
పుణె : సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటిరోజు ఆటలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. 91 బంతుల్లో 8 ఫోర్లతో విరాట్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతనికిది 23వ అర్ధసెంచరీ. అనంతరం కొద్దిసేపటికి తగిన వెలుతురు లేక అంపైర్లు తొలిరోజు ఆటను 85.1 ఓవర్ల వద్ద నిలిపివేశారు. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 273 - 3 గా ఉంది. విరాట్ కోహ్లీ 63 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, రహానే 18 పరుగులతో (70 బంతులు) తగిన సహకారాన్ని అందిస్తున్నాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 147 బంతుల్లో 75 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకు ముందు భారత ఓపెనర్ మయాంక్‌అగర్వాల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment