
పుణె : స్థానిక మైదానంలో ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ తీసుకుంది. తొలి టెస్టు హీరో రోహిత్ శర్మ (14) తక్కువ స్కోరుకే అవుటవగా, వన్‌డౌన్‌లో వచ్చిన పుజారా (58) అర్ధసెంచరీ చేసి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సమయోచితంగా ఆడుతూ సెంచరీ (108) చేసిన కొద్దిసేపటికే స్లిప్‌లో దొరికిపోయాడు. ప్రస్తుతం కోహ్లీ, రహానే క్రీజులో ఉన్నారు. 64 ఓవర్లకుగాను భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 199 పరుగులుగా ఉంది. కాగా, టీమిండియా కోల్పోయిన మూడు వికెట్లూ సౌతాఫ్రికా పేసర్ కగిసో రబడకే దక్కడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment