జొహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి 101 బంతుల్లో 9 ఫోర్లతో కెరీర్‌లో 16 హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే.. లుంగిసాని ఎంగిడి బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది.
అంతకు ముంది కోహ్లికి లైఫ్‌రాగా దానిని సద్వినియోగం చేసుకోని హాఫ్ సెంచరీ సాధించాడు. రబాడ వేసిన 20.1వ బంతికి కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను మిడాఫ్‌లో ఉన్న ఫిలాండర్ సరిగ్గా అంచనా వేయలేక నేలపాలు చేశాడు. ఈ సారి డివిలియర్స్ కోహ్లికి ఆ అవకాశం ఇవ్వలేదు. క్రీజులో పుజారా(21), రహానే(0)లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment