3 వన్డేల సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా విజయం దిశగా సాగుతుంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. మహ్మద్ షమీ (3/18), మహ్మద్ సిరాజ్ (1/10), శార్దూల్ ఠాకూర్ (1/26), హార్ధిక్ పాండ్యా (2/16), కుల్దీప్ యాదవ్ (1/29), వాషింగ్టన్ సుందర్ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్‌ను 108 పరుగులకు ఆలౌట్ చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో గ్లెన్ ఫిలిప్స్ (36), మైఖేల్ బ్రేస్‌వెల్ (22), మిచెల్ సాంట్నర్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 13 ఓవర్ల తర్వాత వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (47 బంతుల్లో 50 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో 48వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (31 బంతుల్లో 20; 3 ఫోర్లు) ఆచితూచి ఆడుతున్నాడు. కివీస్ బౌలర్లు వికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం దక్కడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment