. ప్రధాన సీమర్ బుమ్రా అనూహ్యంగా గాయంతో వైదొలిగినప్పటికీ భారత బౌలింగ్ ఇప్పుడు పటిష్టమైన బ్యాటింగ్ లైనప్‌కు అదనపు బలగంగా మారడం జట్టు మేనేజ్మెంట్లో ఎక్కడలేని ఉత్సాహం నింపింది. మరోవైపు భారత సొంతగడ్డపై 20 ఫార్మాట్లో మంచి రికార్డు కలిగిన దక్షిణాఫ్రికా జట్టు తిరువనంతపురంలో పేలవమైన ఆటతీరుతో డీలాపడింది. సిరీస్ రేసులో ఉండాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ఈ మ్యాచ్‌కు సిద్ధమైంది. బౌలింగ్‌పై బెంగ లేకపోయినా... బ్యాటింగ్ దళంపై సఫారీ ఆందోళన చెందుతోంది. మ్యాచ్ వేదికైన బర్సాపారా స్టేడియంలో భారత్ రెండు టి20 మ్యాచ్‌లు ఆడింది. 2017లో ఆస్ట్రేలియా చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో భారత్ ఓడిపోయింది. 2020లో భారత్, శ్రీలంక మ్యాచ్ టాస్ వేశాక వర్షం కారణంగా రద్దయింది. నేటి మ్యాచ్‌కు కూడా వాన గండం పొంచి ఉంది. సిరాజ్‌ని ఆడిస్తారా సిరీస్‌లో ఘనమైన శుభారంభంతో భారత జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. స్టార్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తొలి మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ వారి ఫామ్‌పై ఎలాంటి అనుమానాలు లేవు. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. త్వరలో జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందు రోహిత్ బృందానికి అతని సూపర్ ఫామ్ కొండంత బలాన్నిస్తోంది. అతను ఆడే కచ్చితమైన షాట్లు, టైమింగ్, ప్లేసింగ్ ఎలాంటి బౌలర్‌కైనా కలవరపెట్టక మానదు. అతని ఇన్నింగ్స్లవల్లే పంత్, దినేశ్ కార్తీక్‌లకు క్రీజులో సరైన అవకాశాలు రావట్లేదనే చెప్పాలి. ఇక బౌలింగ్ విషయానికొస్తే బుమ్రా స్థానంలో వచ్చిన హైదరాబాద్ స్పీడ్‌స్టర్ సిరాజ్‌ను తుదిజట్టుకు ఆడిస్తారో లేదో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే సీమర్లు చహర్, అర్‡్షదీప్, హర్షల్ పటేల్ వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఒత్తిడిలో సఫారీ గత మ్యాచ్ ఫలితం కంటే ప్రదర్శనే దక్షిణాఫ్రికాకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. ప్రత్యేకించి పరిమిత ఓవర్ల స్పెషలిస్టులు, హిట్టర్లు అందుబాటులో ఉన్న సఫారీ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిన తీరు ఆ జట్టును తీవ్రంగా కలవరపెడుతోంది. మూడు ఓవర్లు ముగియకముందే బ్యాటింగ్ బలగమంతా కకావికలమైంది. టెయిలెండర్ కేశవ్ మహరాజ్ పుణ్యమాని వంద దాటింది. లేదంటే ఆరంభ ఓవర్ల ఆటచూస్తే దక్షిణాఫ్రికాకు 50 పరుగులే కష్టమనిపించింది. ఇప్పుడు భారత బౌలర్లనే కాదు... తప్పక గెలవాల్సిన ఒత్తిడిని ఆ జట్టు ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. నోర్జే, రబడ, పార్నెల్, షమ్సీలతో కూడిన బౌలింగ్ విభాగం మెరుగ్గానే ఉంది. బౌలర్లు పట్టుబిగించాలంటే పోరాడే స్కోర్లు నమోదు కావాలి. లేదంటే గువాహటిలోనే సిరీస్‌ను కోల్పోవాల్సి వస్తుంది. -
కీపింగ్‌లో మొనగాడు ఎంఎస్ ధోని
సాక్షి, స్పోర్ట్స్ (మాంచెస్టర్): మూడు టీ20ల భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టుపై టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతంగా కీపింగ్ చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించిన వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన కీపర్‌గా మహేంద్రుడు ప్రపంచ రికార్డ్ సాధించాడు. పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ పేరిట ఉన్న రికార్డును ‘మిస్టర్ కూల్’ ధోని అధిగమించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 13 ఓవర్లు ముగిసేసరికి కేవలం 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి పటిష్టస్థితిలో ఉంది. అదే ఫామ్ కొనసాగిస్తే ఆతిథ్య జట్టుకు 200 పరుగులు సులువే. కానీ 14వ ఓవర్లో కుల్దీప్ మ్యాజిక్ మొదలైంది. ఈ చైనామన్ బౌలర్ మూడో(ఇన్నింగ్స్14వ) ఓవర్ ఇంగ్లండ్ పతనానికి కారణమైంది. ఓ ఓవర్ తొలి బంతికి ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ (7) ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి అందుకోగా నిరాశగా వెనుదిరిగాడు. అపై అదే ఓవర్లో మూడో బంతికి ధోని అద్భుతంగా స్టంపింగ్ చేయడంతో జానీ బెయిర్‌స్టో (0) ఔటయ్యాడు. ఈ వికెట్‌తో కమ్రాన్ అక్మల్ (32 వికెట్లు) పేరిట ఉన్న స్టంపౌట్ల రికార్డును ఎంఎస్ ధోని సమం చేశాడు. ఆ మరుసటి బంతికే జో రూట్‌ను ధోని స్టంపౌట్ చేసి డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టించాడు మహీ. దీంతో టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ (33) చేసిన వికెట్ కీపరగా ధోని నిలిచాడు. ధోని ఆలోచనల్ని సరిగ్గా అమలుచేసిన కుల్దీప్(5/24) అద్భుత బౌలింగ్‌కు ఇంగ్లండ్ నుంచి సమాధానం కరువై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం లోకేశ్ రాహుల్(101; 54 బంతుల్లో 10ఫోర్లు, 5సిక్సర్లు) అజేయ శతకంతో రాణించగా, ఓపెనర్ రోహిత్ శర్మ (30; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్) పరవాలేదనిపించాడు. కెప్టెన్ కోహ్లితో కలిసి రాహుల్ లక్ష్యాన్ని పూర్తి చేసి సిరీస్‌లో టీమిండియాను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్లు 33 ఎంఎస్ ధోని 32 కమ్రాన్ అక్మల్ 28 మహ్మద్ షెహజాద్ 26 ముష్ఫీకర్ రహీం 20 కుమార సంగక్కర -
కళ్లుచెదిరే బ్యాటింగ్.. భారీ స్కోరు
సాక్షి, ముంబై: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి బ్యాట్‌తో విరుచుకుపడింది. మహిళల ముక్కోణపు టి20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్ధసెంచరీతో అదరగొట్టింది. వేగవంతమైన హాఫ్‌సెంచరీతో రికార్డు సాధించింది. 25 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధసెంచరీ పూర్తి చేసింది. భారత్ తరపున వేగవంతమైన హాఫ్‌సెంచరీ చేసిన బ్యాట్స్‌వుమన్‌గా ఘనతకెక్కింది. మిథాలీ రాజ్, మంధాన రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 198 పరుగులు సాధించింది. మిథాలీ రాజ్ 43 బంతుల్లో 7 ఫోర్లుతో 53 పరుగులు చేసింది. మంధాన 40 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు సాధించింది. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 129 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. హర్మన్‌ప్రీత్ కౌర్ 30, వస్త్రకార్ 22 పరుగులు బాదారు. -
ముక్కోణపు టి20 టోర్నీకి భారత జట్టు
-
కోహ్లి, ధోనీలకు విశ్రాంతి
ముంబై: సుదీర్ఘ దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు ఫార్మాట్లలో ఆడిన నలుగురు భారత క్రికెటర్లకు తర్వాతి టోర్నమెంట్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని సీనియర్ సెలక్షన్ కమిటీ నిర్ణయించింది. వచ్చే నెలలో శ్రీలంకలో జరిగే ముక్కోణపు టి20 టోర్నీ ‘నిదాహస్ ట్రోఫీ’ కోసం ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఆదివారం భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి, బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలను ఈ టోర్నీకి ఎంపిక చేయలేదు. వీరితో పాటు మహేంద్ర సింగ్ ధోని, కుల్దీప్ యాదవ్‌లను కూడా పక్కన పెట్టారు. స్వయంగా ధోని తనకు విశ్రాంతి కావాలని కోరగా... కుల్దీప్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. ‘రాబోయే సిరీస్‌ల షెడ్యూల్, పని భారాన్ని దృష్టిలో ఉంచుకుంటూ నిదాహస్ ట్రోఫీ కోసం జట్టును ఎంపిక చేశాం. ముఖ్యంగా పేస్ బౌలర్లు గాయాలపాలు కాకుండా ఉండేందుకు, మరింత మెరుగైన ప్రదర్శన కోసం తగినంత విశ్రాంతి అవసరమని హై పెర్ఫార్మెన్స్ బృందం సూచించింది. ధోని తనకు విశ్రాంతి కావాలని కోరడం వల్లే అతడిని ఎంపిక చేయలేదు’ అని ఎమ్మెస్కే వెల్లడించారు. విశ్రాంతినిచ్చిన ఆటగాళ్ల స్థానంలో వాషింగ్టన్ సుందర్, విజయ్ శంకర్, దీపక్ హుడా, రిషభ్ పంత్‌ను జట్టులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక కాలేకపోయిన సిరాజ్... విజయ్ హజారే టోర్నీలో 7 మ్యాచ్‌లలో కేవలం 15.65 సగటుతో 23 వికెట్లు పడగొట్టి బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలవడం విశేషం. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు శ్రీలంకతో జరిగిన టి20 సిరీస్‌లో సుందర్ కూడా ఆడగా, హుడాకు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. శ్రీలంకతో టెస్టు సిరీస్ ఎంపికైనా విజయ్ శంకర్‌కు తుది జట్టులో స్థానం దక్కకపోగా... పంత్ భారత్ తరఫున 2 టి20లు ఆడాడు. మరోవైపు ఈ సీజన్లో అన్ని ఫార్మాట్లలో కలిపి 2 వేలకు పైగా పరుగులు చేసిన కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే దేశవాళీ క్రికెట్లో బాగా ఆడినా... కనీసం ఇండియా ‘ఎ’ తరఫున రాణించిన తర్వాతే ఆటగాళ్లను సెలక్షన్ కోసం పరిశీలించడం రివాజుగా పెట్టుకున్నట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. మార్చి 6 నుంచి 18 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్‌తోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పాల్గొంటాయి. భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్ (వైస్ కెప్టెన్), రాహుల్, రైనా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, చహల్, అక్షర్, విజయ్ శంకర్, శార్దుల్, ఉనాద్కట్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సిరాజ్. -
ట్వంటీ 20: అఫ్గాన్ ప్లేయర్ అరుదైన రికార్డ్
గ్రేటర్ నోయిడా: ట్వంటీ 20 ఫార్మాట్ లో అఫ్గనిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో అఫ్గాన్ క్రికెటర్ మహమ్మద్ నబీ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఆరు లేదా ఆ తర్వాత స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి ఓ ట్వంటీ20 మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఫీట్ నెలకొల్పాడు నబీ. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన మూడో ట్వంటీ 20లో నబీ భారీ హాఫ్ సెంచరీ(30 బంతుల్లో 89: 6 ఫోర్లు, 9 సిక్సర్లు) సాధించడంతో అఫ్గాన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి ప్రత్యర్ది ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ క్రమంలో ఆరు లేదా అంతకన్నా దిగువ స్థానాల్లో ఆస్ట్రేలియా ప్లేయర్ వైట్ నెలకొల్పిన అత్యధిక పరుగుల (85 నాటౌట్) రికార్డును అదిగమించాడు. ఆ తర్వాతి స్థానాల్లో స్లాట్లాండ్ క్రికెటర్ మామ్సెన్(68 నాటౌట్), జింబాబ్వే ప్లేయర్ వాల్లర్ (68), పాక్ వెటరన్ ప్లేయర్ మిస్బా ఉల్ హక్ (66 నాటౌట్) ఉన్నారు. 234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 205 పరుగులకే కుప్పకూలింది. 28 పరుగుల తేడాతో అఫ్గాన్ చేతిలో వరుసగా మూడో ట్వంటీ20లోనూ ఓటమిని చవిచూసింది. ఐర్లాండ్ ఓపెనర్లు స్టిర్లింగ్(49), థాంప్సన్(43) తో పాటు కీపర్ విల్సన్ హాఫ్ సెంచరీ(34 బంతుల్లో 59: 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినా ఫలితం దక్కలేదు. ఐర్లాండ్ తన చివరి 5 వికెట్లను కేవలం ఐదు పరుగుల తేడాతో కోల్పోవడం ఆ జట్టు విజయాన్ని అడ్డుకుంది. -
ఉత్కంఠ పోరులో విండీస్‌దే గెలుపు
ఫ్లోరిడా: అమెరికా గడ్డపై తొలి అంతర్జాతీయ టీ20 క్రికెట్ మ్యాచ్ అభిమానులను అలరించింది. భారత్- వెస్టిండీస్ ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా ఫ్లోరిడాలోని లౌడర్ హిల్ మైదానంలో శనివారం ఉదయం(స్థానిక కాలమానం ప్రకారం) జరిగిన మ్యాచ్ లో భారత్ పై వెస్టిండీస్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. యువ సంచలనం కేఎల్ రాహుల్ వీరవిహారం, రోహిత్ శర్మ విజృంభణతో టీమిండియా.. దాదాపు విజయతీరాలకు చేరినప్పటికీ నాటకీయ పరిణామాల మధ్య ఆఖరిబంతికి పరాజయం పాలైంది. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా మ్యాచ్ అసలు ఉద్దేశం(అమెరికన్లకు క్రికెట్ మజాను పంచడంలో)నెరవేర్చడంలో మాత్రం ఇరు జట్లూ విజయం సాధించాయనే చెప్పాలి. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు సాధించింది. ఇది టీ20ల్లోనే మూడో అదిపెద్ద స్కోరు. 246 పరుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే హంసపాదులా ఓపెనర్ రహానే (7), వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ (16)లు తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. దీంతో మరో ఓపెనర్ రోహిత్ శర్మ.. సెకెండ్ డౌన్ కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ విజృంభించాడు. 28 బంతులు ఆడిన రోహిత్.. 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 62 పరుగులు పిండుకుని 12వ ఓవర్ లో మూడో వికెట్ గా ఔటయ్యాడు. మరోవైపు యువ సంచలనం కేఎల్ రాహుల్ తనదైన శైలిలో షాట్లు కొడుతూ 51 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 110 పరుగులు చేశాడు. ఇది అతనికి తొలి టీ20 సెంచరీ కావడం విశేషం. 25 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్ బాదిన ధోనీ 43 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు చేయాల్సి ఉండగా రాహుల్, ధోనీలు షాట్లు కొట్టకుండా కూల్ గా నెట్టుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఘోర పరాజయాన్ని చవిచూశారు. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి ఉండగా ధోనీ కొట్టిన షాట్ ను శామ్యూల్స్ ఒడిసిపట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా 244 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను ముగించింది. రెండు టీ20ల సిరీస్ లో విండీస్ 1-0తో ముందంజలో ఉంది. విండీస్ బౌలర్లలో బ్రావో రెండు వికెట్లు, రసెల్, పొలార్డ్ లు తలో వికెట్ చేజిక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ కు విండీస్ బ్యాట్స్ మన్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే చుక్కలు చూపించారు. ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ టీ20 చరిత్రలోనే మూడో అతిపెద్ద స్కోరు 245(20 ఓవర్లలో) సాధించారు. ఓపెనర్ లెవిస్ 100(49 బంతుల్లో 9 సిక్సర్లు, 5 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా, అతని భాగస్వామి చార్లెస్ 33 బంతుల్లో 79 పరుగులు చేసి 10 ఓవర్లో తొలి వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన ఆండీ రసెల్ 22(12 బంతులు), పొలార్ట్ 22(15 బంతులు) తమవంతు పాత్ర పోషించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన విండీస్ 245 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో బుమ్రా, రవీంద్ర జడేజాలు చెరో రెండు వికెట్లు నేలకూల్చగా, షమి ఒక్క వికెట్ పడగొట్టాడు.