ఐపీఎల్ 2022 సీజన్‌లో విరాట్ కోహ్లి ఎట్టకేలకు హాఫ్ సెంచరీతో మెరిశాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్ అందుకున్నాడు. సీజన్ ఆరంభం నుంచి విఫలమవుతూ వచ్చిన కోహ్లి.. గుజరాత్‌తో మ్యాచ్‌లో కాస్త నిలకడ ప్రదర్శించాడు. మ్యాచ్‌లో నిధానంగా ఆడినప్పటికి 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. ఓవరాల్‌గా 53 బంతుల్లో 6 ఫోర్లు,ఒక సిక్సర్‌తో 58 పరుగులు సాధించాడు. కాగా కోహ్లి అర్థసెంచరీ మార్క్ అందుకోవడానికి 15 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు.
50ప్లస్ స్కోరు సాధించడానికి కోహ్లి ఎక్కువ ఇన్నింగ్స్‌లు తీసుకోవడం ఇది రెండోసారి. ఇంతకముందు 2009, 2010 ఎడిషన్స్‌లో కోహ్లకి 18 ఇన్నింగ్స్‌ల పాటు అర్థసెంచరీ చేయలేకపోయాడు.ఇక కోహ్లి ఐపీఎల్‌లో ఫిప్టీ ప్లస్ స్కోరు సాధించే క్రమంలో మూడోసారి అత్యంత తక్కువ స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో(53 బంతుల్లో 58 పరుగులు, 109.43 స్ట్రైక్‌రేట్‌తో), 2017లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌పై (48 బంతుల్లో 55 పరుగులు, 114.58 స్ట్రైక్‌రేట్‌తో), 2020లో సీఎస్‌కేపై (43 బంతుల్లో 50 పరుగులు, 116.28 స్ట్రైక్‌రేట్‌తో) సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment